ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం 16వ తూర్పు ఆసియా శిఖర సమ్మేళనం లో వీడియో కాన్ఫరెన్స్ విధానంలో పాల్గొన్నారు. ఇఎఎస్ మరియు ఆసియాన్ అధ్యక్ష హోదా లో బ్రూనేయి 16వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు ను నిర్వహించింది. సమ్మేళనం లో ఆసియాన్ దేశాల నేతల తో పాటు ఇఎఎస్ లోని ఇతర దేశాలు సహా ఆస్ట్రేలియా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, అమెరికా మరియు భారతదేశం ల నేత లు పాలుపంచుకొన్నారు. భారతదేశం ఇఎఎస్ లో క్రియాశీల భాగస్వామ్యాన్ని కలిగిఉంది. ప్రధాన మంత్రి పాల్గొన్న 7వ తూర్పు ఆసియా శిఖర సమ్మేళనం ఇది.
ఇండో-పసిఫిక్ ప్రాంతం లో అగ్ర భూమిక ను పోషించడం లో ఇఎఎస్ యొక్క ప్రాధాన్యాన్ని ప్రధాన మంత్రి శిఖర సమ్మేళనం లో పునరుద్ఘాటిస్తూ, ఈ సంస్థ కీలకమైన వ్యూహాత్మక అంశాలపై చర్చించడం కోసం దేశాల ను ఒక చోటు కు తీసుకువస్తోందన్నారు. టీకామందు, చికిత్స సంబంధి సామగ్రి సరఫరాల ద్వారా కోవిడ్-19 మహమ్మారి పై పోరాడడం లో భారతదేశం ప్రయాసల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. మహమ్మారి తరువాత భారతదేశం మరోమారు తన కాళ్ల మీద నిలబడడం లో సాయపడ్డ “ఆత్మనిర్భర్ భారత్” ఉద్యమాన్ని గురించి ఆయన వివరించారు. ప్రపంచం లో ఉత్పాదకత ను పెంచాలని, ఆ ఉత్సాదనల ను పరస్పరం పంచుకోవడం లో ఆటుపోటుల ను తట్టుకొని నిలబడేందుకు పూచీపడాలని ఆయన కోరారు. ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, ఇంకా జలవాయువుల ను ప్రభావితం చేయనటువంటి జీవన శైలి కి మధ్య ఉత్తమమైన సంతులనాన్ని సంతరించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాల పైన కూడా చర్చించడం జరిగింది. ఆయా అంశాల లో ఇండో-పసిఫిక్, దక్షిణ చైనా సముద్రం, యుఎన్ సిఎల్ఒఎస్, ఉగ్రవాదం, కొరియా ద్వీపకల్పం, మ్యాంమార్ లలో స్థితి వంటివి ప్రస్తావన కు వచ్చాయి. ప్రధాన మంత్రి ఇండో-పసిఫిక్ ప్రాంతం లో “ఆసియాన్ సెంట్రలిటీ” పై పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం లో ఆసియాన్ భూమిక (ఎఒఐపి) లోను, ఇండో-పసిఫిక్ ఓశన్ స్ ఇనిశియేటివ్ (ఐపిఒఐ) లోను భారతదేశం క్రియాశీలత్వాన్ని ప్రత్యేకం గా ప్రస్తావించారు.
మానసిక ఆరోగ్యం , పర్యటన ల మాధ్యమం ద్వారా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం, సుస్థిరమైన రీతి న కోలుకోవడం.. ఈ మూడు అంశాల మీద మూడు ప్రకటనల ను ఇఎఎస్ నేత లు ఆమోదించారు. ఈ మూడు ప్రకటనల ను ప్రాయోజితం చేసిన దేశాల లో భారతదేశం కూడా భాగం పంచుకొంది. మొత్తం మీద ప్రధాన మంత్రి కి, ఇఎఎస్ నేతల కు మధ్య దృష్టికోణాల తాలూకు ఫలప్రదమైనటువంటి ఆదాన ప్రదానం లో ఈ సమ్మేళనం చాలా వరకు సఫలం అయింది.