ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జమైకా ప్రధాని మాన్య శ్రీ ఏండ్ర్ యూ మాయికల్ హోనెస్ టెలిఫోన్ లో మాట్లాడి, శ్రీ మోదీ యొక్క పార్టీ చరిత్రాత్మకమైన ఎన్నికల విజయాన్ని సాధించినందుకు గాను ఆయన కు అభినందనల ను తెలియజేశారు.
తనకు శ్రీ హోనెస్ ఆత్మీయ శుభాకాంక్షల ను తెలియజేసినందుకు, అంత క్రితం అభినందన పూర్వక లేఖ ను వ్రాసినందుకు కూడా ప్రధాన మంత్రి శ్రీ మోదీ శ్రీ హోనెస్ కు ధన్యవాదాలు పలికారు. జమైకా తో, యావత్తు కరీబియన్ ప్రాంతం తో సంబంధాల కు భారతదేశం అగ్ర ప్రాధాన్యాన్ని కట్టబెట్టినట్టు ఆయన స్పష్టం చేశారు. సిఎఆర్ఐసిఒఎం డివెలప్‌మెంట్ ఫండ్ లో ఒక అంతర్జాతీయ అభివృద్ధి భాగస్వామి కావాలని ఈ సంవత్సరం ఆరంభం లో భారతదేశం తీసుకొన్న నిర్ణయాని కి ఆ ప్రాంతం తో ప్రగాఢమైనటువంటి ఆర్థిక సహకారాన్ని నెలకొల్పుకోవాలన్న భారతదేశపు బలమైన వాంఛ మార్గదర్శిగా నిలచిందని ఆయన పేర్కొన్నారు.
కరిబీయన్ ప్రాంతం తోను, జమైకా తోను సంబంధాల పై భారతదేశం వహిస్తున్న శ్రద్ధ ను ప్రధాని శ్రీ హోనెస్ స్వాగతించారు. ఈ సంబంధాల ను పరస్పర ప్రయోజనాలు ముడిపడ్డ అన్ని రంగాల లో బలవత్తరంగా మార్చుకోవడం తో పాటు జల వాయు పరివర్తన రువ్వుతున్న సవాళ్ల ను సమర్థం గా పరిష్కరించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ మోదీ తో కలసి పని చేయాలని తాను గట్టిగా కోరుకొంటున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు.