ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మక లువాంగ్ రాయల్ థియేటర్- ప్రబాంగ్ లో ప్రదర్శించిన ఫలక్ ఫలం లేదా ఫ్రా లక్ ఫ్రా రామ్ అని పిలిచే లావో రామాయణం ఒక ఎపిసోడ్‌ను వీక్షించారు. లావోస్‌లో రామాయణ ప్రదర్శన నేటికీ కొనసాగుతోంది. ఈ ఇతిహాసం రెండు దేశాల భాగస్వామ్య వారసత్వం, పురాతన నాగరికత సంబంధాన్ని తెలియజేస్తోంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో చాలా వాటిని శతాబ్దాలుగా లావోస్‌లో ఆచరిస్తున్నారు, సంరక్షిస్తున్నారు. ఇరు దేశాలు తమ భాగస్వామ్య వారసత్వాన్ని వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి. లావోస్‌లోని వాట్ ఫౌ ఆలయం, సంబంధిత స్మారక చిహ్నాలను పునరుద్ధరించే పనిలో భారత పురాతత్వ శాఖ నిమగ్నమైంది. హోం మంత్రి, విద్య, క్రీడల మంత్రి, బ్యాంక్ ఆఫ్ లావో పీడీఆర్ గౌరవ గవర్నర్, వియంటియాన్ మేయర్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రామాయణ ప్రదర్శనకు ముందు, వియంటియాన్‌లోని సీ సాకేత్ ఆలయ అధిపతి మహావేత్ మసేనాయ్ నేతృత్వంలో లావో పీడీఆర్ సెంట్రల్ బుద్దిస్ట్ ఫెలోషిప్ ఆర్గనైజేషన్‌కు చెందిన సీనియర్ బౌద్ధ భిక్షువులు ప్రధానమంత్రిని ఆశీర్వదించారు. భారత్, లావోస్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల్లో ఈ బౌద్ధ వారసత్వం ఓ కోణం.