ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు న్యూ ఢిల్లీ లో గల లోక్ కల్యాణ్ మార్గ్ లోని తన నివాసం లో నారీశక్తి పురస్కార గ్రహీతల తో ఇష్టాగోష్ఠి సమావేశం లో పాల్గొంటారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా ప్రధాన మంత్రి ట్విటర్ ఖాతా ను రేపు నారీ విజేతలు నిర్వహిస్తారు.
రాష్ట్రపతి భవన్ లో రేపు నిర్వహించే కార్యక్రమం లో రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ ‘నారీశక్తి పురస్కార’ ప్రదానం చేస్తారు.
మహిళల అభ్యున్నతికి… ప్రత్యేకించి బలహీన, అణగారినవర్గాల మహిళా సాధికారత కోసం చేసిన కృషి కి గుర్తింపు గా వ్యక్తులు, సమూహాలు, సంస్థల కు ఏటా ఈ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.