జాపాన్ ప్రధాని శ్రీ ఫుమియొ కిశిదా ఆహ్వానించిన మీదట జాపాన్ అధ్యక్షత న జరిగే జి-7 సమిట్ కు హాజరు కావడం కోసం జాపాన్ లోని హిరోశిమా కు నేను పయనం అవుతున్నాను. ఇండియా-జాపాన్ సమిట్ లో పాలుపంచుకోవడం కోసం ప్రధాని శ్రీ కిశిదా ఇటీవలే భారతదేశాన్ని సందర్శించిన తరువాత మరో సారి ఆయన ను కలుసుకోవడం ఆనందదాయకమే కాగలదు. భారతదేశం జి-20 కి అధ్యక్షత ను వహిస్తున్న ఈ సంవత్సరం లో, జి-7 శిఖర సమ్మేళనాని కి నేను హాజరు కానుండడం మరీ ముఖ్యం గా మహత్వపూర్ణమైందేనని చెప్పాలి. నేను జి-7 సభ్యత్వ దేశాల తో మరియు ఆహ్వానాలు అందిన సభ్యత్వ దేశాల తో ప్రపంచం ఎదుటకు వస్తున్నటువంటి సవాళ్లకు మరియు వాటినన్నింటిని ఉద్దేశించి సామూహికం గా ప్రసంగించడం ద్వారా సంబంధి ఆలోచనల ను వెల్లడించడం కోసం ఉత్సాహంతో ఉన్నాను. దీనికి తోడు హిరోశిమా జి-7 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొనే కొందరు నేతల తో కలసి ద్వైపాక్షిక సమావేశాల ను సైతం నేను నిర్వహించనున్నాను.

 

జాపాన్ సందర్శన అనంతరం పాపువా న్యూ గినీ లోని పోర్ట్ మోరెస్ బీ ని నేను సందర్శిస్తాను. పాపువా న్యూ గినీ కి ఇది నా ఒకటో యాత్ర; భారతదేశాని కి చెందిన ప్రధాన మంత్రి ఒకరు పాపువా న్యు గినీ ని సందర్శించనుండడం ఇదే మొదటి సారి అవుతుంది. 2023 మే నెల 22 వ తేదీ న పాపువా న్యూ గినీ ప్రధాని శ్రీ జేమ్స్ మారాపే తో నేను కలసి ఫోరమ్ ఫార్ ఇండియా-పసిఫిక్ ఐలండ్స్ కోఆపరేశన్ మూడో శిఖర సమ్మేళనం (ఎఫ్ఐపిఐసి III సమిట్) కు ఆతిథేయి గా వ్యవహరిస్తాను. ఈ ముఖ్యమైనటువంటి శిఖర సమ్మేళనాని కి హాజరు కావాలంటూ పంపించిన ఆహ్వానాల ను పసిఫిక్ ఐలండ్ కంట్రీస్ (పిఐసి) లోని మొత్తం 14 సభ్యత్వ దేశాలు స్వీకరించినందు కు నేను కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను. ఎఫ్ఐపిఐసి ని 2014 వ సంవత్సరం లో ఫిజీ ని నేను సందర్శించిన కాలం లో ప్రారంభించడం జరిగింది. మరి నేను పిఐసి నేతల తో మమ్మల్ని ఒక వేదిక మీదకు తీసుకు వచ్చిన అంశాల పై మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆ అంశాల లో జలవాయు పరివర్తన మరియు సతత అభివృద్ధి, సామర్థ్య నిర్మాణం, ఇంకా శిక్షణ, ఆరోగ్యం మరియు శ్రేయస్సు, మౌలిక సదుపాయాల కల్పన, ఇంకా ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలు భాగం గా ఉన్నాయి.

 

ఎఫ్ఐపిఐసి కార్యక్రమాల కు అదనం గా పాపువా న్యూ గినీ గవర్నర్ జనరల్ సర్ శ్రీ బాబ్ డాడే తో, ప్రధాని శ్రీ మారాపే తో మరియు శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొనే పిఐసి కి చెందిన ఇతర నేతల లో కొందరి తో ద్వైపాక్షిక చర్చ జరిపే విషయమై నేను ఉత్సాహపడుతున్నాను.

 

దీని తరువాత, ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ అల్బనీజ్ ఆహ్వానించిన మీదట నేను ఆస్ట్రేలియా లోని సిడ్ నీ కి వెళ్తాను. భారతదేశం-ఆస్ట్రేలియా సమావేశం కోసం నేను ఆసక్తి తో ఉన్నాను. అది మన ద్వైపాక్షిక సంబంధాల ను సమీక్షించడాని కి మరియు ఈ సంవత్సరం లో మార్చి నెల లో న్యూ ఢిల్లీ లో జరిగిన ఒకటో ఇండియా-ఆస్ట్రేలియా వార్షిక శిఖర సమ్మేళనానికి తరువాయి కార్యాచరణ పై చర్చించడానికి లభించే ఓ అవకాశం కాగలదు. నేను ఆస్ట్రేలియా లో సిఇఒల తో, వ్యాపార జగతి కి చెందిన ప్రముఖుల తో కూడా ను సమావేశమవుతాను. మరి సిడ్ నీ లో ఏర్పాటు చేసిన ఒక విశిష్ట కార్యక్రమం లో నేను పాల్గొని, అక్కడి భారతీయ సముదాయాన్ని సైతం కలుసుకొంటాను.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi