మిత్రులారా, నమస్కారం.
చంద్ర గ్రహం చెంత కు చేరుకోవడం కోసం సంకల్పించిన చంద్రయాన్-3 యొక్క సాఫల్యం మన మువ్వన్నెల జెండా ను సమున్నతం గా రెప రెపలాడిస్తున్నది. శివశక్తి పాయింట్ సరిక్రొత్త ప్రేరణ కు కేంద్రం గా మారింది. మరి అలాగే తిరంగా పాయింట్ మనకు గర్వకారణమైంది. ఆ తరహా కార్యసిద్ధులు సాకారం అయినప్పుడు వాటిని ఆధునికత్వం, విజ్ఞాన శాస్త్రం, ఇంకా సాంకేతిక విజ్ఞానం లతో జతకలిపి చూడడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే ఈ విధమైన సత్తా ప్రపంచం ఎదుట కు వస్తుందో అప్పుడు భారతదేశానికి అనేక సంభావ్యత లు, అనేక అవకాశాలు మన ముంగిట కు వచ్చి వాలతాయి. జి-20 కి లభించినటువంటి అపూర్వమైన సాఫల్యం, 60 కి పైగా సభా స్థలాల లో ప్రపంచవ్యాప్త నేతల కు స్వాగతం పలకడం, మేథోమథన సమావేశాలు జరగడం, సమాఖ్య స్వరూపం వాస్తవిక స్ఫూర్తి తో కళ్ళ కు కట్టడం.. వీటి ద్వారా జి-20 లో మన వైవిధ్యాన్ని మరియు మన అద్వితీయత్వాన్ని ఒక ఉత్సవం మాదిరి జరుపుకోవడమైంది. జి-20 లో గ్లోబల్ సౌథ్ దేశాల కు వాణి గా మారినందుకు భారతదేశం సదా గర్వించగలుగుతుంది. ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం మరియు జి-20 లో ఏకగ్రీవం గా డిక్లరేశను ను ఆమోదించడం.. ఈ విషయాలు అన్నీ భారతదేశాని కి ప్రకాశవంతమైనటువంటి భవిష్యత్తు ఉంది అనే సంకేతాన్ని ఇస్తున్నాయి.
నిన్నటి రోజు న, ఒక అంతర్జాతీయ సమావేశ కేంద్రం ‘యశోభూమి’ ని దేశ ప్రజల కు అంకితం చేయడమైంది. ఆ రోజు న విశ్వకర్మ జయంతి కూడా; మరి విశ్వకర్మ జయంతి భారతదేశం లో విశ్వకర్మ సముదాయం యొక్క సాంప్రదాయక నైపుణ్యాల ను ఘనం గా ఒక ఉత్సవం వలె జరుపుకొనే సందర్భం. శిక్షణ, ఆధునిక పనిముట్టు లు మరియు ఒక తాజా వైఖరి తో కూడినటువంటి ఆర్థిక నిర్వహణ.. ఇవి భారతదేశం లో విశ్వకర్మ యొక్క సామర్థ్యాల ను వృద్ధి చెందింప చేస్తూ, దేశం యొక్క అభివృద్ధి యాత్ర లో వాటి వంతు తోడ్పాటు ను అందిస్తున్నాయి. ఈ కార్యక్రమాలు ఒక ఉత్సవ వాతావరణాన్ని, ఉల్లాసవంతమైనటువంటి వాతావరణాన్ని మరియు విశ్వాసాన్ని అంకురింప చేసి, దేశం అంతటా ప్రజల లో ఓ సరిక్రొత్త ఆత్మవిశ్వాస భావన ను పాదుగొల్పాయి. అదే కాలం లో ఈ పార్లమెంటు సమావేశాలు ఒక క్రొత్త నేపథ్యం లో చోటు చేసుకొంటూ ఉండడం ప్రముఖమైంది గా ఉంది. ఇవి స్వల్పకాలం సమావేశాలే కావచ్చు, అయితే చరిత్రాత్మకమైన నిర్ణయాల పరం గా వీటికి గొప్ప ప్రాముఖ్యమంటూ ఉంది. ఇది భారతదేశం యొక్క 75 సంవత్సరాల ప్రయాణం లో ఒక క్రొత్త దశ ప్రారంభం కావడాన్ని సూచిస్తున్నది. ఏ స్థాయి లో అయితే ఈ ప్రయాణం ఆరంభమై 75 సంవత్సరాలు పట్టిందో, ఆ స్థితి ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి ఘట్టం. మరి ప్రస్తుతం ఈ ప్రస్థానాన్ని ముందుకు తీసుకు పోతూ, మనం 2047 వ సంవత్సరం లో ఈ దేశాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి దేశం గా తీర్చిదిద్ది తీరాలి. ఈ లక్ష్యాన్ని నూతన సంకల్పం తో, నవీనమైన శక్తి తో, క్రొత్త విశ్వాసం తో అనుకొంటున్న కాలం లోపే సాధించవలసి ఉంటుంది. సమీప భవిష్యత్తు లో అన్ని నిర్ణయాల ను ఈ క్రొత్త పార్లమెంటు భవనం లో తీసుకోవడం జరుగుతుంది. ఈ కారణం గా ఎన్నో రకాలు గా ఈ సమావేశాలు కీలకం కానున్నాయి.
ఈ స్వల్ప కాల సమావేశాల ను ఉత్సాహం తో, సకారాత్మక భావన తో వీలైనంత వరకు సద్వినియోగ పరచుకోవలసింది గా గౌరవ సభ్యులు అందరి కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆరోపణ లు చేయడాని కి , ప్రత్యారోపణల ను చేయడాని కి చాలినంత కాలం ఉంది. జీవనం లో కొన్ని ఘడియ లు మనల ను ఉత్సాహం తో మరియు ఆశ తో నింపి వేస్తాయి. ఈ స్వల్ప కాల సమావేశాల ను నేను ఇదే కోణం లో చూస్తున్నాను. పాతవైన వ్యతిరేక ధోరణుల ను వదలి వేసి, ఉత్తమమైనటువంటి ఉద్దేశ్యాల తో మనం అందరం సరిక్రొత్త పార్లమెంటు లోకి అడుగు పెడతామని, మరి నూతన పార్లమెంటు లో విలువల ను ఇనుమడింప చేయడం కోసం శాయశక్తుల యత్నిస్తామన్న ఆశ నాలో ఉంది. ఇది గౌరవనీయులైన సభ్యులు అందరు ఈ విధమైనటువంటి క్రొత్త ప్రతిజ్ఞ ను పూనడానికి కీలకమైన తరుణం ఇదే.
రేపటి రోజు న పవిత్రమైనటువంటి గణేశ చతుర్థి పండుగ ఉంది. భగవాన్ గణేశుడు విఘ్నాల ను నివారస్తాడని భావిస్తుంటాం. ఇప్పుడు భారతదేశం యొక్క అభివృద్ధి యాత్ర లో ఎటువంటి అడ్డంకి ఎదురవదు. భారతదేశం అన్ని కలల ను, అన్ని సంకల్పాల ను నిర్విఘ్నం గా నెరవేర్చుకొంటుంది. మరి ఇందువల్ల గణేశ చతుర్థి రోజు ఈ నవ ప్రస్థానం క్రొత్త భారతదేశం యొక్క స్వప్నాలు అన్నింటినీ సాకారం చేసేది గా అవుతుంది. అందుకని కూడాను ఈ సమావేశాలు చిన్నవే అయినప్పటికీ చాలా విలువల తో కూడుకొనేవి గా ఉన్నాయి.
మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు.