Quote‘‘పౌరులు ఎదుర్కొంటున్న సమస్యల కు శాశ్వత పరిష్కారాల ను అందించడం తో పాటు పౌరుల కు సాధికారిత ను కల్పించాలన్నది మాప్రభుత్వం యొక్క ధ్యేయం గా ఉంది’’
Quote‘‘ఒక ఆధునిక భారతదేశాన్ని నిర్మించడం లో మౌలిక సదుపాయాలు, విస్తృతి మరియు వేగం.. వీటి కి గలప్రాముఖ్యాన్ని మేం అర్థం చేసుకొన్నాం’’
Quote‘‘మా ఆలోచనల సరళి ముక్కలు ముక్కలు గా లేదు, సంతృప్తి పరచే విధానాన్ని మేం విశ్వసించడం లేదు’’
Quote‘‘మేం సఫలంఅయ్యాం మరి మేం సాంకేతిక విజ్ఞానాన్ని సామాన్య పౌరుల కు సాధికారిత ను కల్పించడం కోసం ఉపయోగిస్తున్నాం’’
Quote‘‘డిజిటల్ ఇండియా యొక్క సాఫల్యం యావత్తు ప్రపంచం దృష్టి ని ఆకట్టుకొన్నది’’
Quote‘‘మేం జాతీయ పురోగతి పైన శ్రద్ధ తీసుకొన్నాం; ప్రాంతీయ ఆకాంక్షల పట్ల కూడా శ్రద్ధ వహించాం’’
Quote‘‘ ‘భారతదేశం 2047 వ సంవత్సరానికల్లా ‘వికసిత్ భారత్’ గా రూపొందాలి అన్నది మా సంకల్పం గా ఉంది’’

పార్లమెంటు ను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగాని కి ధన్యవాదాల ను తెలియజేసే తీర్మానాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రాజ్య సభ లో సమాధానం ఇచ్చారు. రాష్ట్రపతి గారు ఆమె యొక్క ప్రసంగం లో ‘వికసిత్ భారత్’ తాలూకు దృష్టి కోణాన్ని ఆవిష్కరించడం ద్వారా ఉభయ సభల కు మార్గదర్శకత్వాన్ని వహించినందుకు ఆమె కు ప్రధాన మంత్రి ధన్యవాదాల ను పలుకుతూ, తన సమాధానాన్ని మొదలు పెట్టారు.

ఇదివరకటి కాలాల కు భిన్నం గా ‘‘మా ప్రభుత్వం ధ్యేయం పౌరుల కు శాశ్వత పరిష్కారాల ను అందించడమూ, మరి వారి కి సాధికారిత ను కల్పిలంచడమూను’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రజల సమస్యల కు పరిష్కారాల ను చూపించడం మునుపటి కాలాల లో అధికారం లో ఉన్న ప్రభుత్వం యొక్క బాధ్యత గా ఉండగా, వారికి భిన్నమైనటువంటి ప్రాధాన్యాలు మరియు ఉద్దేశ్యాలు ఉండేవి అని ఆయన అన్నారు. ‘‘ప్రస్తుతం మేం సమస్యల కు శాశ్వత పరిష్కారాల ను కనుగొనే దిశ లో సాగుతున్నాం’’ అని ఆయన అన్నారు. నీటి కి సంబంధించిన అంశాన్ని ఒక ఉదాహరణ గా ప్రధాన మంత్రి ప్రస్తావించి, ఏవో కొన్ని వర్గాల ను తృప్తి పరచడాని కి బదులు జల సంబంధి మౌలిక సదుపాయాల ను కల్పించడం, వాటర్ గవర్నెన్స్, నాణ్యత నియంత్రణ, జలాన్ని పొదుపు గా వాడుకోవడం, ఇంకా సేద్యం లో నూతన ఆవిష్కరణ లను ప్రవేశపెట్టడం వంటి ఒక సమగ్ర విధానం తో ముందుకు పోతున్నాం అన్నారు. అన్ని వర్గాల వారికీ ఆర్థిక సేవల ను అందించడం, జన్ ధన్-ఆధార్-మొబైల్ ల మాధ్యం ద్వారా ప్రత్యక్ష ప్రయోజనం బదలాయింపు (డిబిటి), మౌలిక సదుపాయాల కల్పన సంబంధి ప్రణాళిక రచన, ఇంకా పిఎమ్ గతిశక్తి మాస్టర్ ప్లాన్ ద్వారా ఆయా ప్రణాళికల ను అమలు పరచడం వంటి చర్య లు శాశ్వత పరిష్కారాల ను అందించాయి అని ఆయన వివరించారు. ‘‘మేం మౌలిక సదుపాయాల కల్పన, విస్తృతి, ఇంకా వేగం అనేటటువంటి వాటి కి ఒక ఆధునిక భారతదేశం నిర్మాణం లో ఉన్న ప్రాముఖ్యాన్ని గ్రహించాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సాంకేతిక విజ్ఞానం యొక్క శక్తి ద్వారా దేశం లోని శ్రమ సంస్కృతి లో మార్పు ను తీసుకురావడమైంది; మరి ప్రభుత్వం వేగాన్ని మరియు విస్తృతి ని పెంచడం పైన శ్రద్ధ వహించింది అని ఆయన స్పష్టం చేశారు.

‘‘ ‘శ్రేయం’ (మెరిట్) మరియు ‘ప్రియం’ (డియర్) అనే మాటల ను మహాత్మ గాంధీ చెబుతూ ఉండే వారు. వాటి లో నుండి ‘శ్రేయం’ అనే దారి ని మేం ఎంచుకొన్నాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యం ఉన్న మార్గాన్ని ప్రభుత్వం ఎంపిక చేసుకోలేదు, దానికి భిన్నం గా సామాన్యుల ఆకాంక్షల ను నెరవేర్చడం కోసం రేయింబవళ్లు అలుపెరుగక పాటుపడే మార్గాన్ని మేం ఎంచుకొన్నాం అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

ఆజాదీ కా అమృత్ కాల్ లో పథకాల ఫలితాలు అందరికీ అందేటట్టు చూసే దిశ లో ప్రభుత్వం ముఖ్యమైన చర్య ను తీసుకొంది అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. ప్రయోజనాలు దేశం లో ప్రతి ఒక్క లబ్ధిదారు కు చేరుకొనే విధం గా ప్రభుత్వం యొక్క ప్రయాసలు ఉంటున్నాయి అని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘వాస్తవిక మతాతీవాదం అంటే ఇది. వివక్ష ను మరియు అవినీతి ని ఇది నిర్మూలిస్తుంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

‘‘ఆదివాసి సముదాయాల అభివృద్ధి దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం బారి న పడ్డది. వారి సంక్షేమాని కి మేం పెద్ద పీట ను వేశాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఆదివాసీ సంక్షేమాని కి అంటూ ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ను అటల్ బిహారీ వాజ్ పేయీ గారు ప్రధాన మంత్రి గా ఉన్న కాలం లో ఏర్పాటు చేయడం జరిగింది; మరి ఆదివాసీ సంక్షేమం కోసం ఏకోన్ముఖమైన ప్రయత్నాలు సాగాయి అని ప్రధాన మంత్రి తెలిపారు.

‘‘భారతదేశ వ్యవసాయ రంగాని కి వెన్నెముక చిన్న రైతు లు. వారి ని బలపరచేందుకు మేం కృషి చేస్తున్నాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. చిన్న రైతుల ను చాలా కాలం పాటు చిన్నచూపు చూస్తూ రావడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వారి అవసరాల పై శ్రద్ధ వహిస్తున్నది. చిన్న రైతుల కు తోడు చిన్న వ్యాపారాలను చేసుకొనే వర్గాల వారి కోసం మరియు చేతివృత్తుల వారి కోసం అనేకమైన అవకాశాల ను కల్పించడమైంది అని ప్రధాన మంత్రి అన్నారు. మహిళల కు సశక్తీకరణ కోసం, భారతదేశం లో ప్రతి ఒక్క మహిళ యొక్క జీవనం తాలూకు ప్రతి దశ లో జీవన సౌలభ్యాన్ని ఏర్పరచడం కోసం మరియు మహిళల కు గౌరవం దక్కేటట్లుగా చూడడం కోసం తీసుకొన్నటువంటి చర్యల ను గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు.

భారతదేశం యొక్క శాస్త్రజ్ఞులు, నూతన ఆవిష్కర్త లు మరియు టీకామందు తయారీదారుల ను నిరుత్సాహ పరిచేందుకు కొంత మంది ప్రయత్నించిన దాని తాలూకు దురదృష్టకర ఘటనల ను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘మన శాస్త్రవేత్త లు మరియు నూతన ఆవిష్కర్త ల ప్రావీణ్యం తాలూకు అండదండల తో ప్రపంచాని కి ఒక ఫార్మా హబ్ గా రూపొందుతోంది’’ అని వ్యాఖ్యానించారు. అటల్ ఇనొవేశన్ మిశన్ మరియు టింకరింగ్ ల్యాబ్స్ ల వంటి చర్యల ద్వారా విజ్ఞాన శాస్త్రపరమైన అభిరుచి ని పెంపొందింపచేయడం గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాల ను పూర్తి స్థాయి లో వినియోగించుకొంటున్నందుకు మరియు ప్రయివేటు ఉపగ్రహాల ను ప్రయోగిస్తున్నందుకు శాస్త్రవేత్తల ను మరియు యువతీ యువకుల ను ఆయన అభినందించారు. ‘‘మనం సఫలం అయ్యాం మరి సాంకేతిక విజ్ఞానాన్ని సామాన్య పౌరుల సశక్తీకరణ కు ఉపయోగించుకొంటున్నాం’’ అని ఆయన అన్నారు.

‘‘దేశం ప్రస్తుతం డిజిటల్ లావాదేవీల లో ప్రపంచానికి నాయకత్వం వహించే స్థానానికి చేరుకొంది. డిజిటల్ ఇండియా యొక్క సాఫల్యం ఇవాళ యావత్తు ప్రపంచం దృష్టి ని ఆకట్టుకొంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం మొబైల్ ఫోన్ లను దిగుమతి చేసుకొన్నటువంటి కాలం అంటూ ఒకటి ఉండేది అని ఆయన గుర్తు చేస్తూ, మొబైల్ ఫోన్ లు ఇతర దేశాల కు ఎగుమతి అవుతున్నందుకు మనం ఇప్పుడు గర్విస్తున్నాం అని ప్రధాన మంత్రి అన్నారు.

‘‘భారతదేశం 2047వ సంవత్సరం కల్లా ‘వికసిత భారత్’ గా రూపొందాలి అనేది మన సంకల్పం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. మనం ఎదురుచూస్తూ ఉన్నటువంటి అవకాశాల ను అందిపుచ్చుకోవడాని కి ప్రభుత్వం అనేక ముఖ్యమైన చర్యల ను తీసుకొంది అని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘భారతదేశం ఒక పెద్ద ముందడుగు ను వేయడాని కి సిద్ధం గా ఉంది, ఇక వెనుదిరిగి చూడటం అన్నది లేనే లేదు’’ అని చెప్తూ, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

 

 

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

  • krishangopal sharma Bjp December 18, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
  • krishangopal sharma Bjp December 18, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
  • krishangopal sharma Bjp December 18, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
  • Reena chaurasia August 29, 2024

    बीजेपी
  • Babla sengupta December 28, 2023

    Babla sengupta
  • mr_rana_parshant December 15, 2023

    आदरणीय प्रधानमंत्री जी, आपसे जो सबसे ज्यादा निवेदन है कि इस बात पर ज्यादा ध्यान देना चाहिए कि युवा शक्ति का प्रयोग किस दिशा में और किस प्रकार से हो रहा है। क्योंकि हम सभी जानते हैं की किसी भी देश की मजबूत नींव में उस देश के युवाओं का बहुत अधिक योगदान होता है। युवाओं को सही दिशा न मिल पाने के कारण ही कहीं न कहीं इनका ध्यान गलत चीज़ों जैसे नशे आदि में बढ़ता ही जा रहा है। इस क्षेत्र में कुछ ऐसे नियम बनाए जाने की आवश्यकता है जिनका उल्लंघन करने पर दंड प्रक्रिया हो, तभी नियमों का उचित प्रकार से पालन हो सकता है।
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp November 02, 2023

    Jay shree Ram
  • Mohan singh Dharmraj March 31, 2023

    🇮🇳 आपकी सरकार का उद्देश्य आपकी नीयत अनुरूप नहीं, इसलिए भृष्टाचार बेलगाम है। देश को आपकी जरूरत है भृष्टाचारियों की नहीं, ये कैसे हो पायेगा सुझाऐं मन की बात मे, क्योंकि मोदी है तो मुमकिन है🚩जय हो भृष्टाचार-जय भाजपा सरकार🚩
  • Amit Pal Singh February 25, 2023

    Bharat mata ki Jai🙏🙏🙏
  • ckkrishnaji February 15, 2023

    🙏
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Big desi guns booming: CCS clears mega deal of Rs 7,000 crore for big indigenous artillery guns

Media Coverage

Big desi guns booming: CCS clears mega deal of Rs 7,000 crore for big indigenous artillery guns
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 మార్చి 2025
March 21, 2025

Appreciation for PM Modi’s Progressive Reforms Driving Inclusive Growth, Inclusive Future