Quote‘‘అభివృద్ధి చెందినటువంటి భారతదేశం తాలూకు పునాది నిబలపరచడాని కి హామీ ని వికసిత్ భారత్ బడ్జెటు ఇస్తుంది’’
Quote‘‘కొనసాగింపుతాలూకు విశ్వసనీయత ను ఈ బడ్జెటు తన వెంట తీసుకు వస్తున్నది’’
Quote‘‘యువ భారత్ యొక్కఆకాంక్షల కు ఈ బడ్జెటు అద్దం పడుతోంది’’
Quote‘‘మనం ఒక పెద్ద లక్ష్యాన్ని ఏర్పరచుకొని, దానిని సాధించాం; ఇక మన కోసం మరింత పెద్దదైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకొన్నాం’’
Quote‘‘పేదల కు మరియుమధ్యతరగతి వర్గాల కు సాధికారిత కల్పన పైన బడ్జెటు దృష్టి ని కేంద్రీకరించింది’’

ఈ రోజు న సమర్పించినటువంటి బడ్జెటు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘‘ఈ బడ్జెటు ఒక తాత్కాలిక బడ్జెటు మాత్రమే కాదు, ఇది ఒక సమ్మిళితమైనటువంటి మరియు వినూత్నమైనటువంటి బడ్జెటు’’ అని ఆయన అన్నారు. ‘‘కొనసాగింపు తాలూకు నమ్మకాన్ని ఈ బడ్జెటు మోసుకు వచ్చింది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ బడ్జెటు ‘‘వికసిత్ భారత్ యొక్క స్తంభాలు అన్నింటినీ అంటే ఇక్కడ యువత, పేదలు, మహిళలు, మరియు రైతుల కు సాధికారిత ను కల్పిస్తుంది’’ అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ ను ఆమె వ్యక్త పరచిన దృష్టికోణాని కి గాను ప్రధాన మంత్రి కొనియాడుతూ, ‘‘నిర్మల గారి బడ్జెటు దేశ భవిష్యత్తు నిర్మాణాని కి ఉద్దేశించినటువంటి ఒక బడ్జెటు గా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘2047 వ సంవత్సరాని కల్లా వికసిత్ భారత్ యొక్క పునాది ని బలపరచడం అనేటటువంటి హామీ ని ఈ బడ్జెటు తీసుకు వచ్చింది’’ అని కూడా ఆయన అన్నారు.

 

|

‘‘ఈ బడ్జెటు యంగ్ ఇండియా యొక్క ఆకాంక్షల కు ఒక ప్రతిబింబం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర వ్యాఖ్యానించారు. బడ్జెటు లో తీసుకొన్న రెండు ముఖ్యమైన నిర్ణయాల ను ఆయన ప్రముఖం గా ప్రకటిస్తూ, ‘‘పరిశోధన మరియు నూతన ఆవిష్కరణల కోసం ఒక లక్ష కోట్ల రూపాయల నిధి ని ప్రకటించడం జరిగింది’’ అన్నారు. దీనికి తోడు, స్టార్ట్-అప్స్ కు పన్ను మినహాయింపు లను ఈ బడ్జెటు లో పొడిగించడాన్ని ఆయన ప్రస్తావించారు.

విత్త లోటు ను అదుపు లో ఉంచుతూనే, మొత్తం వ్యయం పరం గా చరిత్రాత్మకమైనటువంటి రీతి లో పెంచి 11,11,111 కోట్ల రూపాయల కు చేర్చడమైంది అని ప్రధాన మంత్రి తెలిపారు. ‘‘ఆర్థికవేత్త ల మాటల లో చెప్పుకోవాల్సి వస్తే గనుక ఇది ఒక విధమైన తీయనైన కబురు’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇది భారతదేశం లో 21 వ శతాబ్ది కి చెందిన ఆధునిక మౌలిక సదుపాయాల సృజన తో పాటే యువతీ యువకుల కు లక్షల కొద్దీ క్రొత్త ఉద్యోగ అవకాశాల ను అందిస్తుంది అని కూడా ఆయన అన్నారు. వందే భారత్ ప్రమాణాలు కలిగి ఉండేటటువంటి 40,000 ఆధునిక రైలుపెట్టెల ను తయారు చేయడాని కి ఒక ప్రకటన దీనిలో ఉంది అని ఆయన వెల్లడించారు. ఆ రైలుపెట్టెల ను జనరల్ పాసింజర్ రైలు బళ్ల లో అమర్చడం జరుగుతుంది, దీనితో దేశం లో వేరు వేరు రైలు మార్గాల లో కోట్ల కొద్దీ ప్రయాణికుల కు ప్రయాణం లో సౌఖ్యం అధికం అవుతుంది అని ఆయన చెప్పారు.

మహత్వాకాంక్ష తో కూడినటువంటి లక్ష్యాల ను నిర్దేశించుకొన్నట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్తూ, ‘‘మనం ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొని దానిని సాధించాం, మరి ఇక మీదట మరింత పెద్దదైన లక్ష్యాన్ని మన కోసం నిర్దేశించుకొన్నాం’’ అని వివరించారు. పేద ప్రజ యొక్క సంక్షేమానికి మరియు మధ్యతరగతి వర్గాల వారి యొక్క సంక్షేమాని కి ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాల ను గురించి ఆయన ప్రముఖం గా ప్రస్తావిస్తూ, పల్లెల లో మరియు నగరాల లో నాలుగు కోట్ల కు పైగా ఇళ్ళ ను నిర్మించడం తో పాటుగా తత్సంబంధి లక్ష్యాన్ని మరో రెండు కోట్ల గృహాల కు పెంచడం జరిగింది అని వెల్లడించారు. ‘‘మహిళల లో రెండు కోట్ల మంది ‘లక్షాధికారుల’ ను తయారు చేయాలి అనేది మా యొక్క లక్ష్యం గా ఉండింది; ప్రస్తుతం ఈ లక్ష్యాన్ని మూడు కోట్ల మంది ‘లక్షాధికారుల’ ను తయారు చేయాలి అనే స్థాయి కి వృద్ధి చెందింప చేయడమైంది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

|

పేదల కు చెప్పుకోదగిన స్థాయి లో ఆర్థిక సహాయాన్ని ఆయుష్మాన్ భారత్ యోజన అందిస్తూ ఉండడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ, ఈ పథకం తాలూకు ప్రయోజనాల ను ఆంగన్‌వాడీ మరియు ఎఎస్ హెచ్ ఎ (‘ఆశా’) కార్యకర్తల కు పొడిగిస్తున్నట్లు తెలిపారు.

పేదల కు మరియు మధ్య తరగతి కి క్రొత్త అవకాశాల ను కల్పించడాని కి ఈ బడ్జెటు లో ప్రాధాన్యాన్ని ప్రభుత్వం ఇచ్చింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రూఫ్ టాప్ సోలర్ కేంపైన్ ను గురించి ఆయన ప్రస్తావించారు. ఈ పథకం లో భాగం గా ఒక కోటి కుటుంబాలు ఉచిత విద్యుత్తు సదుపాయాన్ని దక్కించుకోనున్నాయి. అదే కాలం లో మిగులు విద్యుత్తు ను ప్రభుత్వాని కి అమ్మడం ద్వారా ఏటా 15,000 రూపాయలు మొదలుకొని 18,000 రూపాయల ఆదాయాన్ని కూడా సంపాదించేందుకు వీలు ఉంటుందని ఆయన ప్రస్తావించారు.

ఆదాయపు పన్ను తగ్గింపు పథకాన్ని ఈ రోజు న ప్రకటించి న సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఇది మధ్య తరగతి కి చెందిన సుమారు ఒక కోటి మంది పౌరుల కు ఉపశమనం అందజేయగలదన్నారు. బడ్జెటు లో రైతుల సంక్షేమం కోసం తీసుకొన్న ప్రధానమైన నిర్ణయాల ను గురించి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, నానో డిఎపి వినియోగం, పశువుల కోసం ఒక క్రొత్త పథకం, పిఎమ్ మత్స్య సంపద యోజన యొక్క విస్తరణ మరియు రైతుల ఆదాయాన్ని పెంచి, రైతుల ఖర్చుల ను తగ్గించేటటువంటి ఆత్మ నిర్భర్ నూనె గింజ సంబంధి ప్రచార ఉద్యమం వంటివి దీనిలో ఉన్నాయి అని పేర్కొన్నారు. ఈ చరిత్రాత్మకమైనటువంటి బడ్జెటు ను సమర్పించిన సందర్భం లో పౌరులు అందిరికీ ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను తెలియజేస్తూ, తన ప్రసంగాన్ని ముగించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s fruit exports expand into western markets with GI tags driving growth

Media Coverage

India’s fruit exports expand into western markets with GI tags driving growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 ఫెబ్రవరి 2025
February 22, 2025

Citizens Appreciate PM Modi's Efforts to Support Global South Development