మిత్రులారా!
భారతదేశం విశ్వాసం, ఆధ్యాత్మికత మరియు సంప్రదాయాల వైవిధ్యభరితమైన నేల. ప్రపంచంలోని అనేక ప్రధాన మతాలు ఇక్కడే పుట్టాయి, ప్రపంచంలోని ప్రతి మతం ఇక్కడ గౌరవాన్ని పొందుతుంది.
'ప్రజాస్వామ్యానికే మాతృమూర్తి లాంటి భారత్ లో సంప్రదింపులు, ప్రజాస్వామ్య సూత్రాలపై ఎప్పటి నుంచో మాకు అచంచలమైన విశ్వాసం ఉంది. ప్రపంచంతో మా వ్యవహారం మొత్తం 'వసుధైవ కుటుంబకం' అనే ప్రాథమిక సూత్రంలో ఇమిడి ఉంది. అంటే 'ప్రపంచం ఒకే కుటుంబం' అనే భావన మాది. ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్న మా ఆలోచన ప్రతి భారతీయుడిని ఇదంతా 'ఒక భూమి' అన్న బాధ్యతను ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ 'వన్ ఎర్త్' స్ఫూర్తితో భారతదేశం 'పర్యావరణ మిషన్ కోసం జీవనశైలి'ని అలవరుచుకుంది. భారతదేశం చొరవ, మీ మద్దతుతో, వాతావరణ భద్రత సూత్రాలకు అనుగుణంగా ప్రపంచం మొత్తం ఈ సంవత్సరం 'అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం'ని జరుపుకుంటుంది. ఈ స్ఫూర్తికి అనుగుణంగా, భారతదేశం కాప్ -26లో 'గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ - వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్'ని ప్రారంభించింది.
నేడు, పెద్ద ఎత్తున సౌర విప్లవం చోటుచేసుకున్న దేశాల సరసన భారతదేశం నిలుస్తుంది. లక్షలాది మంది భారతీయ రైతులు సహజ వ్యవసాయాన్ని స్వీకరించారు. మానవ ఆరోగ్యంతో పాటు నేల, భూమి ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఇది పెద్ద ప్రచార కార్యక్రమం. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచడానికి మేము భారతదేశంలో 'నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్'ని కూడా ప్రారంభించాము. భారతదేశం జి-20 ప్రెసిడెన్సీ సమయంలో, మేము గ్లోబల్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి ముఖ్యమైన చర్యలు చేపట్టాము.
మిత్రులారా!
వాతావరణ మార్పు అనే సవాలును దృష్టిలో ఉంచుకుని, శక్తి పరివర్తన 21వ శతాబ్దపు ప్రపంచానికి ముఖ్యమైన అవసరం. సమ్మిళిత శక్తి పరివర్తన కోసం ట్రిలియన్ల డాలర్లు అవసరం. సహజంగానే, అభివృద్ధి చెందిన దేశాలు ఇందులో చాలా కీలక పాత్ర పోషిస్తాయి.
భారతదేశంతో పాటు, 2023లో అభివృద్ధి చెందిన దేశాలు సానుకూల చొరవ తీసుకున్నందుకు గ్లోబల్ సౌత్‌లోని అన్ని దేశాలు సంతోషిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు మొదటిసారిగా పర్యావరణం కోసం ఆర్థిక సహాయం (క్లైమేట్ ఫైనాన్స్) కోసం తమ 100 బిలియన్ డాలర్ల నిబద్ధతను నెరవేర్చడానికి సుముఖత వ్యక్తం చేశాయి.
గ్రీన్ డెవలప్‌మెంట్ ఒప్పందాన్ని స్వీకరించడం ద్వారా, జి-20 స్థిరమైన, హరిత వృద్ధికి తన చెప్పిన హామీకి కట్టుబడి ఉన్నట్టు పునరుద్ఘాటించింది.
మిత్రులారా,
సమిష్టి కృషి స్ఫూర్తితో, ఈ రోజు, ఈ జి-20 వేదికపై భారతదేశం కొన్ని సూచనలు చేసింది.
ఇంధన మిశ్రణం విషయంలో అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయడం నేటి అవసరం. పెట్రోల్‌లో ఇథనాల్‌ను 20 శాతం వరకు కలపడానికి ప్రపంచ స్థాయిలో చొరవ తీసుకోవాలనేది మా ప్రతిపాదన.
లేదా ప్రత్యామ్నాయంగా, వాతావరణ భద్రతకు సహకరిస్తూనే స్థిరమైన ఇంధన సరఫరాను నిర్ధారించే గొప్ప ప్రపంచ ప్రయోజనాల కోసం మేము మరొక బ్లెండింగ్ మిశ్రమాన్ని అభివృద్ధి చేయడంలో పని చేయవచ్చు.
ఈ నేపథ్యంలో ఈరోజు గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్‌ను ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని భారతదేశం మీ అందరినీ ఆహ్వానిస్తోంది.
మిత్రులారా,
పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని, కార్బన్ క్రెడిట్‌పై దశాబ్దాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కార్బన్ క్రెడిట్ ఏమి చేయకూడదో నొక్కి చెబుతుంది; ఇది ప్రతికూల దృక్పథాన్ని కలిగి ఉంటుంది.
తత్ఫలితంగా, ఏ సానుకూల చర్యలు తీసుకోవాలో వాటిపై తగు శ్రద్ధ కనిపించడం లేదు. సానుకూల కార్యక్రమాలకు ప్రోత్సాహం కరువైంది.
గ్రీన్ క్రెడిట్ మాకు ముందు మార్గాన్ని చూపుతుంది. ఈ సానుకూల ఆలోచనను ప్రోత్సహించడానికి, జి-20 దేశాలు 'గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్'పై పని చేయడం ప్రారంభించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.
మిత్రులారా,
భారతదేశం మూన్ మిషన్, చంద్రయాన్ విజయం గురించి మీ అందరికీ తెలుసు. దాని నుండి పొందిన డేటా మానవాళి అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇదే స్ఫూర్తితో భారత్ 'జి20 ఉపగ్రహ మిషన్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ అబ్జర్వేషన్'ను ప్రారంభించాలని ప్రతిపాదిస్తోంది.
అక్కడి వాతావరణం, వాతావరణ డేటా అన్ని దేశాలతో, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలతో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చేరాల్సిందిగా అన్ని జి-20 దేశాలను భారత్ ఆహ్వానిస్తోంది.
మిత్రులారా,
మరొక్కసారి, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం మరియు అభినందనలు.
ఇప్పుడు, నేను మీ ఆలోచనలను వినడానికి ఆసక్తిగా ఉన్నాను.
We have to move ahead with a human centric approach. pic.twitter.com/0GhhYD5j7o
— PMO India (@PMOIndia) September 9, 2023
Mitigating global trust deficit, furthering atmosphere of trust and confidence. pic.twitter.com/Yiyk5f7y9j
— PMO India (@PMOIndia) September 9, 2023
India has made it a 'People's G20' pic.twitter.com/PpPGBdXn8C
— PMO India (@PMOIndia) September 9, 2023