ఇంటర్‌నేశనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఇఎ) యొక్క మంత్రుల స్థాయి సమావేశం ఈ రోజు న జరగగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రధాన మంత్రి తన సంబోధన లో ఇంటర్ నేశనల్ ఎనర్జీ ఏజెన్సీ కి 50 వ వార్షికోత్సవ వేళ అభినందనల ను తెలియ జేస్తూ, ఈ సమావేశాని కి సహ అధ్యక్షత భారాన్ని వహిస్తున్నందుకు గాను ఐర్లండ్ కు మరియు ఫ్రాన్స్ కు కృతజ్ఞత ను కూడా వ్యక్తం చేశారు.
చిరకాలిక వృద్ధి ని నమోదు చేయాలి అంటే గనుక శక్తి భద్రత మరియు స్థిరత్వం లను అనుసరించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. భారతదేశం పదేళ్ళ కాలం లో పదకొండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఉన్నది కాస్తా అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఎలా ఎదిగిందో ఆయన వివరించారు. అదే కాలం లో, భారతదేశం ప్రపంచం లోఅత్యంత వేగం గా వృద్ధి చెందుతున్నటువంటి ప్రముఖ ఆర్థిక వ్యవస్థ గా కూడా మారిపోయిందని ప్రధాన మంత్రి అన్నారు. అలాగే, భారతదేశం సౌర శక్తి సామర్థ్యం ఇరవై ఆరు రెట్ల మేరకు వృద్ధి ని నమోదు చేయడం తో పాటు గా దేశం యొక్క నవీకరణయోగ్య శక్తి సామర్థ్యం రెట్టింపు అయింది కూడా అని ఆయన చెప్పారు. ‘‘మేం ఈ విషయం లో మా యొక్క పేరిస్ వాగ్దానాల ను నిర్ణీత కాల పరిమితుల కంటె ముందుగానే నెరవేర్చాం.’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రపంచ జనాభా లో 17 శాతం మంది కి నిలయం గా భారతదేశం ఉంటోంది; అయినప్పటికీ కూడా ప్రపంచం లో కెల్లా అతి పెద్దవైన శక్తి లభ్యత కార్యక్రమాల ను కూడా నిర్వహిస్తోంది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. భారతదేశం యొక్క కర్బన ఉద్గారాలు ప్రపంచ వ్యాప్త కర్బన ఉద్గారాల లో నాలుగు శాతం గా మాత్రమే లెక్క కు వస్తున్నాయి అని ఆయన తెలిపారు. ఒక సామూహికమైనటువంటి మరియు జరుగబోయే మార్పుల ను అంచనా వేసి ముందస్తు గా తగిన సకారాత్మక చర్యల ను తీసుకొనే విధానాన్ని అవలంభించడం ద్వారా జలవాయు పరివర్తన సంబంధి సమస్యల ను ఎదుర్కనేందుకు దేశం తీసుకొన్న సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘ఇంటర్‌నేశనల్ సోలర్ అలయన్స్ వంటి కార్యక్రమాల కు భారతదేశం ఇప్పటికే నాయకత్వాన్ని వహించింది. మా మిశన్ ఎల్ఐఎఫ్ఇ (Mission LiFE) సమష్టి ప్రభావాన్ని ప్రసరించేటటువంటి భూ గ్రహ మిత్రపూర్వకమైన జీవనశైలి అవకాశాల పై శ్రద్ధ ను తీసుకొంటోంది. ‘రిడ్ యూస్, రీయూస్ ఎండ్ రీసైకిల్’ (‘తగ్గించడం, మళ్ళీ వాడడం మరియు పునర్వినియోగం లోకి తీసుకు రావడం’) అనేవి భారతదేశం అవలంబిస్తున్నటువంటి సాంప్రదాయిక జీవన శైలి లో భాగం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. జి-20 కి భారతదేశం అధ్యక్ష బాధ్యత లను వహించిన కాలం లో గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్సు ను ప్రారంభించడాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఈ కార్యక్రమాన్ని సమర్థించినందుకు గాను ఐఇఎ కు ధన్యవాదాల ను తెలియ జేశారు.
అన్ని వర్గాల ను కలుపుకొనిపోయే వైఖరి ఏ ఒక సంస్థ యొక్క సామర్థ్యాన్ని అయినా మరియు విశ్వసనీయత ను అయినా పెంపొందింప చేస్తుంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, ప్రతిభ, సాంకేతిక విజ్ఞానపరమైన శక్తి యుక్తులు మరియు నూతన ఆవిష్కరణ ల విషయం లో 1.4 బిలియన్ మంది భారతదేశ పౌరులు తోడ్పాటు ను ఇవ్వగలరు అన్నారు. ‘‘మేం ప్రతి ఒక్క మిశను కు విస్తృతి ని, వేగాన్ని, పరిమాణాన్ని మరియు నాణ్యత ను జతపరుస్తాం’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం పోషించేటటువంటి ఒక ప్రముఖ పాత్ర తో ఐఇఎ కు భారీ ప్రయోజనం అందుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఐఇఎ యొక్క మంత్రుల స్థాయి సమావేశం ఫలప్రదం కావాలి అంటూ ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను తెలియ జేశారు. ఇప్పటికే అమలవుతున్నటువంటి భాగస్వామ్యాల ను బలపరచడం కోసం, మరి అలాగే కొత్త భాగస్వామ్యాల ను ఏర్పరచుకోవడం కోసం ఈ వేదిక ను ఉపయోగించుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘రండి .. మనమంతా స్వచ్ఛమైనటువంటి, కాలుష్యాని కి తావు ఉండనటువంటి మరియు అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటి ఒక ప్రపంచాన్ని నిర్మించుదాం’’ అని చివర లో శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.