Quote“కలిసి ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ సంఘీభావం , ఐక్యతా శక్తి వికసిత్ భారత్ కు ప్రధాన ఆధారం.
Quote‘‘‘ఒక జీవితం, ఒక లక్ష్యం అన్నదానికి ఆచార్య గోయంకా అద్భుతమైన ఉదాహరణ.. వారి లక్ష్యం ఒక్కటే – విపాసన,
Quoteస్వీయ పరిశీలన ద్వారా స్వీయ పరివర్తనా పథమే విపాసన..
Quoteప్రస్తుతం సవాళ్లతో కూడిన కాలంలో విపాసన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా పనికి, జీవితానికి మధ్య సమతూకం లేకపోవడం,జీవనశైలి, ఇతర సమస్యల కారణంగా యువత ఒత్తిడికి గురౌతున్న పరిస్థితులలో విపాసన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Quoteవిపాసనను మరింత ఆమోదయోగ్యమైనదిగా చేసేందుకు భారత్ నాయకత్వం వహించాల్సిఉంది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , ఆచార్య ఎస్,ఎన్.గోయంకా  శతజయంతి ఉత్సవాల  ముగింపు సందర్బంగా వీడియో మాధ్యమం ద్వారా సందేశం ఇచ్చారు.

విపాసన ధ్యాన బోధకులు ఆచార్య శ్రీ ఎస్.ఎన్. గోయంకా శతజయంతి వేడుకలు సంవత్సరం క్రితం ప్రారంభమైన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధానమంత్రి, దేశం అమృత్ మహోత్సవాన్ని జరుపుకున్నదని చెబుతూ,ఇదే సమయంలో కల్యాణ్ మిత్ర గోయంకా ఆదర్శాలను వారు గుర్తుచేసుకున్నారు..ఈ ఉత్సవాలు ఈరోజు ముగింపు దశకు చేరుకుంటున్న సందర్బంలో దేశం శరవేగంతో వికసిత్ భారత్ తీర్మానాలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నదని ప్రధానమంత్రి అన్నారు. గురూజీ తరచూ వాడే బుద్ధభగవానుడి మంత్రాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,, దాని అర్ధాన్ని వివరించారు. కలసి ధ్యానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ఐక్యత, ఏకత్వ శక్తి వికసిత్ భారత్కు ప్రధాన పునాది అని ప్రధానమంత్రి అన్నారు. ఏడాదిపొడవునా ఈ మంత్రాన్ని ప్రచారం చేసినవారందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీ గోయంకా జీతో తన అనుబంధాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. గుజరాత్లో తాను వారిని  పలుమార్లు కలుసుకున్నట్టు చెప్పారు. తొలిసారిగా తాము ఐక్యరాజ్యసమితి ప్రపంచ మత సమ్మేళనంలో కలుసుకున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.
శ్రీ గోయంకాజీ చరమదశలో వారిని చూసే భాగ్యం దక్కిందని, ఆచార్యులవారిని తెలుసుకుని వారిని అర్ధం చేసుకునే  అవకాశం దక్కిందని ఆయన తెలిపారు.

 శ్రీ గోయంకా విపాసనను ఎంతో గంభీరంగా తనలో ఇముడ్చుకున్నారని, వారు ఎక్కడికి వెళ్లినా ఒక పవిత్రభావన వెల్లివిరిసేదని ప్రధానమంత్రి అన్నారు. ఒక జీవితం, ఒక లక్ష్యం అనేదానికి శ్రీ గోయంకా గారు ఒక గొప్ప ఉదాహరణ అని ప్రధానమంత్రి అన్నారు. శ్రీ గోయంకాగారి ఒకే ఒక లక్ష్యం విపాసన అని ప్రధానమంత్రి తెలిపారు. విపాసన జ్ఞానాన్నివారు ప్రతి ఒక్కరికీ అందిచ్చారని తెలిపారు. ఆ రకంగా వారు మానవాళికి, మొత్తం ప్రపంచానికి గొప్ప సేవ చేశారని తెలిపారు.

 ప్రాచీన భారతీయ జీవన విధానం ప్రపంచానికి అందించిన అద్భుతమైన బహుమతి విపాసన అయినప్పటికీ, ఈ గొప్ప సంస్కృతి దేశంలో ఎంతో కాలం కనిపించలేదని, విపాసన బోధన, అభ్య సన అంతిమ దశకు చేరుకున్నట్టనిపించిందని ప్రధానమంత్రి అన్నారు. అయితే, శ్రీ గోయంకా జీ 14 సంవత్సరాలు మయన్మార్లో తపస్సు చేసి విపాసన జ్ఞానసముపార్జన చేశారని, తిరిగి విపాసన ఔన్నత్యంతో భారతదేశానికి తిరిగివచ్చారని అన్నారు.విపాసన ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,“ఇది స్వీయ పరిశీలన ద్వారా స్వయం పరివర్తనా పథమని ’’”ప్రధానమంత్రి అన్నారు. వేలాది సంవత్సరాల క్రితం దీనిని ప్రవేశపెట్టినపుడు దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉండేదని ప్రధానమంత్రి తెలిపారు. ఇప్పుడు దీని ప్రాధాన్యత మరింత పెరిగిందని తెలిపారు. ప్రపంచంలోని సవాళ్లను పరిష్కరించగల శక్తి దీనికి ఉందని ప్రధానమంత్రి తెలిపారు.గురూజీ కృషి కారణంగా, ప్రపంచంలోని 80 కి పైగా దేశాలు ధ్యానం ప్రాధాన్యతను తెలుసుకుని దీనిని అనుసరిస్తున్నాయని తెలిపారు.

 

|

 ఆచార్య శ్రీ గోయంకాజీ మరోసారి విపాసనకు అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచారు. ఇవాళ ఇండియా మరింత బలంగా దీనిని విస్తరింపచేసేందుకు ముందుకు వచ్చింది. అని ప్రధానమంత్రి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఐక్యరాజ్యసమితిలోని 190 కి పైగా దేశాలు మద్దతునిచ్చిన విషయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్బంగా గుర్తుచేశారు. ఆరకంగా యోగా ప్రపంచ జీవనంలో భాగమైందని తెలిపారు. భారతదేశ పూర్వీకులు విపాసన యోగ ప్రక్రియల గురించి ఎంతో పరిశోధన చేశారని అయితే ఆ తర్వాతి తరాలు వాటి ప్రాధాన్యతను విస్మరించారని అన్నారు. విపాసన ధ్యానం, ధారణ అనేవి పునరేకీకరణకు, ప్రజలకు సంబంధించినవని, అయితే దీని పాత్రను విస్మరించారన్నారు. విపాసన లో ఆచార్య శ్రీ ఎస్.ఎన్. గోయంకా నాయకత్వాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా గురూజీని స్మరించుకుంటూ,

‘‘‘‘ఆరోగ్యకరమైన జీవితం మనందరి బాధ్యత అని ప్రధానమంత్రి అన్నారు. విపాసన ప్రయోజనాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ  ప్రధానమంత్రి, ప్రస్తుతం సవాళ్లతో కూడిన ప్రపంచంలో విపాసన ప్రాధాన్యత మరింత పెరిగిందని చెప్పారు. యువత రకరకాల ఒత్తిళ్లలో నలిగిపోతున్నదన్నారు. పనికి జీవితానికి మధ్య సమతూకం లేకపోవడం, జీవనశైలి, ఇతర కారణాల వల్ల యువత ఒత్తిడికి   గురవుతున్నారన్నారు.

ఇది కేవలం వారికి మాత్రమే ఒక పరిష్కారం  కాదని, సూక్ష్మ, చిన్న కుటుంబాలకు, వయోధికులైన తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడికిగురౌతున్న వారికి  కూడా ఇది ఒక పరిష్కారమని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ వయోధికులతో ఇలాంటి చొరవ విషయంలో ఒకరితో ఒకరు అనుసంధానం కావాలని సూచించారు.

 

ప్రధానమంత్రి ఆచార్య గోయంకా కృషిని ప్రశంసిస్తూ, ప్రతి ఒక్కరి జీవితం శాంతియుతమైన, సంతోషదాయకమైన, విధంగా ఉండేలా తన ప్రచారాన్ని కొనసాగించారన్నారు.భవిష్యత్ తరాలు ఈ ప్రచార ప్రయోజనాలను పొందాలని వారు ఆకాంక్షించారని , అందువల్ల వారు ఈ విషయంలో తమకుగల జ్ఞానాన్ని పంచుతూ వచ్చారని తెలిపారు. వారు ఇంతటితో ఆగకుండా సుశిక్షితులైన ఉపాధ్యాయులను తయారు చేశారన్నారు. ప్రధానమంత్రి మరోసారి విపాసన గురించి వివరిస్తూ ఇది ఆత్మలోకి ప్రయాణమని, మన లోలోపలికి ప్రయాణమని వారు తెలిపారు.అయితే, ఇది ఒక విధానం  మాత్రమే కాదు, శాస్త్ర విజ్ఞానమని ప్రధానమంత్రి అన్నారు. ఈ శాస్త్రవిజ్ఞాన ఫలితాలు ఎటువంటివో మనందరికీ తెలుసునని, అయితే ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను మనం ఆధునిక శాస్త్రవిజ్ఞాన ప్రమాణాలకు అనుగుణంగా, ప్రపంచంముందు ఉంచవలసి ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఈ దిశగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతో జరుగుతున్నదని, భారతదేశం ఈ విషయంలో నాయకత్వాన్ని అందుకుని నూతన పరిశోధనల ద్వారా మరింత ఆమోదయోగ్యతను తీసుకురావాలని, ప్రపంచ మానవాళి సంక్షేమానికి ఈ పని చేయాలని ప్రధానమంత్రి అన్నారు.ఆచార్య ఎస్.ఎన్.గోయంకా శతజయంతి సంవత్సరం అందరికీ ప్రేరణాత్మక మని,వారి కృషిని మానవ సేవకోసం మరింత ముందుకు తీసుకుపోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు..

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Manufacturing sector pushes India's industrial output growth to 5% in Jan

Media Coverage

Manufacturing sector pushes India's industrial output growth to 5% in Jan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 మార్చి 2025
March 13, 2025

Viksit Bharat Unleashed: PM Modi’s Policies Power India Forward