యువర్ మెజెస్టి,
ఎక్సలెన్సీస్
నమస్కారం,
తూర్పు ఆసియా శిఖరాగ్ర సమ్మేళనంలో మరోసారి పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.
అధ్యక్షుడు విడోడో అద్భుత నాయకత్వానికి నా అభినందనలు. అంతే కాదు, ఈ సమావేశానికి పరిశీలకులుగా
విచ్చేసిన,హిజ్ ఎక్సలెన్సీ తిమోర్ లెస్టీ ప్రధానమంత్రి క్సానానా గుస్ మావో కు అభినందనలు తెలియజేస్తున్నాను.
తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం ఒక కీలక ప్లాట్ఫారం .
ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక అంశాలపై చర్చలకు
సహకారానికి వివిధ దేశాల నాయకుల సారథ్యంలోని కీలక వేదిక ఇది. దీనికితోడు ఇది ఆసియాలో విశ్వాసాని పాదుకొల్పే
కీలక బాధ్యతను వహిస్తోంది. ఏసియాన్ కేంద్రితంగా ఉండడం దీని విజయానికి కారణం
యువర్ మెజెస్టీ, ఎక్సలెన్సీస్....
ఇండో పసిఫిక్పై ఏసియాన్ దృక్పథాన్ని ఇండియా పూర్తిగా సమర్థిస్తుంది. ఇండో పసిఫిక్ విషయంలో ఇండియా, ఏసియాన్ దార్శనికత
ఏకరీతిలో ఉంది. ఇండో పసిఫిక్ సముద్ర కార్యకలాపాల అమలులో తూర్పు ఆసియా శిఖరాగ్ర సమ్మేళనం ఎంత కీలకమైనదో ఇది రుజువు చేస్తున్నది.
యుక్యుఎడి లో ఏసియా కేంద్రస్థానం కలిగి ఉంది. క్యుయుఎడి సానుకూల అజెండా ఏసియాన్ కు చెందిన వివిధ యంత్రాంగాలకు అనుబంధమైనది.
ఘనత వహించిన మహాశయులారా,
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు ఎన్నో సవాళ్లు, అనిశ్చిత పరిస్థితులు చుట్టుముట్టిన దశలో ఉన్నాయి. ఉగ్రవాదం, తీవ్రవాదం, భౌగోళిక రాజకీయ సంఘర్షణలు అందరికీ సవాలుగా పరిణమించాయి. బహుళపక్షవాదం,
నిబంధనల ఆధారిత అంతర్జాతీయ విధివిధానాలు ఈ పరిస్థితులను ఎదుర్కొవడానికి అవసరం. అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా కట్టుబడడం తప్పనిసరి. అన్ని దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను బలోపేతం చేయడానికి
ప్రతి ఒక్కరి చిత్తశుద్ధి, ఉమ్మడి కృషి అవసరం. నేను ఇంతకుముందే చెప్పినట్టు, ప్రస్తుత శకం యుద్ధం కోరుకోవడం లేదు. చర్చలు, దౌత్యం మాత్రమే సమస్యలు పరిష్కరించుకునేందుకు తగిన మార్గం.
ఘనత వహించిన మహాశయులారా,
మయన్మార్ విషయంలో ఇండియా విధానం, ఏసియాన్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అలాగే, పొరుగుదేశంగా, సరిహద్దులలో శాంతి, భద్రతకు వీలు కల్పిస్తుంది. అలాగే ఇండియా– ఏసియాన్ అనుసంధానత కూడా మా ప్రాధాన్యత.
ఇండో పసిఫిక్ ప్రాంతంలో, శాంతి, సుస్థిరత, సుసంపన్నత మనందరి ప్రయోజనాలకు అనుగుణమైనది.
ఇప్పుడు కావలసింది, ఇండో పసిఫిక్, లో అంతర్జాతీయ చట్టాలు, యుఎన్సిఎల్ఒఎస్ లు అన్ని దేశాలకు సమానంగా వర్తించాలి. ఇక్కడ నౌకాయాన స్వేచ్ఛ, విమాన ప్రయాణ స్వేచ్ఛ ఉండాలి. ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం ఎలాంటి అడ్డంకులు లేని
చట్టబద్ధమైన వాణిజ్యం సాగాలి. దక్షణ చైనా సముద్ర ప్రాంతానికి సంబంధించిన ప్రవర్తనా నియమావళి పకడ్బందీగా యుఎన్ సిఎల్ ఒ ఎస్ కు అనుగుణంగా అమలు జరగాలి. అదనంగా, ఈ చర్చలో ప్రత్యక్షంగా పాల్గొనని దేశాల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఘనత వహించిన మహాశయులారా,
వాతావరణ మార్పులు, సైబర్ భద్రత, ఆహార భద్రత, ఆరోగ్యం, ఇంధనానికి సంబంధించిన సవాళ్లు వర్ధమాన దేశాలపై ప్రభావం చూపుతున్నాయి. మన జి 20 అధ్యక్షతన, మనం వర్ధమాన దేశాలకు సంబంధించిన ఈ కీలక అంశాలపై దృష్టి పెట్టడం జరుగుతోంది.
ఘనత వహించిన మహాశయులారా,
తూర్పు ఆసియా శిఖరాగ్ర సమ్మేళన ప్రక్రియకు ఇండియా చిత్తశుద్ధిని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను.
అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న లావో పిడిఆర్ కు నా హృదయ పూర్వక అభినందనలు.
వారి అధ్యక్షతకు ఇండియా పూర్తి సహకారం అందిస్తుంది.
ధన్యవాదాలు.