‘‘ గాయత్రీ పరివార్ ఏర్పాటు చేసిన అశ్వమేథయాగం ఒక గొప్ప సామాజిక ప్రచారంగా రూపుదిద్దుకుంది’’
‘విశాల అంతర్జాతీయ, జాతీయ చొరవలతో యువతను అనుసంధానం యువతను చిన్న చిన్న సమస్యలనుంచి దూరం చేస్తుంది’’
‘‘మత్తుపదార్థాల రహిత భారత్ ను నిర్మించాలంటే , కుటుంబాలు బలమైన సంస్థలుగా ఉండాలి’’
‘‘ప్రేరణాత్మక యువత మత్తు పదార్ధాలవైపు మళ్లదు’’

గాయత్రీ పరివార్ నిర్వహిచిన అశ్వమేథ యాగం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ , వీడియో సందేశమిచ్చారు.రానున్న ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని చూసినపుడు, దీనిని తప్పుగా అన్వయించే అవకాశం లేకపోలేదన్న  ఆలోచనతో, ఈ అశ్వమేథయాగం కార్యక్రమాలతో మమేకం  కావచ్చునా  లేదా అన్న సందేహం తనకు వచ్చిందని ప్రధానమంత్రి  అన్నారు.  అయితే,‘‘ ఆచార్య  శ్రీ  రామశర్మాఆలోచనలను  ముందుకు తీసుకువెళ్లడానికి  దీనిని నిర్వహిస్తున్నట్టు తెలిసింది, దీనిలో ఒక కొత్త అర్థాన్ని  దర్శించినపుడు నా అనుమానాలన్నీ  పటాపంచలయ్యాయి’’ అని ప్రధానమంత్రి  తెలిపారు.

గాయత్రి పరివార్ నిర్వహించిన అశ్వమేథయాగం ఒక గొప్ప సామాజిక ప్రచార  కార్యక్రమం. దేశంలొని లక్షలాది మంది యువతను మాదక ద్రవ్యాల వాడక అలవాటునుంచి దూరం చేసి  వారని జాతి నిర్మాణ కార్యక్రమాల  వైపు మళ్లించడం దీని ఉద్దేశమని ప్రధానమంత్రి అన్నారు.‘‘ యువత  మన దేశ భవిష్యత్తు అని’’ ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. భారతదేశ గమ్యాన్ని  తీర్చిదిద్దడంలో

దాని అభివృద్ధికి తోడ్పడటంలో యువత కీలక పాత్రను ప్రధానమంత్రి  ప్రత్యేకంగా ప్రస్తవించారు. ఈ గొప్ప కార్యక్రమాన్ని  చేపట్టినందుకు గాయత్రీ పరివార్‌కు ప్రధానమంత్రి  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆచార్య శ్రీ రామ్ శర్మ , మాతా భగవతి బోధనల ద్వారా యువతకు  ప్రేరణ కల్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రధాన మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి,  గాయత్రీ పరివార్‌లోని ఎంతో మంది సభ్యులతో తనకున్న వ్యక్తిగత సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాదకద్రవ్యాల వ్యసనంలో యువత  చిక్కుకోకుండా వారిని రక్షించుకోవడం అవసరమని, ఇప్పటికే ఈ ఉచ్చులో చిక్కుకున్నవారిని  దానినుంచి బయటకు తెచ్చి వారికి అండగా నిలవడం అవసరమని  ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.‘‘మాదక  ద్రవ్యాల వ్యసనం వ్యక్తులకు, సమాజానికి ఎంతో నష్టం కలిగిస్తుంద’’ని ప్రధానమంత్రి స్పష్టం  చేశారు.  మాదకద్రవ్య రహిత భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ముడు నాలుగేళ్ల క్రితం తీసుకున్న చర్యలను ప్రధానమంత్రి  ఈ సందర్భంగా  పేర్కొన్నారు.  ఈ కార్యక్రమం  లో 11 కోట్ల మంది పాల్గొన్నట్టు తెలిపారు. మాదకద్రవ్య రహిత భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు  బైక్  ర్యాలీలు, ప్రతిజ్నలు,వీధినాటకాలనువివిధ సామాజిక, ఆథ్యాత్మిక సంస్థల సహకారంతో నిర్వహించినట్టు తెలిపారు. మాదకద్రవ్యాల నిరోధానికి తీసుకుంటున్న  చర్యలను, దాని ప్రాధాన్యతను ప్రధానమంత్రి తమ మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావిస్తూ  వచ్చారు   కూడా.

‘‘మనం మన యువతను విశాల జాతీయ అంతర్జాతీయ కార్యకలాపాలతో  అనుసంధానం  చేసినపుడు వారు చిన్నచిన్న తప్పులకు  దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో యువత  కీలక పాత్ర  కలిగి ఉందని ప్రధానమంత్రి అన్నారు.‘‘ భారత్ అధ్యక్షతన జి-20 శిఖరాగ్ర సమ్మేళనం ఇతివ్రుత్తం ‘‘ ఒక భూమి, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్తు’’ అని , ఇది మన ఉమ్మడి  మానవ విలువలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్,, ఒక ప్రపంచం,ఒకే ఆరోగ్యం వంటి  అంతర్జాతీయ చర్యలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ ప్రచారాలలో యువతను  మనం  ఎంత ఎక్కువమందిని చేర్చగలిగితే, అంతగా వారు చెడుమార్గానికి దూరం కావడానికి వీలు ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు.

శాస్త్ర  విజ్నానం, క్రీడలపై ప్రభుత్వం ద్రుష్టిపెడుతున్న  విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, చంద్రయాన్ విజయం సాంకేతిక విజ్నాన రంగంలో యువత మరింత ఆసక్తి పెంచుకోవడానికి  పనికివచ్చిందని తెలిపారు. ఇలాంటి చర్యల పరివర్తనాత్మక  ప్రభావం గురించి కూడా ఆయన ప్రస్తావించారు.ఇలాంటి చర్యలు యువత శక్తిని సక్రమ మార్గంలో పెట్టడానికి పనికివస్తాయన్నారు. ఫిట్  ఇండియా ఉద్యమం, ఖేలో ఇండియా ఉద్యమం వంటివి యువతకు ప్రేరణనిస్తాయని చెప్పారు. ఈ ప్రేరణతో, యువత మాదకద్రవ్యాల వ్యసనంవైపు మళ్లే  ప్రమాదం  ఉండదన్నారు.

కొత్త సంస్థ మేరా యువ భారత్ ( మైభారత్) గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఈ పోర్టల్ లో ఇప్పటికే 1.5 కోట్ల మంది  తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు తెలిపారు. ఇది యువ శక్తిని దేశ నిర్మాణానికి సక్రమ  మార్గంలో ఉపయోగించేందుకు ఉపయోగపడుతుందన్నారు. 

మాదక ద్రవ్యాల వ్యసనం ప్రభావం ఎంత  దారుణంగా  ఉంటుందో ప్రధానమంత్రి  వివరించారు. మాదకద్రవ్యాల  వ్యసనం బారిన పడకుండా  యువతను  రక్షించేందుకు ప్రభుత్వం  కట్టుబడి ఉందని,  క్షేత్రస్థాయిలో మాదక ద్రవ్యాల వ్యసనాన్ని  నిర్మూలించేందుకు  పటిష్టమైన  చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధానమంత్రి  చెప్పారు.  మాదక ద్రవ్యాల సమస్యను సమర్ధంగా ఎదుర్కొనేందుకు కుటుంబ మద్దతు అవసరమని ప్రధానమంత్రి తెలిపారు. ‘‘ మాదక  ద్రవ్య వ్యసన రహిత భారతదేశాన్ని  నిర్మించేందుకు, కుటుంబ వ్యవస్థ  బలమైన సంస్థగా ఉండాలి’’ అని ప్రధానమంత్రి  అన్నారు. 

‘‘రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సమారోహ్ సందర్భంగా నేను మాట్లాడుతూ, భారతదేశం మరో  వెయ్యి  సంవత్సరాలకు నూతన  ప్రస్థానాన్ని ప్రారంభించిందని చెప్పాను.’’ అని  అన్నారు. భారతదేశ  అద్భుత భవిష్యత్ కు సంబంధించి ప్రధానమంత్రి  తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.భారతదేశం విశ్వగురువుగా నిలిచేందుకు తన ప్రయాణాన్ని ప్రారంభించిదని, వ్యక్తిగత  అభివ్రుద్ధి తద్వారా దేశాభివ్రుద్ధి ద్వారా అంతర్జాతీయ నాయకత్వం దిశగా ముందుకు సాగుతున్నదని  ప్రధానమంత్రి అన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi