కడ్ వా పాటీదార్ సమాజ్ యొక్క వందో వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.
జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, సనాతని శతాబ్ది మహోత్సవ్ సందర్భం లో తన శుభాకాంక్షల ను తెలియ జేశారు. జగద్ గురు శంకరాచార్య స్వామి సదానంద్ సరస్వతి జీ సమక్షం లో జరుగుతున్న ఒక కార్యక్రమం లో పాలుపంచుకొనే అవకాశం తనకు లభించడం ఇదే మొదటి సారి అని ప్రధాన మంత్రి అన్నారు.
మన సమాజాని కి కడ్ వా పాటీదార్ సమాజ్ చేస్తున్న సేవ లో వంద సంవత్సరాలు అవడం, యువ విభాగం 50 వ సంవత్సరానికి చేరుకోవడం మరియు మహిళా విభాగం 25 వ సంవత్సరాని కి చేరుకోవడం.. ఈ ఘటన లు సంతోషదాయకం అయినటువంటి ఏకకాలిక సంభవాలు అని ప్రధాన మంత్రి అన్నారు. సమాజం లో యువతీ యువకులు మరియు మహిళలు బాధ్యత ను వారి భుజాలకు ఎత్తుకొన్నప్పుడు సాఫల్యం మరియు సమృద్ధి కి బరోసా ఏర్పడుతుంది అనుకోవచ్చును అని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీ అఖిల్ భారతీయ కచ్ఛ్ కడ్ వా పాటీదార్ సమాజ్ యొక్క యువత మరియు మహిళా విభాగం స్పష్టమైన విధేయత ను కనబరచడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, సనాతని శతాబ్ది మహోత్సవ్ యొక్క కుటుంబం లో ఒక భాగం గా తనను కలుపుకొన్నందుకు కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. ‘‘సనాతన్ అనేది కేవలం ఒక పదం కాదు, అది నిత్య నూతనమైంది, సదా మారుతూ ఉండేటటువంటిది. గత కాలం తో పోలిస్తే తన ను తాను మరింత ఉత్తమం గా మలచుకోవాలన్న లోలోపలి అభిలాష దానికి ఉంది, మరి ఈ కారణం గా అది చిరకాలికత్వాన్ని, అమరత్వాన్ని సంతరించుకొంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘ఏ దేశం యొక్క ప్రయాణం అయినా ఆ దేశ సమాజం సాగించే ప్రయాణం లో ప్రతిబింబిస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. పాటీదార్ సమాజ్ యొక్క వందేళ్ళ ప్రాచీనమైనటువంటి చరిత్ర ను గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్తూ శ్రీ అఖిల్ భారతీయ కచ్ఛ్ కడ్ వా సమాజ్ యొక్క వందేళ్ళ యాత్ర, అలాగే దాని భావి దార్శనికత లు భారతదేశాన్ని మరియు గుజరాత్ ను అర్థం చేసుకోవడాని కి ఒక మాధ్యం గా కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. విదేశీ ఆక్రమణదారులు భారతదేశ సమాజం పైన వందల సంవత్సరాల తరబడి ఒడిగట్టిన అఘాయిత్యాల ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఈ గడ్డ యొక్క పూర్వికులు వారి యొక్క గుర్తింపు ను చెరిపివేయనీయ లేదని, వారి ధర్మాన్ని ముక్కచెక్కలు చేయనీయ లేదని స్పష్టం చేశారు. ‘‘వందల సంవత్సరాల క్రితం జరిగిన త్యాగాల ప్రభావాన్ని ఈ విజయవంతమైన సమాజం యొక్క ప్రస్తుత తరం లో మనం గమనిస్తున్నాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. కలప, ప్లైవుడ్, హార్డ్ వేర్, చలువరాయి, భవన నిర్మాణ సంబంధి సామగ్రి తదితర రంగాల లో కచ్ఛ్ కడ్ వా పాటీదార్ సముదాయం వారి యొక్క శ్రమ తోను మరియు దక్షత తోను ముందంజ వేస్తోందని ఆయన తెలిపారు. సంప్రదాయాలు అంటే ఉన్నటువంటి గౌరవం మరియు ఆదరణ లు ప్రతి సంవత్సరం లనూ వర్ధిల్లుతూ వస్తున్నాయంటూ ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సమాజం తన వర్తమానాన్ని నిర్మించుకొందని అలాగే సమాజం తన భవిష్యత్తు కు పునాది ని కూడా వేసుకొందని ఆయన అన్నారు.
తన రాజకీయ జీవనాన్ని గురించి మరియు సమాజం తో తనకు గల అనుబంధాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, కడ్ వా పాటీదార్ సమాజ్ తో కలసి అనేక అంశాల లో గుజరాత్ ముఖ్యమంత్రి గా పని చేసిన సంగతి ని స్మరించుకొన్నారు. కచ్ఛ్ లో సంభవించిన భూకంపాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, సహాయక కార్యక్రమాల లోను మరియు పునర్ నిర్మాణం సంబంధి ప్రయాసల లోను నిమగ్నం అయినటువంటి కడ్ వా పాటీదార్ సముదాయానికి ఉన్న శక్తి ని ప్రశంసించారు. అది తనకు ఎల్లవేళలా విశ్వాస భావన ను అందించింది అని ఆయన చెప్పారు. కచ్ఛ్ ను దేశం లో అత్యంత వెనుకబడిన జిల్లా లలో ఒక జిల్లా గా ఎలా పరిగణించే వారో ఆయన చెప్తూ, నీటి ఎద్దడి, ఆహారం అందకపోవడం, పశు నష్టం, ప్రవాసం మరియు దారిద్య్రం అనేవి ఆ ప్రాంతాని కి ఒక గుర్తింపు లాగా మారిపోయాయి అని ఆయన అన్నారు. ‘‘అయితే, కొన్నేళ్ళు గా కలిసికట్టుగా మనం కచ్ఛ్ కు తిరిగి జవసత్వాల ను ఇచ్చాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. కచ్ఛ్ లోని నీటి సంక్షోభాన్ని పరిష్కరించడం కోసం చేసిన పనుల ను గురించి ఆయన వివరిస్తూ, కచ్ఛ్ ప్రాంతాన్ని ప్రపంచం లో ఒక పెద్ద పర్యటక గమ్యస్థానం గా మార్చి వేసిన సంగతి ని ప్రస్తావించారు. మరి ఇది ‘సబ్ కా ప్రయాస్’ (అందరి ప్రయత్నాల) తాలూకు ఒక గొప్ప ఉదాహరణ గా ఉంది అని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశం లో అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్నటువంటి జిల్లాల లో ఒక జిల్లా గా కచ్ఛ్ ఉండడం పట్ల ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భం లో ఆయన మెరుగుపడిన కనెక్టివిటీ ని గురించిన, పెద్ద పెద్ద పరిశ్రమల గురించిన మరియు ఆ ప్రాంతం నుండి జరుగుతున్న వ్యావసాయిక ఎగుమతుల ను గురించిన ఉదాహరణల ను ఇచ్చారు.
శ్రీ అఖిల్ భారతీయ కచ్ఛ్ కడ్ వా పాటిదార్ సమాజ్ ను ముందుకు తీసుకుపోతున్న వారి తో తనకు గల వ్యక్తిగత పరిచయాల గురించి మరియు శ్రీ నారాయణ్ రామ్ జీ లింబానీ నుండి పొందిన ప్రేరణ గురించి ప్రధాన మంత్రి వివరించారు. ఈ సొసైటీ యొక్క కార్యాల గురించి మరియు ఈ సొసైటీ చేపడుతున్న ప్రచార ఉద్యమాల గురించి వివరాల ను ఎప్పటికప్పుడు తాను తెలుసుకొంటున్నానన్నారు. కరోనా కాలం లో ఈ సొసైటీ చేసిన ప్రశంసనీయమైనటువంటి కృషి ని కొనియాడారు. రాబోయే 25 సంవత్సరాల కు ఈ సొసైటీ దృష్టికోణాన్ని మరియు దేశం స్వాతంత్య్రం తాలూకు వంద సంవత్సరాల ను వేడుక గా జరుపుకొనే వేళ కు సాకారం కాగల సంకల్పాల ను ప్రతిపాదించినందుకు శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తీసుకొన్న సంకల్పాల ను ప్రధాన మంత్రి వివరిస్తూ, సామాజిక సద్భావన, పర్యావరణం మరియు ప్రాకృతిక వ్యవసాయం కావచ్చు.. అవి అన్నీ కూడా ను దేశం యొక్క అమృత సంకల్పం తో ముడి పడి ఉన్నాయని స్పష్టంచేశారు. ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ, ఈ దిశ లో దేశం తీసుకొన్న సంకల్పాల కు శ్రీ అఖిల్ భారతీయ కచ్ఛ్ కడ్ వా సమాజ్ యొక్క ప్రయాస లు బలాన్ని ఇస్తాయని, ఆ సంకల్పాల సాఫల్యాని కి దారి తీయగలవన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.