ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 సెప్టెంబర్ 7 వ తేదీ నాడు జకార్తా లో ఇరవయ్యో ఏశియాన్-ఇండియా సమిట్ లో మరియు పద్దెనిమిదో ఈస్ట్ ఏశియా సమిట్ (ఇఎఎస్) లో పాలుపంచుకొన్నారు.

ఏశియాన్-ఇండియా సమిట్ లో ప్రధాన మంత్రి ఏశియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచడం గురించి మరియు తత్సంబంధి భవిష్య రూపురేఖల ను రూపొందించడం గురించి ఏశియాన్ భాగస్వాముల తో కలసి విస్తృతం గా చర్చించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం లో ఏశియాన్ కు ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ ఓశన్స్ ఇనిశియేటివ్ (ఐపిఒఐ) మరియు ఏశియాన్స్ అవుట్ లుక్ ఆన్ ద ఇండో-పసిఫిక్ (ఎఒఐపి) ల మధ్య మేలు కలయికల ను గురించి ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. ఆయన ఏశియాన్-ఇండియా ఎఫ్ టిఎ (ఎఐటిఐజిఎ) యొక్క సమీక్ష ను ఒక కాలబద్ధ పద్ధతి న పూర్తి చేయవలసిన అవసరం ఎంతయినా ఉందని కూడా నొక్కి చెప్పారు.


ఇండియా-ఏశియాన్ సహకారాన్ని బలపరచుకొనేందుకు గాను కనెక్టివిటీ, డిజిటల్ ట్రాన్స్ ఫర్ మేశన్, వ్యాపారం మరియు ఆర్థిక సహకారం, సమకాలీన సవాళ్ళ కు పరిష్కారం, ప్రజల మధ్య పరస్పరం సంబంధాలు, ఇంకా వ్యూహాత్మకమైన సహకారాన్ని గాఢతరం చేయడం వంటి అంశాల ను చేర్చుతూ 12 అంశాల ప్రతిపాదన ను నివేదించారు. అవి ఈ క్రింది విధం గా ఉన్నాయి:


• సౌథ్-ఈస్ట్ ఏశియా-వెస్ట్ ఏశియా-యూరోప్ ను కలిపే మల్టి-మాడల్ కనెక్టివిటీ మరియు ఇకానామిక్ కారిడార్ ను ఏర్పాటు చేయడం.


• భారతదేశం యొక్క డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ను ఏశియాన్ భాగస్వామ్య దేశాల కు కూడా అందించడం.

• డిజిటల్ ట్రాన్స్ ఫర్ మేశన్ మరియు ఆర్థిక సంధానం అంశాల లో సహకారం పట్ల శ్రద్ధ ను తీసుకొంటూ ఏశియాన్-ఇండియా ఫండ్ ఫార్ డిజిటల్ ఫ్యూచర్ స్థాపన ను ఏర్పాటు చేయాలన్న ప్రకటన.

• మన సహకారాన్ని వృద్ధి చెందింప చేయడం కోసం నాలిజ్ పార్ట్ నర్ గా వ్యవహరించేటటువంటి ఇకానామిక్ ఎండ్ రీసర్చ్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఏశియాన్ ఎండ్ ఈస్ట్ ఏశియా (ఇఆర్ఐఎ) కు సమర్థన ను పునరుద్ధకరించడాన్ని గురించిన ప్రకటన.

• గ్లోబల్ సౌథ్ దేశాల ముందుకు వచ్చే సమస్యల ను బహుపక్షీయ వేదికల లో సామూహికం గా ప్రస్తావించాలంటూ పిలుపు ను ఇవ్వడం.


• భారతదేశం లో డబ్ల్యుహెచ్ఒ ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సెంటర్ ఫార్ ట్రెడిశనల్ మెడిసిన్ లో చేరాలంటూ ఏశియాన్ దేశాల కు ఆహ్వానం పలకడం.

• మిశన్ లైఫ్ లో కలసికట్టు గా పని చేద్దాం అంటూ పిలుపు ను ఇవ్వడం

• జన్-ఔషధీ కేంద్రాల మాధ్యం ద్వారా ప్రజల కు తక్కువ ఖరీదు లో మరియు నాణ్యత కలిగిన ఔషధాల ను అందించడం లో భారతదేశం గడించిన అనుభవాన్ని వెల్లడి చేయడానికి సంసిద్ధం అంటూ ప్రస్తావన.

• ఉగ్రవాదాని కి, ఉగ్రవాద కార్యకలాపాల కు ఆర్థిక సహాయాన్ని అందించడానికి మరియు సైబర్-డిస్ ఇన్ ఫర్ మేశన్ కు వ్యతిరేకం గా సామూహిక పోరాటం చేద్దాం అంటూ పిలుపు

• కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్ఐ) లో చేరాలంటూ ఏశియాన్ దేశాల కు ఆహ్వానం పలకడం.

• విపత్తు నిర్వహణ లో సహకారం కోసం పిలుపు ను ఇవ్వడం.

• సముద్ర సంబంధి సురక్ష, భద్రత, ఇంకా డమేన్ అవేర్ నెస్ అంశాల లో సహకారాన్ని వృద్ధి చెందింప చేసుకొందాం అంటూ పిలుపు ను ఇవ్వడం.

సముద్ర సంబంధి సహకారం విషయం లో ఒక సంయుక్త ప్రకటన కు మరియు ఆహార భద్రత కు సంబంధించి మరొక సంయుక్త ప్రకటన కు ఆమోదాన్ని తెలపడమైంది.
 

ఈ శిఖర సమ్మేళనం లో భారతదేశం మరియు ఏశియాన్ నేతల కు అదనం గా, తిమోర్- లెస్తె పర్యవేక్షకురాలు హోదా లో పాలుపంచుకొంది.

ప్రధాన మంత్రి పద్దెనిమిదో ఈస్ట్ ఏశియా సమిట్ లో పాల్గొని, ఇఎఎస్ యంత్రాంగం యొక్క ప్రాముఖ్యాన్ని పునరుద్ఘాటించారు; దాని కి మరింత బలాన్ని సమకూర్చడం లో సాయపడతామని మరో మారు నొక్కి పలికారు. ఏశియాన్ ను కేంద్ర స్థానం లో నిలిపేందుకు భారతదేశం సమర్థన ను అందిస్తుంది అంటూ ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు; స్వతంత్రమైనటువంటి, దాపరికాని కి తావు లేనటువంటి మరియు నియమాల పై ఆధారపడి పని చేసేటటువంటి ఇండో-పసిఫిక్ అస్తిత్వాని కి పూచీ పడదాం అంటూ ఆయన పిలుపు ను ఇచ్చారు.


ప్రధాన మంత్రి భారతదేశం మరియు ఏశియాన్ ల మధ్య ఇండో-పసిఫిక్ సంబంధి దృష్టికోణాల మేలు కలయిక ఎంతైనా అవసరమని ప్రముఖం గా చాటారు. క్వాడ్ యొక్క దార్శనికత లో ఏశియాన్ ది కీలక పాత్ర అని ఆయన తేటతెల్లం చేశారు.


ఉగ్రవాదం, జలవాయు పరివర్తన, భోజనం మరియు ఔషధాలు సహా అవసర వస్తువుల కోసం ఆటు పోటుల ను తట్టుకొని నిలబడగలిగే సప్లయ్ చైన్స్, ఇంకా శక్తి రంగం యొక్క భద్రత సహా ప్రపంచ స్థాయి సవాళ్ళ ను ఎదుర్కొని పరిష్కరించుకోవడం కోసం సహకార పూర్వకమైన వైఖరి ని అవలంభించాలని కూడా ప్రధాన మంత్రి పిలుపు ను ఇచ్చారు. జలవాయు పరివర్తన రంగం లో భారతదేశం చేపట్టిన చర్యల ను గురించి, ఐఎస్ఎ, సిడిఆర్ఐ, ఎల్ఐఎఫ్ఇ మరియు ఒఎస్ఒడబ్ల్యుఒజి ల వంటి కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు.


నేత లు ప్రాంతీయ అంశాల ను గురించి మరియు అంతర్జాతీయ అంశాల ను గురించి వారి వారి ఆలోచనల ను ఈ సందర్భం లో పరస్పరం వెల్లడించుకొన్నారు.

Click here to read full text of speech at 20th ASEAN-India Summit

Click here to read full text of speech at 18th East Asia Summit

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi