యోర్ హైనెసెస్,
ఎక్స్ లన్సిజ్,
నమస్కారం.

నా యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి, ఈ రోజు న జరుగుతున్న ఈ శిఖర సమ్మేళనం లో మీరంతా పాలుపంచుకొంటున్నందుకు గాను మీ అందరి కీ నేను నా యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను. 140 కోట్ల మంది భారతీయుల పక్షాన మీ అందరి కి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం.


మిత్రులారా,
నా స్నేహితుడు, ఇండోనేశియా యొక్క అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో కిందటి ఏడాది నవంబరు 16 వ తేదీ నాడు సెరిమోనియల్ గేవల్ ను నాకు అప్పగించిన క్షణం నాకింకా గుర్తుంది. అప్పుడు నేను అన్నాను కదా.. మనం కలసి జి-20 ని సమ్మిళితమైంది గా, మహత్వాకాంక్ష కలిగినటువంటిది గా, కార్యాచరణ ప్రధానమైంది గా మరియు నిర్ణయాత్మకమైంది గా తీర్చిదిద్దుదాం అని. ఒక ఏడాది కాలం లో మనం అందరం కలసి ఈ పని ని చేసి చూపెట్టాం. మనం సమష్టి గా జి-20 ని నూతన శిఖరాల కు తీసుకు పోయాం.

సవాళ్ళ తో మరియు అపనమ్మకం తో నిండివున్న ప్రపంచం లో, ఈ పరస్పర విశ్వాసమే మనల ను కలిపి ఉంచుతోంది, ఒకరి తో మరొకరి కి బంధాన్ని ఏర్పరుస్తున్నది.

ఈ ఒక సంవత్సరం లో మనం ‘‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’’ పట్ల నమ్మకాన్ని వెలిబుచ్చాం. మరి, వివాదాల కు అతీతం గా ఏకత్వాన్ని మరియు హకారాన్ని చాటాం.

దిల్లీ లో మనం అందరం ఏకగ్రీవంగా ఆఫ్రికన్ యూనియన్ ను జి-20 లోకి స్వాగతించిన క్షణాన్ని నేను ఎప్పటికీ మరువలేను.
యావత్తు ప్రపంచాని కి జి-20 అందించినటువంటి సమ్మిళితత్వం తాలూకు సందేశం ఇంతకు ముందు ఎన్నడు కూడా ఎరుగనటువంటిది గా ఉంది.

జి-20 కి భారతదేశం అధ్యక్షత వహించిన కాలం లో, ఆఫ్రికా కు తనదైనటువంటి వాణి ప్రాప్తించడం భారతదేశాని కి గర్వకారణం గా నిలచింది.

ఈ ఒక సంవత్సరం లో, జి-20 లో గ్లోబల్ సౌథ్ దేశాల వాణి మారుమోగడాన్ని కూడాను యావత్తు ప్రపంచం వింటూ వచ్చింది.

కిందటి వారం లో జరిగిన ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌథ్ సమిట్’ లో, సుమారు గా 130 దేశాలు న్యూ ఢిల్లీ జి-20 సమిట్ లో తీసుకొన్నటువంటి నిర్ణయాల ను మనఃపూర్వకం గా ప్రశంసించాయి.

నూతన ఆవిష్కరణ లను మరియు డిజిటల్ టెక్నాలజీ ని సమర్థిస్తూనే, మనిషి కేంద్ర స్థానం లో నిలచే వైఖరి ని అవలంబించాలి అని జి-20 నొక్కిపలికింది. బహు పక్షవాదం పట్ల జి-20 తన విశ్వాన్ని పున:ప్రకటించింది.

కలసికట్టు గా మనం అందరం మల్టి డెవలప్ మెంట్ బ్యాంక్ స్ మరియు గ్లోబల్ గవర్నెన్స్ రిషార్మ్ స్ కు ఒక దిశ ను చూపాం.

మరి వీటితో పాటు గా, జి-20 కి భారతదేశం అధ్యక్షత వహించిన కాలం లో జి-20 కి పీపుల్స్ 20 అనే గుర్తింపు దక్కింది.

 

భారతదేశం లో కోట్ల కొద్దీ సామాన్య పౌరులు జి-20 తో అనుబంధం కలిగి ఉండడం తో, మేం దీనిని ఒక పండుగ మాదిరి గా జరుపుకొన్నాం.


యోర్ హైనెసెస్,


ఎక్స్ లన్సిజ్,

ఈ వర్చువల్ సమిట్ ప్రతిపాదన ను నేను తీసుకు వచ్చినప్పుడు, ప్రస్తుతం ప్రపంచ స్థితి ఏ విధం గా ఉంటుందన్న ముందస్తు అంచనా ఏదీ లేదు. ఇటీవలి మాసాలు సరిక్రొత్త సవాళ్ళ ను తెర మీద కు తెచ్చాయి. పశ్చిమ ఆసియా ప్రాంతం లో అస్థిరత్వం, అభద్రత లు మన అందరికీ ఆందోళన ను కలిగిస్తున్నాయి. ఈ రోజు న మనం అందరం గుమి కూడడం ఈ అంశాల పట్ల మనం సూక్ష్మగ్రాహ్యత ను కలిగి ఉన్నామని, మరి వాటి ని పరిష్కరించడం కోసం ఒక్కటై నిలబడ్డామని చాటిచెబుతున్నది.

ఉగ్రవాదం మన అందరికి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అనే సంగతి ని మనం నమ్ముతాం.

పౌరుల మరణాలు, అవి ఎక్కడ సంభవించినా సరే, ఖండించితీరవలసినటువంటివి.

బందీల ను విడుదల చేస్తారన్న కబురు ఈ రోజు న వినవచ్చింది. దీనిని మనం స్వాగతించుదాం. మరి చెరపట్టిన వారిని వెనువెంటనే విడుదల చేస్తారని ఆశించుదాం. మానవత పూర్వకమైనటువంటి సహాయాన్ని నిరంతరాయం గాను మరియు సకాలం లోను అందించడం అనేది తప్పక జరుగవలసిందే. ఇజ్ రాయిల్ మరియు హమాస్ ల పోరాటం ఏ విధమైన ప్రాంతీయ రూపాన్ని సంతరించుకోకుండా జాగ్రత తీసుకోవడం సైతం అవసరమే.

వర్తమానం లో సంకటాల మబ్బుల ను మనం గమనిస్తున్నప్పుడు, ఒక కుటుంబం లో ఎంతటి బలం ఉంది అంటే ఆ బలం శాంతి సాధన కై మనం శ్రమించగలం అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నది.


మానవ సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకొని చూస్తే, మనం ఉగ్రవాదం మరియు హింస లకు వ్యతిరేకం గా మన వాణి ని బిగ్గరగా వినిపించగలం.

ప్రస్తుతం లో, ప్రపంచం యొక్క మరియు మానవాళి యొక్క అపేక్షల ను నేరవేర్చడం కోసం భుజం భుజం కలిపి ముందంజ వేసేందుకు భారతదేశం సన్నద్ధురాలు అయి ఉంది.

 

మిత్రులారా,

ముందడుగు వేస్తున్నటువంటి గ్లోబల్ సౌథ్ దేశాల యొక్క సమస్యల కు అగ్ర ప్రాధాన్యాన్ని కట్టబెట్టవలసిన అగత్యం ఇరవై ఒకటో శతాబ్ది లో ప్రపంచాని కి ఉన్నది.
 

గ్లోబల్ సౌథ్ దేశాలు అనేక ఇబ్బందుల గుండా పయనిస్తున్నాయి, అయితే ఆ ఇబ్బందుల కు గాను వాటి బాధ్యత ఎంత మాత్రం లేదు.

ఈ సందర్భం లో, అభివృద్ధి కార్యాచరణ కు మన యొక్క పూర్తి సమర్థన ను అందించడం తక్షణావసరం గా ఉంది.

ప్రపంచ ఆర్థిక సంస్థలను మరియు పాలన సంబంధి సంస్థల ను మరింత పెద్దవి గాను, ఉత్తమమైనవి గాను, ప్రభావవంతం అయినటువంటివి గాను, ప్రాతినిధ్య యుక్తం అయినటువంటివి గాను, ఇంకా రాబోయే కాలాని కి తగినటువంటివి గాను తీర్చిదిద్దడం కోసం వాటి లో సంస్కరణల ను తీసుకు రావలసిన అవసరం ఉంది.
ఆపన్న దేశాల కు సకాలం లో, తక్కువ రేటుల కు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు పూచీపడాలి. 2030 సస్టేనబల్ డెవలప్ మెంట్ గోల్స్ (ఎస్ డిజి స్) మార్గం లో త్వరగా పయనించడం కోసం స్వీకరించిన కార్యాచరణ ప్రణాళిక ను అమలు పరుద్దాం.


మిత్రులారా,

ఎస్‌డిజి స్ ను భారతదేశం లో స్థానికం గా అమలు పరచడం లో చోటు చేసుకొంటున్న పురోగతి కి మేం చేపట్టిన మహత్వాకాంక్ష యుక్త జిల్లా కార్యక్రమం ఒక చెప్పుకోదగినటువంటి ఉదాహరణ గా ఉంది. మహత్వాకాంక్ష యుక్త జిల్లా కార్యక్రమాన్ని పరిశీలించడాని కి, మరి ఆ కార్యక్రమం భారతదేశం లో 25 కోట్ల మంది ప్రజల యొక్క జీవనాల మీద ప్రసరించినటువంటి పరివర్తన పూర్వకమైన ప్రభావాన్ని గమనించడాని కి తరలిరావలసింది గా గ్లోబల్ సౌథ్ దేశాల ను మరియు జి-20 సభ్యత్వ దేశాల ను నేను ఆహ్వానిస్తున్నాను.

మిత్రులారా,

న్యూ ఢిల్లీ సమిట్ లో, ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) రిపాజిటరీ ని ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఆ అంశం కొలిక్కి వచ్చింది అని ప్రకటించడాని కి నేను సంతోషిస్తున్నాను. 16 దేశాల కు చెందిన 50 కి పైగా డిపిఐ స్ ను ఈ రిపాజిటరీ కి జతపరచడమైంది. గ్లోబల్ సౌథ్ దేశాల లో డిపిఐ స్ అమలు కు రంగాన్ని సిద్ధం చేయడం కోసం ఒక సోశల్ ఇంపాక్ట్ ఫండు ను నెలకొల్పాలి అని నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ నిధి కి భారతదేశం పక్షాన 25 మిలియన్ డాలర్ ల ప్రారంభిక రాశి ని కూడాను అందిస్తామని నేను ప్రకటిస్తున్నాను. మరి ఈ కార్యక్రమం లో మీరు అంతా పాలుపంచుకొంటారు అని నేను ఆశిస్తున్నాను.

 

ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) యుగం లో, సాంకేతిక విజ్ఞానాన్ని బాధ్యతయుక్తమైనటువంటి విధం గా ఉపయోగించుకోవలసిన అవసరమంటూ ఉంది. ఎఐ యొక్క ప్రతికూల వినియోగం సంబంధి ఆందోళన ప్రపంచవ్యాప్తం గా అంతకంతకు పెరుగుతూ పోతోంది.


ఎ.ఐ తాలూకు ప్రపంచ వ్యాప్త క్రమబద్ధీకరణ అనే అంశం లో మనం అందరం కలసి పాటుపడాలి అని భారతదేశం గట్టిగా నమ్ముతోంది.

డీప్‌ఫేక్ స్ అనేది సమాజాని కి, వ్యక్తి కి ఎంత అపాయకరమైందో అనేది క్షుణ్ణం గా ఆకళింపు చేసుకొంటూ మనం ముందుకు సాగాలి.
ఎ.ఐ అనేది ప్రజల కు చేరువ కావాలని, అంతేకాకుండా అది సమాజాని కి సురక్షితమైన విధం గా అది రూపొందాలి అని మనం కోరుకొందాం.

ఈ అవగాహన తో వచ్చే నెల లో భారతదేశం లో గ్లోబల్ ఎ.ఐ పార్ట్ నర్ శిప్ సమిట్ ను ఏర్పాటు చేయడం జరుగుతున్నది.
మరి మీరంతా దీని కి కూడా సహకరిస్తారు అని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,

న్యూ ఢిల్లీ సమిట్ లో, పర్యావరణ పరిరక్షణ కు సంబంధించి గ్రీన్ క్రెడిట్ ను గురించి నేను మాట్లాడాను.



భారతదేశం లో దీనిని మేం మొదలు పెట్టిన సంగతి ని మీరు ఎరుగుదురు. న్యూ ఢిల్లీ లో ప్రారంభించిన గ్లోబల్ బయో ఫ్యూయల్స్ అలయన్స్ ద్వారా, కర్బనం పాళ్ళ ను తగ్గిస్తూ, ప్రత్యామ్నాయ ఇంధనాల ను అభివృద్ధి చేసే ప్రక్రియల ను మేం ప్రోత్సహిస్తున్నాం.

 

మిశన్ ఎల్ఐఎఫ్ఇ, అంటే అదే.. లైఫ్ స్ట‌యిల్ ఫార్ ఎన్ వైరన్ మంట్ (‘లైఫ్‌’) ను భూగ్రహాని కి స్నేహపూర్వకం అయినటువంటి విధానం గా జి-20 ఇప్పటికే గుర్తించింది; 2030వ సంవత్సరాని కల్లా నవీకరణ యోగ్య శక్తి ఉత్పాదన ను మూడు రెట్లు పెంచుకోవాలి అని జి-20 పిలుపు ను ఇచ్చింది; స్వచ్ఛమైన హైడ్రోజన్ పట్ల వచనబద్ధత ను చాటిచెప్పింది; క్లయిమేట్ ఫైనాన్స్ ను బిలియన్ ల స్థాయి నుండి ట్రిలియన్ ల స్థాయి కి పెంచుకోవలసిన అవసరాన్ని కూడా జి-20 గుర్తించింది.



మరికొన్ని రోజుల లో, యుఎఇ లో సిఒపి-28 ని నిర్వహించుకొనే కాలం లో, ఈ కార్యక్రమాలు అన్నింటి విషయం లో ప్రధానమైన చర్యల ను చేపట్టవలసిన అవసరం ఉంది.


మిత్రులారా,

మహిళల సశక్తీకరణ అంశం పై ఒక కొత్త వర్కింగ్ గ్రూపు ను కూడా ఏర్పాటు చేయడమైంది.


ఈ సందర్భం లో, భారతదేశం తన పార్లమెంటు నూతన భవనం లో జరిగిన ఒకటో సమావేశం లో తీసుకున్న ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని మీకు తెలియజేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.

మహిళ లు నాయకత్వ స్థానం లో ఉండేటటువంటి అభివృద్ధి కి బలాన్ని ఇవ్వడం కోసం, పార్లమెంటు లో మరియు రాష్ట్రాల శాసన సభల లో మహిళల కు 33 శాతం స్థానాల ను ప్రత్యేకించాలి అని మేం నిర్ణయించాం.

మిత్రులారా,

నేను నా ప్రకటన ను ఇంతటి తో ముగిస్తున్నాను.

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Indian Toy Sector Sees 239% Rise In Exports In FY23 Over FY15: Study

Media Coverage

Indian Toy Sector Sees 239% Rise In Exports In FY23 Over FY15: Study
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi highlights extensive work done in boosting metro connectivity, strengthening urban transport
January 05, 2025

The Prime Minister, Shri Narendra Modi has highlighted the remarkable progress in expanding Metro connectivity across India and its pivotal role in transforming urban transport and improving the ‘Ease of Living’ for millions of citizens.

MyGov posted on X threads about India’s Metro revolution on which PM Modi replied and said;

“Over the last decade, extensive work has been done in boosting metro connectivity, thus strengthening urban transport and enhancing ‘Ease of Living.’ #MetroRevolutionInIndia”