త్రిశూర్ లో గల శ్రీ సీతారామ స్వామి ఆలయం లో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు. మంగళప్రదం అయినటువంటి త్రిశూర్ పూరమ్ ఉత్సవం తాలూకు సందర్భం లో అందరికీ ఆయన అభినందనల ను తెలియ జేశారు.
కేరళకు సాంస్కృతిక రాజధాని గా త్రిశూర్ కు ఉన్నటువంటి స్థానాన్ని గుర్తిస్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. అక్కడ సంస్కృతి, సంప్రదాయం మరియు కళలు అనేవి ఆధ్యాత్మికత, తత్త్వ శాస్త్రం, ఇంకా పండుగల తో చెట్టపట్టాల్ వేసుకొని వర్ధిల్లుతున్నాయని ఆయన అన్నారు. త్రిశూర్ తన వారసత్వాన్ని మరియు గుర్తింపు ను సజీవం గా అట్టిపెట్టుకొంటోందని మరియు శ్రీ సీతారామ స్వామి ఆలయం ఈ దిశ లో ఒక చైతన్యభరితం అయినటువంటి కేంద్రం గా పని చేస్తోందంటూ ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆలయం యొక్క విస్తరణ పట్ల ప్రధాన మంత్రి తన హర్షాన్ని వ్యక్తం చేశారు.
ఆలయాన్ని విస్తరించడం పట్ల ప్రధాన మంత్రి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. బంగారు తాపడం పని పూర్తి అయిన గర్భ గృహాన్ని భగవాన్ శ్రీ సీతారాములు కు మరియు భగవాన్ అయ్యప్ప కు, ఇంకా భగవాన్ శివ కు అంకితం చేయడం జరుగుతోంది అని ఆయన వెల్లడించారు. 55 అడుగుల ఎత్తయినటువంటి భగవాన్ హనుమాన్ యొక్క విగ్రహాన్ని స్థాపించడాన్ని కూడా ఆయన ప్రశంసిస్తూ, కుంభాభిషేకం సందర్భం లో ప్రతి ఒక్కరి కి అభినందనల ను తెలియ జేశారు.
కళ్యాణ్ కుటుంబం మరియు శ్రీ టి.ఎస్. కళ్యాణ్ రామన్ ల యొక్క తోడ్పాటు ను ప్రధాన మంత్రి కొనియాడుతూ, తాను ఇంతకు ముందు జరిపిన సమావేశాన్ని మరియు ఆలయాన్ని గురించిన చర్చ ను గుర్తు కు తెచ్చుకొన్నారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి తాను ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నట్లు తెలిపారు.
త్రిశూర్ మరియు శ్రీ సీతారామస్వామి ఆలయం విశ్వాస శిఖరంగానే కాకుండా భారతదేశం యొక్క చేతనత్వాని కి మరియు భారతదేశం యొక్క ఆత్మ కు కూడా అద్దం పడుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. మధ్య యుగం లో దండయాత్ర లు జరిగిన కాలాన్ని శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చారు. దండెత్తి వచ్చిన వారు ఆలయాల ను ధ్వంసం చేస్తూ, భారతదేశం ప్రతీకల లో కానవస్తున్నప్పటికీ కూడా అది జ్ఞానం, ఇంకా ఆలోచనల లో మనుగడ సాగిస్తుందనే విషయాన్ని గ్రహించలేకపోయారు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘శాశ్వతత్వం కోసం జరుగుతున్నటువంటి అన్వేషణ లో భారతదేశం జీవిస్తోంది’’ అని ఆయన అన్నారు. శ్రీ సీతారామ స్వామి మరియు భగవాన్ అయ్యప్ప ల రూపం లో భారతదేశం యొక్క ఆత్మ తన నిత్యత్వాన్ని ప్రకటించుకొంటోంది’’ అని ఆయన అన్నారు. ‘‘యుగాల నాటి నుండి ఉన్న ఈ దేవాలయాలు ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ తాలూకు భావన వేల ఏళ్ళ నుండి ఉనికి లో ఉంటూ వస్తున్నటువంటి భావ ధార అని ఘోషిస్తూ వస్తున్నాయి అన్నారు. ప్రస్తుతం స్వాతంత్య్రం యొక్క స్వర్ణ యుగం లో మన వారసత్వం గురించి గర్వపడదాం అనే ప్రతిజ్ఞ ను చేయడం ద్వారా ఈ ఆలోచన ను ముందుకు తీసుకు పోతున్నాం’’ అని ఆయన అన్నారు.
‘‘మన ఆలయాలు మరియు తీర్థయాత్ర లు వందల సంవత్సరాలు గా మన సమాజం యొక్క విలువల తాలూకు మరియు సమృద్ధి తాలూకు సంకేతాలు గా ఉంటూ వచ్చాయి’’ , అని ప్రధాన మంత్రి అన్నారు. శ్రీ సీతారామ స్వామి ఆలయం ప్రాచీన భారతదేశం యొక్క వైభవాన్ని మరియు శోభ ను పదిల పరుస్తోంది అని పేర్కొంటూ ఆయన హర్షాన్ని వెలిబుచ్చారు. ఈ ఆలయం ద్వారా సాగుతూ ఉన్న అనేక సార్వజనిక సంక్షేమ కార్యక్రమాల ను గురించి ప్రముఖం గా ప్రకటిస్తూ, సమాజం నుండి అందుతున్న వనరుల ను సేవ రూపం లో తిరిగి సమాజాని కి ఇచ్చేందుకు వ్యవస్థ ఏర్పాటయిందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ప్రయాసల కు దేశం తరఫున మరిన్ని సంకల్పాల ను.. అది ‘శ్రీ అన్న అభియాన్’ సంకల్పం కావచ్చు, లేదా ‘స్వచ్ఛత అభియాన్’ సంకల్పం కావచ్చు, లేదా ప్రాకృతిక వ్యవసాయం విషయం లో సార్వజనిక చైతన్యం సంబంధి సంకల్పం కావచ్చు.. జత చేయవలసింది గా ఆలయ సంఘాని కి ఆయన విజ్ఞప్తి చేశారు. దేశం యొక్క లక్ష్యాల మరియు సంకల్పాల సాధనకై పరిశ్రమ కొనసాగుతూ ఉన్నందువల్ల శ్రీ సీతారామ స్వామి జీ యొక్క దీవెన లు ప్రతి ఒక్కరి పైన వర్షిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.