ఇటలీ లో జి7 శిఖర సమ్మేళనం జరుగుతున్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యూక్రేన్ యొక్క అధ్య‌క్షుడు శ్రీ‌ వొలొదిమీర్ జెలెన్ స్కీ తో 2024 జూన్ 14 వ తేదీ న ఒక ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాన మంత్రి తాను మూడో సారి పదవీ బాధ్యతల ను చేపట్టినందుకు అధ్యక్షుడు శ్రీ వొలొదిమీర్ జెలెన్ స్కీ హృదయపూర్వక శుభాకాంక్షల ను తెలిపినందుకు ఆయన కు ధన్యవాదాలను పలికారు.



ఇద్దరు నేతలు ఒక ఫలప్రదమైన సమావేశాన్ని నిర్వహించారు. ద్వైపాక్షిక సంబంధాల ను బలపరచుకొనే మార్గాల ను గురించి వారు సమావేశం లో చర్చించారు. యూక్రేన్ లో స్థితి ని గురించి మరియు శాంతి అంశం పై స్విట్జర్‌ లాండ్ ఆతిథేయి గా త్వరలో జరుగనున్న శిఖర సమ్మేళనాన్ని గురించి వారు వారి వారి అభిప్రాయాల ను ఒకరికి మరొకరు వెల్లడించుకొన్నారు కూడాను.



 చర్చలు జరపడం మరియు దౌత్యం ద్వారా సంఘర్షణ కు శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడాన్ని భారతదేశం ప్రోత్సహిస్తూ ఉంటుందని ప్రధాన మంత్రి తెలియజేశారు; ఒక శాంతియుత పరిష్కారాన్ని సమర్ధించగల మార్గాలను భారతదేశం తన పరిధి లో చేయగలిగిన ప్రతి ఒక్క కార్యాన్ని నిరంతరాయం గా చేస్తూ ఉంటుందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.


 నేతలు ఇరువురూ పరస్పరం సంప్రదింపుల ను కొనసాగించాలని వారి యొక్క సమ్మతి ని వ్యక్తం చేశారు.

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
How PMJDY has changed banking in India

Media Coverage

How PMJDY has changed banking in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 మార్చి 2025
March 25, 2025

Citizens Appreciate PM Modi's Vision : Economy, Tech, and Tradition Thrive