న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు గౌరవనీయ లూయీ ఇనాసియో లూలా డిసిల్వాతో 2023 సెప్టెంబరు 10న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత జి-20 అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడంపై ప్రధానమంత్రిని అధ్యక్షులు లూలా అభినందించారు. కాగా, వచ్చే ఏడాది జి-20కి బ్రెజిల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ తరఫున పూర్తి మద్దతు ప్రకటించారు.
భారత-బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసే మార్గాలపై దేశాధినేతలిద్దరూ చర్చించారు. అలాగే జీవ ఇంధనాలు, ఔషధాలు, వ్యవసాయాధార పరిశ్రమలు, అంతరిక్షం, పౌర విమానయాన రంగాల్లో సహకార విస్తరణపైనా వారిమధ్య చర్చలు సాగాయి. జి-20 శిఖరాగ్ర సదస్సు సమాపనోత్సవం సందర్భంగా వారిద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
Uma excelente reunião com o Presidente @LulaOficial. Os laços entre a Índia e o Brasil estão muito fortes. Falámos sobre formas de estimular o comércio e a cooperação na agricultura, tecnologia e muito mais. Também transmiti os meus melhores votos para a próxima presidência do… pic.twitter.com/YTxwaz690Q
— Narendra Modi (@narendramodi) September 10, 2023
Excellent meeting with President @LulaOficial. Ties between India and Brazil are very strong. We talked about ways to boost trade and cooperation in agriculture, technology and more. I also conveyed my best wishes for Brazil’s upcoming G20 Presidency. pic.twitter.com/XDMjLdfyUi
— Narendra Modi (@narendramodi) September 10, 2023