ఈజిప్ట్ అధికార పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 2023 జూన్ 24 న ఈజిప్ట్ గ్రాండ్ ముఫ్తీ డాక్టర్ షాకీ ఇబ్రాహీం అల్లామ్ తో భేటీ అయ్యారు.
గ్రాండ్ ముఫ్తీ తన ఇటీవలి భారత పర్యటనను సంతోషంగా గుర్తు చేసుకున్నారు. ఇరుదేశాల ప్రజల మధ్య, బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు. సమ్మిళితి, వైవిధ్యం విషయంలో ప్రధాని మోదీ నాయకత్వాన్ని గ్రాండ్ ముఫ్తీ అభినందించారు.
చర్చలు సామాజంలో నెలకొనాల్సిన సామాజిక, మత సామరస్యం మీద, తీవ్రవాదాన్ని ఎదుర్కోవటం మీద కూడా దృష్టి సారించాయి.
ఈజిప్ట్ సామాజిక మంత్రిత్వశాఖ కింద దర్ అల్ ఇఫ్తా లో భారతదేశం ఐటీ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తుందని ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు.
Honoured to have met the Grand Mufti of Egypt, His Eminence Prof. Shawky Ibrahim Allam. Had enriching discussions on India-Egypt ties, notably cultural and people-to-people linkages. pic.twitter.com/GMx4FCx2E0
— Narendra Modi (@narendramodi) June 24, 2023