ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సిడ్ నీ లో ఏర్పాటైన వేరు వేరు సమావేశాల లో ఆస్ట్రేలియా కు చెందిన అనేక మంతి ప్రముఖుల ను కలుసుకొన్నారు. ఆ ప్రముఖ వ్యక్తుల లో -
- భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి గ్రహీత మరియు కాన్ బరా లోని ఆస్ట్రేలియన్ జాతీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి మరియు ప్రెసిడెంటు అయిన ప్రొఫెసర్ శ్రీ బ్రయన్ పి. శ్మిట్
- వ్యాపార రంగ నిపుణుడు మరియు మానవీయ అంశాల కు సంబంధించిన కుశలుడైన సార్వజనిక వక్త శ్రీ మార్క్ బల్లా
- ఆదివాసి కళాకారిణి డేనియల్ మేట్ సులివన్ గారు
- ఇంటర్ నేశనల్ శెఫ్, రెస్తౌరంత్ యజమానురాలు, టెలివిజన్ కార్యక్రమం హోస్టు, వక్త మరియు నవపారిశ్రమిక వేత్త సారా టోడ్ గారు
- సిడ్ నీ లోని న్యూ సౌథ్ వేల్స్ విశ్వవిద్యాలయం కృత్రిమ మేధ సంస్థ లో ముఖ్య శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ శ్రీ టోబీ వాల్శ్
- అసోసియేట్ ప్రొఫెసరు, సమాజ శాస్త్రవేత్త, పరిశోధకుడు మరియు రచయిత అయినటువంటి శ్రీ సాల్వటోర్ బాబోన్స్
- ఆస్ట్రేలియా లో ప్రముఖ గాయకుడు శ్రీ గాయ్ థియోడోర్ సెబస్టియన్ ఉన్నారు
వారి కార్యసాధనల కు గాను వారి కి ప్రధాన మంత్రి అభినందనల ను వ్యక్తం చేశారు. భారతదేశం- ఆస్ట్రేలియా సంబంధాల ను పటిష్టపరచడం కోసం తోడ్పాటు ను అందించండంటూ వారి ని ఆయన ఉత్సాహ పరచారు.