జి-20 సభ్యత్వ దేశాల నేతల శిఖర సమ్మేళనం ఈ రోజు న బాలి లో జరిగిన సందర్భం లో, యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
క్రిటికల్ ఎండ్ ఇమర్జింగ్ టెక్నాలజీస్, అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్, ఆర్టిఫిశియల్ ఇంటెలిజెన్స్ మొదలైన భవిష్యత్తు ప్రధాన రంగాల లో సహకారం సహా భారతదేశం-యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గాఢతరం గా తీర్చిదిద్దుకోవడాన్ని కొనసాగించడం గురించి వారు సమీక్షించారు. క్వాడ్, ఐ2యు2 తదితర నూతన కూటముల లో భారతదేశాని కి మరియు యుఎస్ కు మధ్య సన్నిహిత సహకారం పట్ల వారు సంతృప్తి ని వ్యక్తం చేశారు.
ఇటీవలి ప్రపంచ ఘటనల క్రమాన్ని గురించి మరియు ప్రాంతీయ ఘటనల క్రమాన్ని గురించి ఉభయ నేత లు చర్చించారు. భారతదేశం-యుఎస్ భాగస్వామ్యాన్ని బలపరచడం కోసం అధ్యక్షుడు శ్రీ బైడెన్ అందిస్తున్న నిరంతర సమర్ధన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాల ను తెలియజేశారు. జి20 కూటమి కి భారతదేశం అధ్యక్షత వహించే కాలం లో ఇరు దేశాలు సన్నిహిత సమన్వయాన్ని కొనసాగిస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.