ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జోహాన్స్ బర్గ్ లో బ్రిక్స్ పదిహేనో శిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో దక్షిణ ఆఫ్రికా గణతంత్రం అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా తో 2023 ఆగస్టు 23 వ తేదీ న సమావేశమయ్యారు.
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల లో చోటుచేసుకొన్న ప్రగతి ని నేత లు ఇరువురు సమీక్షించారు; రక్షణ, వ్యవసాయం, వ్యాపారం మరియు పెట్టుబడి, ఆరోగ్యం, సంరక్షణ మరియు ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా వివిధ రంగాల లో ప్రగతి సాధన పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
పరస్పర హితం ముడిపడిన ప్రాంతీయ మరియు బహు పార్శ్విక అంశాలలోను, బహుళ పార్శ్విక సంస్థల లోను సహకారం కొనసాగుతూ ఉండటం పట్ల కూడా ఇరు పక్షాలు ఆలోచనల ను పరస్పరం వెల్లడించుకొన్నాయి. జి-20 కి భారతదేశం అధ్యక్షత వహిస్తుండడానికి అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా భారతదేశాని కి తన సంపూర్ణ సమర్థన ను వ్యక్తం చేయడం తో పాటు గా జి-20 లో ఆఫ్రికా యూనియన్ కు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని ఇవ్వడం లో భారతదేశం కనబరచిన చొరవ ను కూడా ప్రశంసించారు. జి-20 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడం కోసం న్యూ ఢిల్లీ ని సందర్శించాలని తాను ఉత్సుకత తో ఉన్నట్లు ఆయన తెలియజేశారు.
బ్రిక్స్ శిఖర సమ్మేళనాని కి ఆతిథేయి గా వ్యవహరించడం లో సఫలం అయినందుకు అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా కు ప్రధాన మంత్రి అభినందనల ను తెలియజేశారు. పరస్పరం అనువు గా ఉండే కాలం లో దక్షిణ ఆఫ్రికా ఆధికారిక సందర్శన కు తరలి రావలసిందంటూ అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా ఆహ్వానించగా ప్రధాన మంత్రి అంగీకరించారు.
Had an excellent meeting with President @CyrilRamaphosa. We discussed a wide range of issues aimed at deepening India-South Africa relations. Trade, defence and investment linkages featured prominently in our discussions. We will keep working together to strengthen the voice of… pic.twitter.com/xhxEClr1Dl
— Narendra Modi (@narendramodi) August 23, 2023