ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఆ దేశాధ్యక్షుడు గౌరవనీయ అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగడం చారిత్రకమంటూ బెలెన్ అభినందనలు తెలిపారు.
రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తన ఆస్ట్రియా పర్యటన చరిత్రాత్మకమేగాక మరెంతో ప్రత్యేకమైనదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరస్పర ప్రయోజనాల సంబంధిత ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై వారిద్దరూ చర్చించారు. అలాగే పర్యావరణ సుస్థిరత, భూతాపం సమస్య పరిష్కారం వగైరాలపైనా ఆలోచనలను పంచుకున్నారు. ఈ దిశగా పునరుత్పాదక ఇంధనం... ప్రత్యేకించి సౌర, జల, జీవ ఇంధనాల వంటి రంగాల్లో పరస్పర ప్రయోజనకర సహకారానికిగల అవకాశాలపై నేతలిద్దరూ చర్చించారు. కాగా, వాన్ డెర్ బెలెన్ వీలైనంత త్వరగా భారత పర్యటనకు రావాలన్న తన ఆహ్వానాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
Had a very good meeting with Federal President Alexander Van der Bellen and discussed ways to expand India-Austria cooperation. @vanderbellen pic.twitter.com/mrCtr0mg28
— Narendra Modi (@narendramodi) July 10, 2024
Hatte ein sehr gutes Treffen mit Bundespräsident Alexander Van der Bellen und wir diskutierten über die Möglichkeiten zum Ausbau der indisch-österreichischen Zusammenarbeit. @vanderbellen pic.twitter.com/ZWJgxeDT1z
— Narendra Modi (@narendramodi) July 10, 2024