ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జూన్ 23 న వాషింగ్టన్ డీసీలో అమెజాన్ ప్రెసిడెంట్, సీఈవో ఆండ్రూ ఆర్ జాసీ తో సమావేశమయ్యారు.
ఈ-కామర్స్ రంగం మీద ప్రధాని, జాసీ చర్చలు జరిపారు. లాజిస్టిక్స్ రంగంలో భారత్ లో అమెజాన్ మరింత సహకారం అందించే విషయం మీద కూడా ఈ సందర్భంగా వారు చర్చించారు.
భారతదేశంలో ఎంఎస్ఎంఈ రంగంలో డిజిటైజేషన్ ను ప్రోత్సహించటానికి అమెజాన్ చూపుతున్న చొరవను ప్రధాని ఈ సందర్భంగా స్వాగతించారు.