ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా కు చెందిన సలహాదారుల సమూహం తో యుఎస్ఎ లోని న్యూ యార్క్ లో ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి మరియు నిపుణులు అనేక అభివృద్ధి సంబంధి అంశాల ను మరియు భౌగోళిక, రాజకీయ అంశాల పై చర్చ లు జరిపారు.
ఈ ‘అమృత కాలం’ లో భారతదేశం తన పరివర్తన ఉద్యమాన్ని నడుపుతున్న క్రమం లో నిపుణులు వారి యొక్క ఉనికి ని మరియు ప్రభావాన్ని మరింత గా ప్రసరింప చేయాలంటూ వారి ని ప్రధాన మంత్రి ఆహ్వానించారు.
సమావేశం లో పాల్గొన్న సలహాదారు నిపుణుల లో-
• న్యూ యార్క్ లో కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేశన్స్ (సిఎఫ్ఆర్) అధ్యక్ష పదవి లో నియామకం జరిగిన మరియు డిస్టింగ్విశ్ డ్ ఫెలో శ్రీ మైకల్ ఫ్రోమేన్,
• న్యూ యార్క్ లోని ద ఏశియా సొసైటీ పాలిసి ఇన్స్ టిట్యూట్ లో ఇంటర్ నేశనల్ సిక్యోరిటీ ఎండ్ డిప్లొమెసి యొక్క ఉపాధ్యక్షుడు శ్రీ డేనియల్ రసెల్,
• బోస్టన్ లోని నార్థ్ ఈస్టర్న్ యూనివర్సిటీ లో రాజనీతి శాస్త్రం యొక్క అసోశియిట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీ మేక్స్ అబ్రామ్స్,
• ద ఏశియన్ స్టడీజ్ సెంటర్, ద హెరిటేజ్ ఫౌండేశన్, డిసి ల డైరెక్టరు శ్రీ జెఫ్ ఎమ్. స్మిథ్,
• వాశింగ్ టన్ డిసి లో నెలకొన్న ‘ద మేరథాన్ ఇనిశియేటివ్’ యొక్క సహ సంస్థాపకుడు శ్రీ ఎల్ బ్రిజ్ కోల్బీ,
• టెక్సాస్ లోని ఇండస్ ఇంటర్ నేశనల్ రిసర్చ్ ఫౌండేశన్ యొక్క సంస్థాపక సభ్యుడు, డైరెక్టర్ (ఇండో-యుఎస్ అఫేయర్స్) - లు ఉన్నారు.