ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎస్ కు చెందిన ప్రముఖ అమెరికన్ విద్య రంగ నిపుణుల సమూహం తో యుఎస్ఎ లోని న్యూ యార్క్ లో ఈ రోజు న సమావేశమయ్యారు. విద్య రంగ నిపుణులు వ్యవసాయం, మార్కెటింగ్, ఇంజీనియరింగ్, ఆరోగ్యం, విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం తాలూకు వివిధ రంగాల తో ముడిపడి ఉన్నారు.
వారు భారతదేశం యొక్క నూతన విద్య విధానం లో భాగం గా పరిశోధన సంబంధి సహకారాన్ని మరింత గా వృద్ధి చెందింప చేసేందుకు గల అవకాశాల ను గురించి, మరి అలాగే రెండు దేశాల లో విద్య రంగ సంబంధి ఆదాన ప్రదానాల కు గల సంభావ్యతల ను గురించి చర్చించారు.
విద్య రంగ నిపుణులు వారి కి ప్రావీణ్యం ఉన్నటువంటి రంగాల లో వారి యొక్క అనుభవాల ను మరియు దృష్టికోణాల ను ప్రధాన మంత్రి కి వివరించారు.
ఈ సమావేశం లో పాలుపంచుకొన్న విద్యావేత్తల లో -
• ఎన్ వైయు టండన్ స్కూల్ ఆఫ్ ఇంజీనియరింగ్ బోర్డు అధ్యక్షురాలు చంద్రిక టండన్ గారు
• పెంసిల్ వేనియా స్టేట్ యూనివర్సిటీ అధ్యక్షురాలు డాక్టర్ నీలీ బెండపూడీ గారు
• సేన్ డియెగో లోని కేలిఫోర్నియా యూనివర్సిటీ చాన్స్ లర్ డాక్టర్ శ్రీ ప్రదీప్ ఖోస్ లా
• బఫెలో లోని యూనివర్సిటీ అధ్యక్షుడు డాక్టర్ సతీశ్ త్రిపాఠీ
• యూనివర్సిటీ ఆఫ్ పెంసిల్ వేనియా లో వ్హార్టన్ స్కూల్ ఆఫ్ బిజ్ నెస్ లో మార్కెటింగ్ ప్రొఫెసరు ప్రొఫెసర్ శ్రీ జగ్ మోహన్ రాజు
• యూనివర్సిటీ ఆఫ్ శికాగో లో బూథ్ స్కూల్ ఆఫ్ బిజ్ నెస్ యొక్క అధిపతి డాక్టర్ శ్రీ మాధవ్ వి. రాజన్
• భూ విజ్ఞాన శాస్త్రం లో ప్రముఖ విశ్వవిద్యాలయ ఆచార్యుడు ప్రొఫెసర్ శ్రీ రత్తన్ లాల్; ఈయన ఓహియో స్టేట్ యూనివర్సిటీ లోని సిఎఫ్ఎఇఎస్ లో రత్తన్ లాల్ సెంటర్ ఫార్ కార్బన్ మేనిజ్ మెంట్ ఎండ్ సీక్వెస్ట్రేశన్ కు డైరెక్టరు గా కూడాను ఉన్నారు.
• స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో హృదయ చికిత్స సంబంధి సహాయక ఆచార్యుడు డాక్టర్ శ్రీ అనురాగ్ మాయ్ రాల్ లు- ఉన్నారు. డాక్టర్ శ్రీ అనురాగ్ మాయ్ రాల్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లోని సెంటర్ ఫార్ ఇనోవేశన్ ఎండ్ గ్లోబల్ హెల్థ్ లో టెక్నాలజీ ఇనొవేశన్ ఎండ్ ఇంపాక్ట్ విభాగం యొక్క అధిపతి గా మరియు ఫేకల్టీ ఫెలో గా కూడా ను ఉన్నారు.