ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా, సింహాల సంరక్షణ & భద్రత కోసం కృషి చేస్తున్న వారందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు. గంభీరమైన సింహాల రక్షణ విషయంలో ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఫిబ్రవరి 2024లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయాన్ని శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా లభించిన ప్రోత్సాహకర స్పందన పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
గిర్ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించి, గుజరాతీల ఆతిథ్యాన్ని ఆనందిస్తూ సింహాల రక్షణ కోసం జరుగుతున్న కృషిని తెలుసుకోవాలని వన్యప్రాణుల ప్రేమికులందరినీ ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆహ్వానించారు.
ఎక్స్‌పై ట్వీట్ థ్రెడ్‌ను పోస్ట్ చేస్తూ, శ్రీ మోదీ ఇలా అన్నారు:
“ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా సింహాల సంరక్షణకు కృషి చేస్తున్న వారందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ గంభీరమైన సింహాల రక్షణ విషయంలో మా ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాను. భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో సింహాలు గుజరాత్‌లోని గిర్‌లో ఉన్న విషయం విదితమే అయితే గత కొన్ని సంవత్సరాలుగా వాటి సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం శుభ పరిణామం.”
“సింహాలు నివసించే ప్రపంచ దేశాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా సుస్థిర అభివృద్ధిని పెంపొందించడానికి అలాగే ఈ విషయంగా సమాజం చేస్తున్న కృషికి మద్దతు ఇవ్వడానికి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రయత్నాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సాహకరమైన స్పందన లభిస్తుంది.”
“గంభీరమైన ఆసియా సింహాలను చూసేందుకు నేను వన్యప్రాణుల ప్రేమికులందరినీ గిర్‌కి ఆహ్వానిస్తున్నాను. ఇది సింహాలను రక్షించేందుకు జరుగుతున్న కృషిని తెలుసుకోవడంతో పాటు గుజరాత్ ప్రజల ఆతిథ్యాన్ని ఆనందించే అవకాశాన్ని వారికి కల్పిస్తుంది.”
On World Lion Day 🦁, I compliment all those working on Lion conservation and reiterate our commitment to protecting these majestic big cats. India, as we all know, is home to a large Lion population in Gir, Gujarat. Over the years, their numbers have increased significantly,… pic.twitter.com/PbnlhBlj71
— Narendra Modi (@narendramodi) August 10, 2024