తేజూ విమానాశ్రయం లో క్రొత్త గా అభివృద్ధి పరచినటువంటి మౌలిక సదుపాయల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ విమానాశ్రయాన్ని కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్ సింధియా ఈ రోజు న ప్రారంభించారు.
అరుణాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖాండు ఎక్స్ లో ఒక ట్వీట్ లో గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi 2022 నవంబర్ లో డోనీ పోలో విమానాశ్రయాన్ని ప్రారంభించిన తరువాత జరిగిన తేజూ విమానాశ్రయం యొక్క ఉన్నతీకరణ ఒక మహత్వపూర్ణమైనటువంటి మైలురాయి గా ఉంది. ఇది మన రాష్ట్రాని కి కనెక్టివిటీ ని చాలా వృద్ధి చెందింపచేయనుంది.’’ అని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ లో సమాధానాన్ని ఇస్తూ
‘‘అరుణాచల్ ప్రదేశ్ లో మరియు యావత్తు ఈశాన్య ప్రాంతం లో కనెక్టివిటీ విషయం లో ఒక సుఖప్రదాయకం అయినటువంటి కబురు.’’ అని పేర్కొన్నారు.
Wonderful news for connectivity in Arunachal Pradesh and the entire Northeast. https://t.co/3MDy9IFhDy
— Narendra Modi (@narendramodi) September 24, 2023