పాశ్చాత్య సంగీత దిగ్గజం మిక్ జాగర్ పోస్టుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ స్పందించారు.
భారతదేశాన్ని సందర్శించడం తనకెంతో ఆనందంగా ఉందంటూ జాగర్ ఆ పోస్టులో సంతోషం వెలిబుచ్చారు. దీనిపై స్పందించిన ప్రధానమంత్రి ఆయన గీతాన్ని ఉదాహరిస్తూ 'ఎక్స్' ద్వారా పంపిన ఒక సందేశంలో:
"మనం ఆశించిన ప్రతి ఒక్కటీ మనకు దక్కదు' కానీ, ప్రతి అన్వేషకుడికీ భారతదేశమంతటా ఉత్సాహం, సంతోషం, సంతృప్తి మెండుగా లభిస్తాయి. ఆ మేరకు భారతీయ సంస్కృతి, ప్రజల నుంచి మీకెంతో ఆనందం లభించడం ముదావహం. తరచూ భారతదేశాన్ని సందర్శిస్తూండండి" అని స్వాగతించారు.
‘You Can’t Always Get What You Want’, but India is a land brimming with seekers, offering solace and ‘Satisfaction’ to all.
— Narendra Modi (@narendramodi) November 18, 2023
Delighted to know you found joy among the people and culture here.
Do keep coming… https://t.co/UXKH529mu5