న్యూఢిల్లీలో 2023 సెప్టెంబరు 9, 10 తేదీల్లో నిర్వహిస్తున్న జి-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్‌ వస్తున్న వివిధ దేశాల అధినేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక స్వాగతం పలికారు.

   ఈ మేరకు మారిషస్‌ ప్రధానిని స్వాగతినిస్తూ ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“భారత పర్యటనకు వస్తున్న నా మిత్రుడు ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్‌నాథ్ గారికి స్వాగతం.  ఇవాళ ఆయనతో సమావేశం కావడం కోసం నేను చూస్తున్నాను” అని పేర్కొన్నారు.

 

 

   అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్‌ డైరెక్టర్‌ను స్వాగతినిస్తూ ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“క్రిస్టాలినా జార్జియేవా గారూ స్వాగతం… మన వర్తమాన సమస్యలు, సవాళ్లను సమష్టిగా పరిష్కరించుకోవడం సహా భవిష్యత్తరాలకు ఉజ్వల భవితను ఇవ్వడంపై మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇక ఢిల్లీకి వచ్చిన సందర్భంగా భారతీయ సంస్కృతిపై మీరు ప్రదర్శించిన ఆదరాభిమానాలను, ఆసక్తిని నేను అభినందిస్తున్నాను” అని పేర్కొన్నారు.

 

 

   ఐరోపా కమిషన్‌ (ఇయు) అధ్యక్షుడికి స్వాగతం పలుకుతూ ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఉర్సులా వాన్‌-డెర్‌ లాయెన్‌ గారూ స్వాగతం... మీరు జి-20 సదస్సు కోసం ఢిల్లీకి రావడం ముదావహం. జి-20 అధ్యక్షత నేపథ్యంలో ‘ఇయు’ కమిషన్ ఇస్తున్న చేయూత, మద్దతుపై నిబద్ధతకు మా కృతజ్ఞతలు. మనకు ఎదరయ్యే సవాళ్లను మనం సమష్టిగా పరిష్కరించుకుందాం. ఆ దిశగా ఫలవంతమైన చర్చలు, సహకారాత్మక చర్యల కోసం ఎదురు చూస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.

 

 

   యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రధానమంత్రిని స్వాగతినిస్తూ ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“రిషి శునాక్‌ గారూ స్వాగతం! మానవాళి శ్రేయస్సు కేంద్ర భూగోళం దిశగా మన సమష్టి కృషికి  శిఖరాగ్ర సదస్సు నాంది పలుకుతుందని నేను ఆశాభావంతో ఎదురుచూస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.

 

 

   స్పెయిన్‌ ప్రతినిధి బృందాన్ని స్వాగతిస్తూ ఆ దేశ ప్రధానమంత్రిని ఉద్దేశించి ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“పెడ్రో శాంచెజ్‌ గారూ! మీరు త్వరగా కోలుకుని, చక్కని ఆరోగ్యంతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ జి-20 శిఖరాగ్ర సదస్సులో మీ విలువైన అభిప్రాయాలను స్వీకరించే అవకాశం లేకపోవడం విచారకరం. ఈ నేపథ్యంలో మీ తరఫున సదస్సుకు హాజరవుతున్న స్పెయిన్‌ ప్రతినిధి బృందానికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.

 

 

   అర్జెంటీనా అధ్యక్షుడిని స్వాగతిస్తూ ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“అధ్యక్ష ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ గారూ! భారత్‌ మిమ్మల్ని సాదరంగా స్వాగతిస్తోంది. జి-20 సదస్సు సందర్భంగా వివిధ అంశాలపై లోతైన ఆలోచనతో కూడిన మీ అభిప్రాయాల కోసం ఎదురుచూస్తున్నాం” అని ప్రధాని పేర్కొన్నారు.

 

   అమెరికా అధ్యక్షుడిని స్వాగతిస్తూ ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌ గారిని నా నివాసం నం.7 లోక్‌కల్యాణ్‌ మార్గ్‌ కు ఆహ్వానించడం నాకెంతో సంతోషం కలిగించింది. మా సమావేశం ఎంతో ఫలవంతంగా సాగింది. భారత-అమెరికాల మధ్య ఆర్థిక, ప్రజల మధ్య పరస్పర సంబంధాల విస్తరణ-అనుసంధానం సహా అనేక అంశాలపై మేము లోతుగా చర్చించాం. ప్రపంచ శ్రేయస్సు దిశగా మా రెండు దేశాల స్నేహసంబంధాలు ఎప్పటిలాగానే కీలక పాత్ర పోషిస్తాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

   ఇండోనేషియా అధ్యక్షుడిని స్వాగతిస్తూ ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“జోడో విడోడో గారూ! హృదయపూర్వక స్వాగతం.. జకార్తాలో శిఖరాగ్ర సదస్సు అనంతరం తదుపరి జి-20 సదస్సులో పాల్గొనేందుకు మీరు ఢిల్లీ రావడం ఎంతో సంతోషంగా ఉంది” అని ప్రధాని పేర్కొన్నారు.

   బ్రెజిల్‌ అధ్యక్షుడిని స్వాగతిస్తూ ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“బ్రెజిల్‌ అధ్యక్షులు లూలాను భారతదేశానికి స్వాగతించడం ముదావహం. జోహాన్నెస్‌బర్గ్‌లో ఇటీవలే నేను ఆయనను కలుసుకున్నాను. తిరిగి ఇప్పుడు జి-20 సదస్సు వేదికగా మేం కలవడం ఎంతో సంతోషంగా ఉంది. వివిధ అంశాలపై ఆయన అభిప్రాయాల కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాం” అని ప్రధాని పేర్కొన్నారు.

 

  • Babla sengupta January 26, 2024

    Babla sengupta
  • Babla sengupta January 02, 2024

    Babla
  • Babla sengupta December 23, 2023

    Babla sengupta
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp November 04, 2023

    Jay shree Ram
  • Missula Siva September 10, 2023

    G20 Great Success Understanding Food Cloths Shelter Activity Infrastructure Projects Research Development Support Collaboration Frame workEncouragement Awareness Environment swachh Health &wealth Dynamic Leadership
  • Missula Siva September 10, 2023

    One Earth One Family One Future
  • Yash Gupta September 09, 2023

    विजयी विश्व तिरंगा प्यारा झण्डा ऊँचा रहे हमारा भारत माता की जय
  • PRATAP SINGH September 09, 2023

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 भारत माता कि जय। 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
  • LunaRam Dukiya September 09, 2023

    इन विश्व के महान नेताओं से मिलना आपका और हम भारतीयों के लिए गौरव का विषय है हम आपकी आभारी हैं कि आपने यह प्रोग्राम जो कि भारत में रखवाया है ऐसा आपके सिवाय और दूसरा कोई सोच भी नहीं सकता था सारा बात आपका आभारी है और वक्त आने पर आपका आभार उतरा जाएगा जय भारत जय भारत जय सनातन जय हिंदुस्तान
  • VEERAIAH BOPPARAJU September 09, 2023

    modi sir jindabad🙏🇮🇳💐
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s fruit exports expand into western markets with GI tags driving growth

Media Coverage

India’s fruit exports expand into western markets with GI tags driving growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
We remain committed to deepening the unique and historical partnership between India and Bhutan: Prime Minister
February 21, 2025

Appreciating the address of Prime Minister of Bhutan, H.E. Tshering Tobgay at SOUL Leadership Conclave in New Delhi, Shri Modi said that we remain committed to deepening the unique and historical partnership between India and Bhutan.

The Prime Minister posted on X;

“Pleasure to once again meet my friend PM Tshering Tobgay. Appreciate his address at the Leadership Conclave @LeadWithSOUL. We remain committed to deepening the unique and historical partnership between India and Bhutan.

@tsheringtobgay”