లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్-2028లో బేస్ బాల్/సాఫ్ట్ బాల్, క్రికెట్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోస్, స్క్వాష్ క్రీడలకు స్థానం కల్పించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చడం ద్వారా ఈ అద్భుత క్రీడకు ప్రపంచవ్యాప్త ప్రజాదరణ పెరుగుతుందని ఆయన అన్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్-2028 @LA28లో బేస్ బాల్/సాఫ్ట్ బాల్, క్రికెట్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోస్, స్క్వాష్ క్రీడలకు స్థానం కల్పించడం అత్యంత ముదావహం. ఆయా క్రీడాకారులకే కాకుండా అభిమానులకూ ఇదొక శుభవార్త. ఇక క్రికెట్‌ను ప్రేమించే దేశంగా, ఈ అద్భుత క్రీడకు పెరుగుతున్న ప్రపంచ ప్రజాదరణను ప్రతిబింబిస్తూ క్రికెట్‌ను చేర్చడాన్ని భారత్ ప్రత్యేకంగా స్వాగతిస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Absolutely delighted that baseball-softball, cricket, flag football, lacrosse and squash will feature in @LA28. This is great news for sportspersons. As a cricket loving nation, we specially welcome inclusion of cricket, reflecting the rising global popularity of this wonderful… https://t.co/tnwrzqVPfL
— Narendra Modi (@narendramodi) October 16, 2023