జైడస్ కాడిలా అభివృద్ధి చేస్తున్న డి.ఎన్.ఎ. ఆధారిత స్వదేశీ వ్యాక్సిన్ గురించి మరింతగా తెలుసుకోవడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్కును ఈరోజు సందర్శించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "జైడస్ కాడిలా అభివృద్ధి చేస్తున్న డి.ఎన్.ఎ. ఆధారిత వ్యాక్సిన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అహ్మదాబాద్ లోని జైడస్ బయోటెక్ పార్కును సందర్శించాను. ఈ ప్రయత్నం వెనుక పనిచేస్తున్న బృందం కృషిని నేను అభినందిస్తున్నాను. ఈ ప్రయాణంలో వారికి మద్దతుగా భారత ప్రభుత్వం వారితో పాటు కలిసి చురుకుగా పనిచేస్తోంది." అని పేర్కొన్నారు.
Visited the Zydus Biotech Park in Ahmedabad to know more about the indigenous DNA based vaccine being developed by Zydus Cadila. I compliment the team behind this effort for their work. Government of India is actively working with them to support them in this journey. pic.twitter.com/ZIZy9NSY3o
— Narendra Modi (@narendramodi) November 28, 2020