ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జార్ఖండ్‌లో భగవాన్ బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతు గ్రామాన్ని సందర్శించి, ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ గ్రామాన్ని సందర్శించిన తొలి ప్రధాని శ్రీ మోదీ కావడం ఈ సందర్భంగా విశేషం.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘భగవాన్ బిర్సా ముండా స్వగ్రామం ఉలిహతులో ఆయనకు శిరసాభివందనం చేసే అవకాశం లభించడం నా అదృష్టం. ఇక్కడికి వచ్చాక ఈ పుణ్యభూమి ఎంత శక్తిమంతమైనదో నాకు అర్థమైంది. ఈ గడ్డమీది అణువణువూ దేశవ్యాప్తంగాగల నా కుటుంబ సభ్యులందరికీ స్ఫూర్తినిస్తుంది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
भगवान बिरसा मुंडा जी के गांव उलिहातू में उन्हें शीश झुकाकर नमन करने का सौभाग्य प्राप्त हुआ। यहां आकर अनुभव हुआ कि इस पावन भूमि में कितनी ऊर्जा-शक्ति भरी है। इस मिट्टी का कण-कण देशभर के मेरे परिवारजनों को प्रेरित कर रहा है। pic.twitter.com/ystNxiHm13
— Narendra Modi (@narendramodi) November 15, 2023