బిహార్ లో గల నాలందా యొక్క శిథిలాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సందర్శించారు. సిసలు నాలందా విశ్వవిద్యాలయం ప్రపంచం లో మొట్టమొదటగా ఏర్పాటైన ఆశ్రమ వసతి తో కూడిన విశ్వవిద్యాలయాల లో ఒక విశ్వవిద్యాలయం గా లెక్క కు వచ్చింది. నాలందా యొక్క శిథిలాల ను 2016 వ సంవత్సరం లో ఐక్య రాజ్య సమితి యొక్క వారసత్వ స్థలం (యుఎన్ హెరిటేజ్ సైట్) గా ప్రకటించడమైంది.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
“నాలందా లో తవ్వకాల లో వెలికివచ్చినటువంటి అవశేషాల లో కలియదిరగడం విలక్షణమైంది. ప్రాచీన జగత్తు లో చదువుకోవడానికి అతి గొప్పవి అయినటువంటి పీఠాల లో ఒక పీఠాన్ని వీక్షించే అవకాశం లభించింది. విద్వాంసుల భూతకాలం లోకి తొంగి చూసే భాగ్యాన్ని ఈ స్థలం ప్రసాదిస్తున్నది. ఇది ఒకప్పుడు పుష్పించి ఫలాల ను అందించినటువంటిది. నాలందా సృజించిన మేధోపరమైన భావన మన దేశం లో నిరంతరం గా తొణికిసలాడుతూ ఉన్నది.” అని పేర్కొన్నారు.
Visiting the excavated remains of Nalanda was exemplary. It was an opportunity to be at one of the greatest seats of learning in the ancient world. This site offers a profound glimpse into the scholarly past that once thrived here. Nalanda has created an intellectual spirit that… pic.twitter.com/UAKCZZqXn4
— Narendra Modi (@narendramodi) June 19, 2024