వార్సాలోని కొల్హాపూర్ స్మారకం వద్ద బుధవారం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పోలెండ్ ప్రజల పట్ల దాతృత్వాన్ని చూపించిన కొల్హాపూర్ సంస్థానానికి ఈ స్మారకాన్ని అంకితమిచ్చారు. యుద్ధ సమయంలో కొల్హాపూర్‌లోని వలివాడెలో శిబిరాన్ని ఏర్పాటు చేసి పోలెండ్ ప్రజలకు ఆశ్రయం కల్పించారు. మహిళలు, పిల్లలు సహా దాదాపు 5,000 మంది పోలెండ్ శరణార్థులు ఈ శిబిరంలో ఆశ్రయం పొందారు. ఇందులో నివసించిన పోలెండ్ ప్రజలు, వారి వారసులతో స్మారకం వద్ద ప్రధానమంత్రి సమావేశమయ్యారు.
ఈ స్మారకాన్ని ప్రధానమంత్రి సందర్శించడం భారత్, పోలెండ్ మధ్య ఉన్న ప్రత్యేక చారిత్రక సంబంధాన్ని తెలియజేస్తోంది. ఈ సంబంధం ఇప్పటికీ అభివృద్ధి చెందుతోంది.