ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలోని జాతీయ ఆధునిక చిత్రకళా ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన జనశక్తి చిత్రకళా ప్రదర్శనను తిలకించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమం సంబంధిత కొన్ని ఇతివృత్తాల ఆధారంగా చిత్రించిన అద్భుత కళాఖండాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
దీనిపై ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్’లో జనశక్తి చిత్రకళా ప్రదర్శనను తిలకించాను. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోని కొన్ని ఇతివృత్తాల ఆధారంగా అద్భుతంగా చిత్రించిన కళాఖండాలతో ఈ ప్రదర్శన నిర్వహించారు. తమ సృజనాత్మకతతో ఈ ప్రదర్శనను సుసంపన్నం చేసిన కళాకారులందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
అలాగే- “ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్’లో నిర్వహించిన జనశక్తి చిత్రకళా ప్రదర్శనలోని కొన్ని కళాఖండాల విశేషాలను మీతో పంచుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
Visited Jana Shakti at @ngma_delhi. This is an exhibition of wonderful works of art based on some of the themes in the #MannKiBaat episodes. I compliment all the artists who have enriched the exhibition with their creativity. pic.twitter.com/HOrLDDzM2r
— Narendra Modi (@narendramodi) May 14, 2023
Here are some more glimpses from Jana Shakti exhibition at @ngma_delhi. pic.twitter.com/Cz9WmOuLK0
— Narendra Modi (@narendramodi) May 14, 2023