కోవిడ్ కోసం వ్యాక్సిన్ అభివృద్ధి మరియు తయారీ ప్రక్రియను వ్యక్తిగతంగా సమీక్షించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చేపట్టిన, తన మూడు నగరాల పర్యటనలో భాగంగా హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సదుపాయాన్ని ఈరోజు సందర్శించారు.
ఈ మేరకు శ్రీ నరేంద్రమోదీ, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థ వద్ద, వారి స్వదేశీ కోవిడ్-19 వ్యాక్సిన్ గురించి వివరించారు. ఇప్పటివరకు పరీక్షల్లో పురోగతి సాధించినందుకు శాస్త్రవేత్తలకు అభినందనలు. వారి బృందం వేగవంతమైన పురోగతిని సాధించేందుకు ఐ.సి.ఎం.ఆర్. తో కలిసి పనిచేస్తోంది." అని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి ఈ ఉదయం, అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్కును సందర్శించారు.
At the Bharat Biotech facility in Hyderabad, was briefed about their indigenous COVID-19 vaccine. Congratulated the scientists for their progress in the trials so far. Their team is closely working with ICMR to facilitate speedy progress. pic.twitter.com/C6kkfKQlbl
— Narendra Modi (@narendramodi) November 28, 2020