మయన్మార్ లోని బాగాన్ లో ఆనందా దేవాలయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు.
ఇది 12వ శతాబ్దం ఆరంభ కాలంలో నిర్మాణమైన ఒక బౌద్ధ దేవాలయం. బాగాన్ ప్రాంతంలోకెల్లా రెండవ అతి పెద్ద దేవాలయం ఇది. ఈ దేవాలయానికి సంబంధించిన నిర్మాణ పరిరక్షణతో పాటు రసాయనాల సాయంతో కాపాడే పనులను భారతదేశ పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఎఎస్ఐ) నిర్వహించింది.
కిందటి ఏడాది భూకంపం సమయంలో ఈ దేవాలయం ధ్వంసం అయినే నేపథ్యంలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులను కొనసాగిస్తున్నారు. దేవాలయంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులను తెలియజేసే ఒక ఛాయా చిత్ర ప్రదర్శనను ప్రధాన మంత్రి చూశారు. ఆయన దేవాలయాన్ని చుట్టి వచ్చారు; ప్రార్థనలలో పాలుపంచుకొన్నారు. ఈ సందర్భంగా ఎఎస్ఐ ప్రతినిధులు దేవాలయ పునరుద్ధరణ ప్రక్రియను గురించి ప్రధాన మంత్రికి వివరించారు.
దేవాలయం సందర్శకుల పుస్తకంలో ప్రధాన మంత్రి సంతకం చేశారు. ఆనందా దేవాలయం పునరుద్ధరణలో భారతదేశం అందిస్తున్న తోడ్పాటు యొక్క విశిష్టతను సూచించే ఒక ఫలకాన్ని కూడా ఆవిష్కరించారు.
ఆసియా అంతటా వేరు వేరు దేశాలలో అనేక ప్రధాన సంరక్షణ పనులను ఎఎస్ఐ అమలుపరచింది. వీటిలో ఆనందా దేవాలయంతో పాటు అఫ్గానిస్తాన్ లోని బమియాన్ బుద్ధులు, కంబోడియా లో అంకోర్ వట్, తా ప్రోమ్ దేవాలయం, లావోస్ లో వట్ ఫూ దేవాలయం, వియత్ నామ్ లోని మై సన్ టెంపుల్ లు కూడా ఉన్నాయి.
Connecting with history. PM @narendramodi pays respects at Ananda Temple,the most historical and venerated temple in Bagan, Myanmar. pic.twitter.com/UGNHQgdoIJ
— Raveesh Kumar (@MEAIndia) September 6, 2017