శంఘాయి కోఆపరేశన్ ఆర్గనైజేశన్ (ఎస్ సిఒ) దేశాధినేత ల మండలి 21వ సమావేశం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వర్చువల్ మాధ్యమం ద్వారా పాలుపంచుకొన్నారు; అఫ్ గానిస్తాన్ పై జరిగిన ‘జాయింట్ ఎస్ సిఒ-సిఎస్ టిఒ అవుట్ రీచ్ సెశన్’ లో ప్రధాన మంత్రి వీడియో సందేశం మాధ్యమం ద్వారా పాల్గొన్నారు.

ఎస్ సిఒ దేశాధినేతల మండలి 21వ సమావేశం దశాన్బే లో 2021 సెప్టెంబర్ 17న హైబ్రిడ్ ఫార్మేట్ లో జరిగింది.


సమావేశానికి తాజికిస్తాన్ అధ్యక్షుడు మాన్య శ్రీ ఎమోమీ రహమాన్ అధ్యక్షత వహించారు.

|

శిఖర సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో లింక్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్ దశాన్బే లో భారతదేశాని కి ప్రాతినిధ్యం వహించారు.


విస్తృతమైన ఎస్ సిఒ ప్రాంతం లో సమూల సంస్కరణీకరణ వాదం వల్ల, తీవ్రవాదం వల్ల తలెత్తుతున్న సమస్య ల ను గురించి ప్రధాన మంత్రి తన ప్రసంగం లో ప్రముఖం గా ప్రస్తావించారు. ఈ పరిణామాలు ఉదారవాదం తో కూడినటువంటి, ప్రగతిశీలమైనటువంటి సంస్కృతులకు, విలువల కు పెట్టని కోట గా ఉన్న ఈ ప్రాంత చరిత్ర కు భిన్నం గా ఉంటున్నాయన్నారు.


అఫ్ గానిస్తాన్ లో ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాల కారణం గా ఉగ్రవాదం తాలూకు ఈ ప్రవృత్తి మునుముందు మరింత పేట్రేగవచ్చని ఆయన అన్నారు.


ఎస్ సిఒ అనేది సంయమనం, విజ్ఞానశాస్త్రపరమైన మరియు హేతుబద్ధ ఆలోచనల ను ప్రోత్సహించే కార్యాచరణ విషయాల లో కృషి చేయవచ్చని, అలా చేస్తే అది ప్రత్యేకించి ఆ ప్రాంత యువత విషయం లో ప్రాసంగికం కాగలదని ఆయన సూచన చేశారు.

|

అభివృద్ధి కార్యక్రమాల లో డిజిటల్ సాంకేతికతల ను వినియోగించుకొంటున్న భారతదేశం అనుభవాన్ని గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ ఓపెన్- సోర్స్ పరిష్కారాల ను ఎస్ సిఒ లోని ఇతర సభ్యత్వ దేశాల తో పంచుకొనేందుకు సుముఖత ను వ్యక్తం చేశారు.


ఆ ప్రాంతం లో సంధాన సదుపాయాలను నిర్మించడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వడం గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, పరస్పర విశ్వాసాన్ని పెంచడం కోసం కనెక్టివిటీ ప్రాజెక్టు లు పారదర్శకం గా, భాగం పంచుకొనేవి గా, సంప్రదింపులపై ఆధారపడేవి గా ఉండాలి అని నొక్కిచెప్పారు.

|

 

ఎస్ సిఒ శిఖర సమ్మేళనం అనంతరం ఎస్ సిఒ కు, కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేశన్ (సిఎస్ టిఒ) కు మధ్య అఫ్ గానిస్తాన్ పై అవుట్ రీచ్ సమావేశం జరిగింది. ప్రధాన మంత్రి ఒక వీడియో- సందేశం మాధ్యమం ద్వారాఅవుట్ రీచ్ సమావేశం లో పాల్గొన్నారు. ఎస్ సిఒ ఈ ప్రాంతం లో ఉగ్రవాదం పట్ల ‘జీరో టాలరెన్స్’ అంశం పై ఒక ప్రవర్తన నియమావళి ని అభివృద్ధిపరచవచ్చు అంటూ ప్రధాన మంత్రి తన వీడియో సందేశం లో సూచన చేశారు. అఫ్ గానిస్తాన్ నుంచి మత్తు పదార్థాలు, ఆయుధాలు, మానవుల అక్రమ తరలింపు ల వంటి అపాయాల కు తావు ఉంటుంది అని కూడా ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. అఫ్ గానిస్తాన్ లో ఏర్పడ్డ మానవతా సంకటాన్ని గురించి ఆయన చెప్తూ, అఫ్ గానిస్తాన్ ప్రజల తో భారతదేశం సంఘీభావాన్ని గురించి పునరుద్ఘాటించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
For PM Modi, women’s empowerment has always been much more than a slogan

Media Coverage

For PM Modi, women’s empowerment has always been much more than a slogan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 మార్చి 2025
March 08, 2025

Citizens Appreciate PM Efforts to Empower Women Through Opportunities