QuoteRo-Pax service will decrease transportation costs and aid ease of doing business: PM Modi
QuoteConnectivity boost given by the ferry service will impact everyone starting from traders to students: PM Modi
QuoteName of Ministry of Shipping will be changed to Ministry of Ports, Shipping and Waterways: PM Modi

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ  హజారియాలో ఆర్ఒ-పాక్స్ టెర్మిన‌ల్‌ను,  హ‌జారియా,- గుజ‌రాత్‌లోని ఘోఘా మ‌ధ్య ఆర్ ఒ -పాక్స్ ఫెర్రి స‌ర్వీసును జెండా ఊపి వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్థానికంగా ఈ సేవ‌ల‌ను ఉప‌యోగించుకునే వారితో మాట్లాడారు. షిప్పింగ్ మంత్రిత్వ‌శాఖ‌ను మినిస్ట్రీ ఆఫ్ పొర్ట్స్‌, షిప్పింగ్‌, వాట‌ర్‌వేస్‌గా మార్పు చేశారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి, గుజ‌రాత్ ప్ర‌జ‌లు దివాలీ బ‌హుమ‌తి అందుకున్నార‌ని అన్నారు. మెరుగైన ఈ అనుసంధాన‌త వ‌ల్ల ప్ర‌తిఒక్క‌రూ ల‌బ్ది పొందుతున్నారు. దీనివ‌ల్ల వ్యాపారం అభివృద్ధిచెందుతుంద‌ని, అనుసంధాన‌త‌వ‌ల్ల వేగం పెరుగుతుంద‌న్నారు. హ‌జారియా .ఘోగా మ‌ధ్య ఆర్ ఒ పాక్స్‌స‌ర్వీసు సౌరాష్ట్ర‌, ద‌క్షిణ గుజ‌రాత్ ప్ర‌జ‌ల క‌ల‌ల‌ను సాకారం చేస్తున్న‌ద‌న్నారు. దీన‌వ‌ల్ల ప్ర‌యాణ స‌మ‌యం 10-12 గంట‌ల‌నుంచి 3-4 గంల‌కు త‌గ్గుతుంద‌ని అన్నారు. ఇది స‌మ‌యం ఆదా చేయ‌డ‌మే కాక‌, ఖ‌ర్చులు కూడా త‌గ్గుతాయ‌న్నారు. 80,000 పాసింజ‌ర్‌రైళ్లు , 30,000 ట్ర‌క్కులు  ఈ కొత్త స‌ర్వీసువ‌ల్ల ఏడాదిలో ప్ర‌యోజ‌నం పొంద‌నున్నాయ‌న్నారు.

|

సౌరాష్ట్ర‌, సూర‌త్ మ‌ధ్య మెరుగైన అనుసంధాన‌త ఈ ప్రాంత ప్ర‌జ‌ల జీవితంలో మార్పు తీసుకురానున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ తెలిపారు. పండ్లు, కూర‌గాయ‌లు, పాలను ఇక సుల‌భంగా ర‌వాణా చేయ‌డానికి వీలుక‌లుగుతుంద‌ని, ఈ జ‌ల‌మార్గ సేవ‌ల‌వ‌ల్ల కాలుష్యం కూడా త‌గ్గుతుంద‌న్నారు. ఎన్నో స‌వాళ్ల మ‌ధ్య ఈ సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేసిన ఇంజ‌నీర్లు, వ‌ర్క‌ర్ల‌కు ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు తెలిపారు. భావ్‌న‌గ‌ర్‌-సూర‌త్‌ల‌మ‌ధ్య నౌకాయాన అనుసంధాన‌త వ‌చ్చినందుకు ఆయ‌న ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

గ‌డ‌చిన రెండు ద‌శాబ్దాల‌లో గుజ‌రాత్‌త‌న జ‌ల‌ర‌వాణా శ‌క్తిని పెంపొందించుకున్నందుకు , పోర్టుల ఆధారిత అభివృద్దికి ప్రాధాన్య‌త ఇచ్చినందుకు ,నౌకానిర్మాణ పాల‌సీని రూపొందించినందుకు ప్ర‌ధాని ప్ర‌శంసించారు.షిప్‌బిల్డింగ్‌పార్కు, ప్ర‌త్యేక టెర్మిన‌ళ్ల ఏర్పాటు, వెస‌ల్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్య‌వ‌స్థ ఏర్పాటు , క‌నెక్టివిటీ ప్రాజెక్టుల ప‌ట్ల ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈచ‌ర్య‌ల వ‌ల్ల పోర్టుల రంగానికి కొత్త దిశా నిర్దేశం జ‌రిగింద‌న్నారు. కోస్తా ప్రాంతానికి సంబంధించిన మొత్తం వాతావ‌ర‌ణాన్ని ఆధునీక‌రించ‌డానికి కృషి జ‌రిగింద‌ని, భౌతికంగా మౌలిక‌స‌దుపాయాల‌నుఅభివృద్ధి చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం  జ‌రిగింద‌ని తెలిపారు.

|

ప్ర‌భుత్వ చ‌ర్య‌ల కార‌ణంగా  గుజ‌రాత్ సుసంప‌న్న‌త‌కు గేట్‌వేగా నిలిచింద‌ని, కోస్తా ప్రాంతంలో అన్నిర‌కాల అభివృద్ధి సాధ్య‌మైంద‌ని ఆయ‌న అన్నారు. గ‌త రెండు ద‌శాబ్దాలుగా  గుజ‌రాత్‌లో సంప్ర‌దాయ పోర్టుల‌కు బదులుగా స‌మీకృత పోర్టుల న‌మూనా చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని,  ఈ కృషివ‌ల్ల గుజ‌రాత్ పోర్టులు ప్ర‌ధాన నౌకాయాన స‌కేంద్రాలుగా విల‌సిల్లుతున్నాయ‌న్నారు. గ‌త ఏడాది దేశంలో జ‌రిగిన మొత్తం నౌకార‌వాణాలో 40 శాతం ఇక్క‌డినుంచే జ‌రిగింద‌న్నారు.

 ప్ర‌స్తుతం గుజ‌రాత్‌లో నౌకార‌వాణా సంబంధిత వ్యాపారం, మౌలిక స‌దుపాయాలు, సామ‌ర్ధ్యాల పెంపు పెద్ద ఎత్తున జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌ధానమంత్రి చెప్పారు. గుజ‌రాత్ లో ఎన్నో స‌దుపాయాలు అందుబాటులోకి వ‌స్తున్నాయ‌ని, గుజ‌రాత్ మారీటైమ్ క్ల‌స్ట‌ర్‌, గుజ‌రాత్ మారీటైమ్‌యూనివ‌ర్సిటీ, భావ‌న‌గ‌ర్‌లో దేశ తొలి సిఎన్‌జి టెర్మిన‌ల్ సిద్ధ‌మౌతున్నాయ‌న్నారు. గుజ‌రాత్ మారీటైమ్ క్ల‌స్ట‌ర్ పోర్టులను గిఫ్ట్ సిటీ లో నిర్మిస్తున్నార‌ని, పోర్టు నుంచి స‌ముద్ర ఆధారిత ర‌వాణా స‌దుపాయాల అవ‌స‌రాల‌ను ఇది తీరుస్తుంద‌ని అన్నారు. ఈ క్ల‌స్ట‌ర్లు ప్ర‌భుత‌వ్ం, ప‌రిశ్ర‌మ‌, విద్యా సంస్థ‌ల మ‌ధ్య స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేయ‌నున్నాయ‌న్నారు. అలాగే ఈ రంగంలో విలువ జోడింపున‌కు ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయ‌న్నారు.

|

ఇటీవ‌లే ఇండియా తొలి ర‌సాయ‌న టెర్మిన‌ల్‌ను ద‌హేజ్‌లో ఏర్పాటుచేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇండియా తొలి ఎల్‌.ఎన్‌.జి టెర్మిన‌ల్‌ను ఏర్పాటుచేయ‌డం జ‌రిగింది, ఇప్పుడు దేశ తొలి సిఎన్‌జి టెర్మిన‌ల్‌ను భావ‌న‌గ‌ర్ పోర్టులో ఏర్పాటుచేయ‌నున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.వీటితోపాటు భావ‌న‌గ‌ర్ పోర్టులో  ఆర్ ఒ – ఆర్‌.ఒ టెర్మిన‌ల్ , లిక్విడ్ కార్గో టెర్మిన‌ల్‌, కొత్త కంటైన‌ర్ టెర్మిన‌ల్ సిద్ధం కానున్నాయ‌న్నారు. ఈ కొత్త టెర్మిన‌ళ్ల‌తో భావ‌న‌గ‌ర్ పోర్టు సామ‌ర్ధ్యం ఎన్నోరెట్లు పెర‌గ‌నున్న‌ద‌న్నారు.

ఘోఘా- ద‌హేజ్ మ‌ధ్య త్వ‌ర‌లోనే ఫెర్రీ స‌ర్వీసును ప్రారంభించ‌డానికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు అమ‌లులో ప్ర‌కృతికి సంబంధించిన ఎన్నో స‌వాళ్లు ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చింద‌న‌ని , వాటిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం స‌హాయంతో ప‌రిష్క‌రించ‌డం జ‌రుగుతొంద‌ని ఆయ‌న అన్నారు. స‌ముద్ర ర‌వాణా వాణిజ్యానికి సంబంధించి మాన‌వ వ‌న‌రుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డానికి గుజ‌రాత్‌మారీటైమ్ యూనివ‌ర్సిటీ ఒక గొప్ప కేంద్రంగా ఉంద‌ని అన్నారు.  ప్ర‌స్తుతం ఈ విశ్వ‌విద్యాల‌యం స‌ముద్ర‌యాన చ‌ట్టాలు, అంత‌ర్జాతీయ వాణిజ్య చ‌ట్టాలు,మారీటైమ్ మేనేజ్‌మెంట్‌లో షిప్పింగ్‌, లాజిస్టిక్స్ వంటి వాటిలో ఎంబిఎ అందుబాటులోకి తెచ్చింద‌న్నారు. ఈ విశ్వ‌విద్యాల‌యానికి తోడు లోథాల్‌లో దేశ స‌ముద్ర‌యాన వార‌స‌త్వాన్ని ప‌రిర‌క్షించేందుకు ఒక జాతీయ మ్యూజియంను ఏర్పాటుచేస్తున్న‌ట్టు తెలిపారు.

|

ఈ రోజు ప్రారంభించిన ఆర్‌.ఒ-పాక్స్ ఫెర్రీ స‌ర్వీసు గానీ లేదా కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన సీ ప్లేన్ స‌ర్వీసు కానీ జ‌ల‌వ‌న‌రుల ఆధారిత ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు పెద్ద ఎత్తున ఊతం ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.దేశంలో నీలిఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను పెద్దఎత్తున అభివృద్ధి చేసేందుకు గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా గ‌ట్టి కృషి జ‌రిగిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా తీసుకున్న చ‌ర్య‌ల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. మ‌త్స్య‌కారుల‌కు ఆర్ధిక స‌హాయం, వారికి ఆధునిక ట్రాలర్లు, నావిగేష‌న్ వ్య‌వ‌స్థ‌ను స‌మ‌కూర్చ‌డం వంటి వాటి గురించి తెలిపారు. ఆధునిక నావిగేష‌న్ వ్య‌వ‌స్థ‌వ‌ల్ల మ‌త్స్య‌కారులు వాతావ‌ర‌ణాన్ని, స‌ముద్ర మార్గానికి సంబంధించిన ఖ‌చ్చిత‌మైన‌ స‌మాచారాన్ని తెలుసుకోగ‌లుగుతారు.  
మ‌త్స్యాకారుల భ‌ద్ర‌త‌, వారి సంర‌క్ష‌ణ ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త అని అన్నారు. మ‌త్స్య సంబంధిత వాణిజ్యం కోసం  ఇటీవ‌ల ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న గురించి ప్ర‌ధాన‌మంత్రి  ప్ర‌స్తావించారు. ఈప‌థ‌కం కింద రాగ‌ల సంవ‌త్స‌రాల‌లో మ‌త్స్య‌రంగానికి సంబంధించిన మౌలిక‌స‌దుపాయాల క‌ల్ప‌న‌కు 20 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేయ‌నున్నారు.‌
 ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా పోర్టుల సామ‌ర్ధ్యాన్ని పెంచ‌డం జ‌రిగింద‌ని, నూత‌న పోర్టుల నిర్మాణం శ‌రవేగంతో సాగుతున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. దేశంలో 21,000 కిలోమీట‌ర్ల మేర జ‌ల‌మార్గాల‌ను దేశాభివృద్ధి కోసం గ‌రిష్ఠ‌స్థాయిలో వాడుకునేందుకు కృషిచేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. సాగ‌ర‌మాల ప్రాజెక్టు కింద, దేశ‌వ్యాప్తంగా 500ప్రాజెక్టుల‌పై కృషిచేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. రోడ్డు , రైలు మార్గాల‌క‌న్నా జ‌ల‌మార్గాల ద్వారా ర‌వాణా అత్యంత చ‌వ‌క‌గా ఉంటుంద‌ని, ప‌ర్యావ‌ర‌ణానికి జ‌రిగే న‌ష్టం కూడా త‌క్కు వ అని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ఈ దిశ‌గా స‌మ‌గ్ర విధానంతో 2014 త‌ర్వాత చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతున్న‌ద‌న్నారు. దేశీయ న‌దీమార్గాల‌లో ప్ర‌స్తుతం ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. చుట్టూ భూమార్గ‌మే ఉన్న ఎన్నో రాష్ట్రాల‌ను స‌ముద్ర తీరంతో క‌లిపేందుకుచ‌ర్య‌లు తీసుకొవ‌డం జ‌రిగింద‌న్నారు. ఇవాళ బంగాళాఖాతం , హిందూ మ‌హాస‌ముద్రంలో మ‌న సామ‌ర్ధ్యాల‌ను మున్నెన్న‌డూ లేనంత‌గా అభివృద్ధి చేసుకుంటున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌లో స‌ముద్ర ర‌వాణా అంశం కీల‌క పాత్ర పోషిస్తున్న‌ద‌న్నారు.
షిప్పింగ్ మంత్రిత్వ‌శాఖ పేరును ప్ర‌ధాన‌మంత్రి పోర్టులు, షిప్పింగ్‌, వాట‌ర్‌వేస్ మంత్రిత్వ‌శాఖ‌గా మార్చారు. చాలా అభివృద్ధి చెందిన దేశాల‌లో షిప్పింగ్ మంత్రిత్వ‌శౄఖ పోర్టులు, జ‌ల‌మార్గాల అంశాల‌నుకూడా చూస్తుంద‌న్నారు. ప్ర‌స్తుత‌త మంత్రిత్వ‌శాఖ పేరులో మ‌రింత స్ప‌ష్ట‌త ఉంద‌ని, ప‌నిలో మ‌రింత స్ప‌ష్ట‌త ఉండ‌నున్న‌ద‌ని అన్నారు.

ఆత్మ‌నిర్భ‌ర భార‌త్‌లో బ్లూ ఎకాన‌మీవంతును బ‌లోపేతం చేసేందుకు నౌకాయాన మౌలిక‌స‌దుపాయాల‌ను బ‌లోపేతం చేయ‌వ‌ల‌సి ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. దేశంలో స‌ర‌కులను ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి త‌ర‌లించ‌డానికి అవుతున్న ఖ‌ర్చు ఇత‌ర దేశాల‌లో కంటే ఎక్కువ‌గా ఉంటున్న‌ద‌ని అన్నారు. జ‌ల‌మార్గాల ద్వారా ర‌వాణా వ‌ల్ల ఈ ఖ‌ర్చులు త‌గ్గించ‌వ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. అందువ‌ల్ల స‌ర‌కు ర‌వాణా ఎలాంటి అడ్డంకులు లేకుండా త‌ర‌లించ‌డానికి జ‌ల‌ర‌వాణా మార్గాల ద్వారా వీలు క‌ల్పించాల‌న్నారు. ఈ దిశ‌గా దేశం పెద్ద ఎత్తున చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ద‌ని, స‌ర‌కు ర‌వాణా ఖ‌ర్చులు త‌గ్గించేందుకు బ‌హుళ విధ అనుసంధాన‌త దిశ‌గా కృషి చేస్తున్న‌ద‌ని చెప్పారు. రోడ్డు, రైలు, విమాన‌, నౌకాయాన అనుసంధాన‌త‌ను మెరుగుప‌రిచేందుకు మౌలిక‌స‌దుపాయాల‌ను మెరుగుపర‌చ‌డం జ‌రుగుతోంద‌ని, ఈ దిశ‌గా ఉన్న అడ్డంకుల‌ను తొల‌గించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. దేశంలో మ‌ల్టీ మోడ‌ల్ లాజిస్టిక్ పార్కుల‌ను నిర్మించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ఇరుగు పొరుగు దేశాల‌తో క‌ల‌సి మ‌ల్టీమోడ‌ల్ అనుసంధాన‌త‌ను కూడా అభివృద్ధి చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ దిశ‌గా సాగుతున్న కృషి దేశంలో స‌ర‌కు రవాణా  ఖ‌ర్చును త‌గ్గించ‌గ‌ల‌ద‌ని,  దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు ఊతం ఇవ్వ‌గ‌ల‌ద‌ని అన్నారు.

 స్థానిక వ‌స్తువుల కొనుగోలుకు సంబంధించి వోక‌ల్ ఫ‌ర్ లోకల్ ను ప్ర‌‌స్తుత పండ‌గ‌ల సీజ‌న్‌లో దృష్టిలో ఉ ంచుకోవ‌ల‌సిందిగా ప్ర‌ధాన‌మంత్రి సూచించారు. చిన్న వ్యాపారులు, చిన్న హ‌స్త‌క‌ళాకారులు, గ్రామీణ ప్రాంతాల వారినుంచి ఉత్ప‌త్తులు కొనుగోలు చేయాల్సిందిగా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌జ‌ల‌కు సూచించారు. ఈ చ‌ర్య‌ల వ‌ల్ల దీపావ‌ళి సంద‌ర్భంగా  గ్రామీణ చేతివృత్తుల వారి ఇళ్ల‌లో వెలుగులు విర‌జిమ్ముతాయ‌ని ఆయ‌న అన్నారు.

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

  • krishangopal sharma Bjp January 14, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 14, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹
  • krishangopal sharma Bjp January 14, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷
  • Jayanta Kumar Bhadra June 29, 2022

    Jay Sree Krishna
  • Jayanta Kumar Bhadra June 29, 2022

    Jay Sree Ram
  • Jayanta Kumar Bhadra June 29, 2022

    Jay Sree Ganesh
  • Laxman singh Rana June 26, 2022

    namo namo 🇮🇳🙏🚩🙏
  • Laxman singh Rana June 26, 2022

    namo namo 🇮🇳🙏🌷🙏
  • Bhagyanarayan May 10, 2022

    जय श्री राम
  • G.shankar Srivastav March 19, 2022

    नमो
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
How the makhana can take Bihar to the world

Media Coverage

How the makhana can take Bihar to the world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 ఫెబ్రవరి 2025
February 25, 2025

Appreciation for PM Modi’s Effort to Promote Holistic Growth Across Various Sectors