యోగ కు చెందిన వివిధ ఆసనాలను మరియు వాటి వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలిపే కొన్ని వీడియోల ను కూడా శేర్ చేసిన ప్రధాన మంత్రి

యోగ ను ప్రజలు వారి జీవనం లో ఒక విడదీయలేనటువంటి భాగం గా మలచుకోవాలి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరారు. యోగ మనస్సు కు నెమ్మది ని ఇస్తుంది, మరి మన జీవనం లోని సవాళ్ళ ను మనం ప్రశాంతి తో, ధీరోదాత్తత తో దాటి ముందుకు పోయేందుకు యోగ వీలు ను కల్పిస్తుంది అని కూడా ఆయన అన్నారు.

 

త్వరలోనే యోగ దినం రానుండడాన్ని దృష్టి లో పెట్టుకొని, వేరు వేరు యోగ ఆసనాల ను గురించి మరియు వాటి వల్ల లభించే ప్రయోజనాల ను గురించి వివరించే కొన్ని వీడియోల ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు :

‘‘మరో పది రోజుల లో, ప్రపంచం యోగ యొక్క పదో అంతర్జాతీయ దినాన్ని జరుపుకోనున్నది. చిరకాలం పాటించదగినటువంటి ఒక అభ్యాసమే యోగ; మరి ఇది ఏకాత్మకత ను మరియు సద్భావన ను చాటి చెప్పేది కూడాను. సాంస్కృతికమైన ఎల్లల ను మరియు భౌగోళికమైన ఎల్లల ను మించిపోయినటువంటి యోగ సంపూర్ణ శ్రేయం కోసం సాగే అన్వేషణ లో ప్రపంచవ్యాప్తం గా లక్షల మంది ప్రజల ను ఏకం చేస్తున్నది.’’

 

‘‘ఈ సంవత్సరం లో యోగ దినం వైపునకు మనం పయనిస్తున్న క్రమం లో, యోగ ను మన జీవనాల లో ఒక విడదీయలేని అటువంటి భాగం గా మలచుకోవాలన్న మన వచన బద్ధత ను పునరుద్ఘాటించడం మరియు ఇతరుల ను కూడా యోగ ను వారి యొక్క జీవనం లో ఒక భాగం గా చేసుకొనేందుకు ప్రోత్సహించడం అత్యవసరం. యోగ నెమ్మది ని ప్రసాదించడం ద్వారా జీవనం లోని సవాళ్ళ ను ప్రశాంతి తో మరియు ధీరోదాత్తత తో ఎదుర్కొనేందుకు వీలు కలుగజేస్తుంది.’’

 

‘‘యోగ దినం త్వరలో రానుండగా, ఈ సందర్భం లో వేరు వేరు యోగ ఆసనాలు మరియు అవి అందజేసే ప్రయోజనాలు ఎటువంటివి అనే అంశాల లో దారి ని చూపేటటువంటి కొన్ని వీడియోల ను నేను శేర్ చేస్తున్నాను. ఇవి మీరు అందరు క్రమం తప్పక యోగ ను అభ్యసించేందుకు ప్రేరణ ను అందిస్తాయని నేను ఆశిస్తున్నాను.’’

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Media Coverage

"91.8% of India's schools now have electricity": Union Education Minister Pradhan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Naming the islands in Andaman and Nicobar after our heroes is a way to ensure their service to the nation is remembered for generations to come: PM
December 18, 2024
Nations that remain connected with their roots that move ahead in development and nation-building: PM

The Prime Minister, Shri Narendra Modi today remarked that naming the islands in Andaman and Nicobar after our heroes is a way to ensure their service to the nation is remembered for generations to come. He added that nations that remain connected with their roots that move ahead in development and nation-building.

Responding to a post by Shiv Aroor on X, Shri Modi wrote:

“Naming the islands in Andaman and Nicobar after our heroes is a way to ensure their service to the nation is remembered for generations to come. This is also part of our larger endeavour to preserve and celebrate the memory of our freedom fighters and eminent personalities who have left an indelible mark on our nation.

After all, it is the nations that remain connected with their roots that move ahead in development and nation-building.

Here is my speech from the naming ceremony too. https://www.youtube.com/watch?v=-8WT0FHaSdU

Also, do enjoy Andaman and Nicobar Islands. Do visit the Cellular Jail as well and get inspired by the courage of the great Veer Savarkar.”