‘వేలాది ఏళ్లుగా ఒడుదొడుకులను దృఢంగా ఎదుర్కొనడంలో మన నాగరికత.. వారసత్వం ప్రధాన పాత్ర పోషించాయి’’;
‘‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం సూత్రానికి హనుమంతుల వారు ఎంతో కీలకం’’;
‘‘మన విశ్వాసం.. సంస్కృతి ప్రవాహంలో సామరస్యం.. సమానత్వం.. సమగ్రతలు అంతర్భాగం’’;
‘‘సబ్కా సాథ్... సబ్కా ప్రయాస్’కు రామకథ ఉత్తమ ఉదాహరణ..అందులో ఎంతో ముఖ్యమైనది హనుమంతులవారి పాత్ర’’;

నుమజ్జయంతి పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్ లోని మోర్బిలో 108 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో మహామండలేశ్వరి కనకేశ్వరి దేవి మాత కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- ముందుగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

మోర్బిలో 108 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయడం ప్రపంచవ్యాప్తంగాగల ఆ చిరంజీవి భక్తులందరికీ ఆనందం కలిగించే సంఘటన అని ఆయన అభివర్ణించారు. ఇటీవలి కాలంలో భక్తజన సమూహాలతోపాటు ఆధ్యాత్మిక గురువుల నడుమ పలుమార్లు గడపడం తనకు ఎనలేని ఆనందం కలిగించిందని ఆయన అన్నారు. ఈ మేరకు ఉమియా మాత, మాత అంబ, అన్నపూర్ణ ధామంలను వరుసగా దర్శించుకునే అవకాశం కూడా లభించిందని హర్షం వ్యక్తం చేశారు. తనపై ‘హరి కృప‘ ఉండటం వల్లనే ఇదంతా సాధ్యమైందని ప్రధాని పేర్కొన్నారు.

   దేశం నాలుగు మూలల్లో ఇటువంటి నాలుగు విగ్రహాలను స్థాపించే ప్రాజెక్టు ‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం’ సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. హనుమంతుల వారు తన సేవా స్ఫూర్తితో అందర్నీ ఏకం చేస్తాడని, ప్రతి ఒక్కరూ ఆయననుంచి ప్రేరణ పొందుతారని ఆయన వివరించారు. హనుమంతుల వారంటే ఆత్మగౌరవం, సాధికారత సాధించడంలో అడవుల్లో నివసించే సమాజాలు చూపిన శక్తికి చిహ్నమని చెప్పారు. ఆ మేరకు ‘‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం సూత్రానికి హనుమంతుల వారు ఎంతో కీలకం’’ అని పేర్కొన్నారు.

 

   అదేవిధంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, అనేక భాషలలో సాగే రామకథా గానం భగవంతునిపట్ల భక్తిభావాన్ని ప్రోది చేసి, అందర్నీ ఒక్కతాటిపైకి తెస్తుందని ప్రధానమంత్రి విశదీకరించారు. శక్తిమంతమైన మన ఆధ్యాత్మిక వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాలకు ఇది తిరుగులేని ఉదాహరణ అని స్పష్టం చేశారు. కాబట్టే బానిస యుగపు కష్టకాలంలో కూడా ప్రతి ఒక్కరిలో ఏకతాభావం వివిధ ప్రాంతాలను సమైక్యంగా నిలిపిందని వివరించారు. ఈ కృషే స్వాతంత్ర్యం కోసం ప్రతినబూనే విధంగా జాతీయస్థాయిలో ఏకీభావాన్ని బలోపేతం చేసిందని తెలిపారు. ఈ మేరకు ‘‘వేలాది ఏళ్లుగా ఒడుదొడుకులను దృఢంగా ఎదుర్కొనడంలో మన నాగరికత.. వారసత్వం ప్రధాన పాత్ర పోషించాయి’’ అని వివరించారు.

   లాగే ‘‘మన విశ్వాసం.. సంస్కృతి ప్రవాహంలో సామరస్యం.. సమానత్వం.. సమగ్రతలు అంతర్భాగం’’గా ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. శ్రీరాముడు సర్వశక్తి సంపన్నుడు అయినప్పటికీ తన కర్తవ్య నిర్వహణలో ప్రతి ఒక్కరి బలాన్నీ ఏకీకృతం చేయడం ఇందుకు నిదర్శనమని ప్రధాని అభివర్ణించారు. ఆ విధంగా ‘‘సబ్కా సాథ్... సబ్కా ప్రయాస్కు రామకథ ఉత్తమ ఉదాహరణ కాగా.. అందులో హనుమంతుల వారు పోషించిన పాత్ర ఎంతో ముఖ్యమైనది’’ అని శ్రీ మోదీ వివరించారు. అందరి కృషితోనే ఎంతటి దృఢ సంకల్పాన్నయినా నెరవేర్చడం సాధ్యమన్న స్ఫూర్తిని ఇది ప్రస్ఫుటం చేస్తున్నదని పేర్కొన్నారు.

   నంతరం గుజరాతీ భాషలో మాట్లాడుతూ- కేశవానంద్ బాపూను, మోర్బి పట్టణంతో ఆయనకుగల అనుబంధాన్ని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. మచ్చూధామ్ ప్రమాదం సందర్భంగా హనుమాన్ ధామ్ పోషించిన పాత్రను ఆయన ప్రస్తావించారు. ఆనాటి అనుభవ పాఠాలే కచ్ భూకంపం దుర్ఘటన నుంచి కోలుకోవడంలో తోడ్పడ్డాయని పేర్కొన్నారు. నేడు వర్ధమాన పరిశ్రమల కేంద్రంగా ఎదుగుతుండటం మోర్బి ప్రతిరోధక సామర్థ్యానికి నిదర్శనమని ఆయన కొనియాడారు. జామ్ నగర్ లో ఇత్తడి పరిశ్రమ, రాజ్ కోట్ లో ఇంజనీరింగ్ తదితరాలను గమనించినప్పుడు, మోర్బిలో గడియారాల పరిశ్రమ ‘సూక్ష్మ జపాన్’ను తలపిస్తుందని ఆయన పేర్కొన్నారు. యాత్రాధామ్ కథియవాడ్ ను పర్యాటక కూడలిగా మార్చిందని ప్రధాని గుర్తుచేశారు. అదే తరహాలో మాధవ్ పూర్ మేళా, రణ్ ఉత్సవం మోర్బి పట్టణానికి అపార ప్రయోజనాలు కల్పించాయని చెప్పారు. పరిశుభ్రత ఉద్యమంతోపాటు ‘స్థానికం కోసం స్వగళం’ కార్యక్రమ విజయం కోసం భక్తుల, సాధు సమాజాల తోడ్పాటు పొందడానికి ప్రాధాన్యమివ్వాలని ఈ సందర్భంగా శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

   # నుమాన్‌జీ4ధామ్’’ ప్రాజెక్టులో భాగంగా దేశం నాలుగు దిక్కులలోనూ ఏర్పాటుచేయ తలపెట్టిన నాలుగు విగ్రహాలలో ఇవాళ ఆవిష్కృతమైనది రెండో విగ్రహం. ఈ మేరకు పశ్చిమ దిక్కున మోర్బిలోని పరమ పూజ్య బాపూ కేశవానంద్ ఆశ్రమంలో ఏర్పాటు చేయబడింది. ఈ పరంపరలోని తొలి విగ్రహాన్ని 2010లో ఉత్తర దిక్కునగల సిమ్లాలో ఏర్పాటు చేశారు. ఇక దక్షిణ దిక్కుకు సంబంధించి ప్రస్తుతం రామేశ్వరంలో విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage