యాస్ చక్రవాతం వల్ల తలెత్తిన స్థితి ని సమీక్షించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒడిశా ను, పశ్చిమ బంగాల్ ను 2021 మే నెల 28 న సందర్శించారు. ఒడిశా లోని భద్రక్, బాలేశ్వర్ జిల్లాల తో పాటు పశ్చిమ బంగాల్ లోని పూర్వ మేదినీపుర్ జిల్లా లో గాలివాన వల్ల ప్రభావితమైన ప్రాంతాలను ఆయన విమానం ద్వారా పరిశీలించారు.
చేపడుతున్న సహాయం, పునరావాస సంబంధి ఏర్పాటుల ను సమీక్షించడం కోసం భువనేశ్వర్ లో నిర్వహించిన ఒక సమావేశానికి ప్రధాన మంత్రి అధ్యక్షత వహించారు.
యాస్ చక్రవాతం కారణం గా ఒడిశా లో గరిష్ఠ స్థాయి నష్టం వాటిల్లిందని, పశ్చిమ బంగాల్ లోని కొన్ని ప్రాంతాల తో పాటు ఝార్ ఖండ్ లోను కొన్ని ప్రాంతాలు కూడాను ప్రభావితం అయ్యాయని ప్రధాన మంత్రి కి వివరించడం జరిగింది.
తక్షణ సహాయక కార్యకలాపాల కు గాను శ్రీ నరేంద్ర మోదీ 1000 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఒడిశా కు 500 కోట్ల రూపాయలు వెనువెంటనే ఇవ్వడం జరుగుతుంది. పశ్చిమ బంగాల్ కు, ఝార్ ఖండ్ కు మరొక 500 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించడమైంది. ఈ సొమ్ము ను వాటిల్లిన నష్టాలు ప్రాతిపదిక గా విడుదల చేయడం జరుగుతుంది. నష్టం పరిమాణాన్ని అంచనా వేయడానికి గాను వివిధ మంత్రిత్వ శాఖ ల సభ్యులతో కూడిన ఒక బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపనుంది. ఈ మదింపు ను ఆధారం గా చేసుకొని సాయం రాశి ని పెంచడం జరుగుతుంది.
ఈ కష్ట కాలం లో కేంద్ర ప్రభుత్వం ఒడిశా, పశ్చిమ బంగాల్, ఝార్ ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వాల తో కలిసికట్టుగా కృషి చేస్తుంది, ప్రభావిత ప్రాంతాల లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణ కు, పునర్ నిర్మాణానికి చేతనైన అన్ని విధాలు గాను సాయపడుతుంది అంటూ ఆయా రాష్ట్రాల ప్రజల కు ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు.
చక్రవాతం కారణంగా తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాల కు ప్రధాన మంత్రి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ విపత్తు సందర్భం లో బాధితులైన వ్యక్తులు అందరికీ తన పూర్తి అండదండలు ఉంటాయని ఆయన తెలియజేశారు.
చక్రవాతం లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయలు వంతు న పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని ఆయన ప్రకటించారు.
విపత్తుల వేళల్లో శాస్త్రీయ సంబంధి నిర్వహణ పై మరింత అధిక శ్రద్ధ తీసుకొంటూ ఉండడాన్ని మనం కొనసాగించవలసి ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. అరేబియా సముద్రం లో, బంగాళాఖాతం లో చక్రవాతం తాలూకు స్థితిగతులు తరచు గా ఉత్పన్నం అవుతూ వాటి ప్రభావం పెచ్చుపెరుగువుతున్న నేపథ్యం లో నష్టాలను తగ్గించే ప్రయాసల లోను, తత్సంబంధి సన్నాహాల పరంగాను, కమ్యూనికేశన్ సిస్టమ్స్ పరంగాను ఒక పెద్ద మార్పు చోటు చేసుకోవలసిన అవసరం ఉంది అని ఆయన అన్నారు. సహాయక చర్యల లో మెరుగైన సహకారాన్ని అందించే విషయం లో ప్రజల లో విశ్వాసాన్ని కలిగించేందుకు కూడాను పెద్ద పీట వేయవలసి ఉంది అని ఆయన సూచన చేశారు.
ఒడిశా ప్రభుత్వం నడుం కట్టిన సన్నాహక చర్య లు, విపత్తు నిర్వహణ కార్యకలాపాల ఫలితం గా ప్రాణనష్టం కనీస స్థాయి కి పరిమితం అయింది అంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు. ఈ తరహా ప్రాకృతిక సంకటాల ను సంబాళించడం కోసం రాష్ట్రం దీర్ఘకాలిక ఉపశమన ప్రయాసల ను మొదలుపెట్టింది అని కూడా ఆయన అన్నారు.
విపత్తు ప్రభావాన్ని తగ్గించే దిశ లో 30,000 కోట్ల రూపాయల మేరకు నిధుల ను ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక సంఘం సైతం విపత్తు ల ఉపశమనానికి సాగవలసిన కృషి ని మనసు కు హత్తుకొనేటట్టు చెప్పింది అని ఆయన ప్రస్తావించారు.