Quoteప్రధాన మంత్రి పశ్చిమ బెంగాల్ లో 7,800 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువ కలిగినజాతీయ ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం తో పాటుగా ఆ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితంచేస్తారు
Quoteప్రధాన మంత్రి కోల్ కాతా లో జరిగేనేశనల్ గంగా కౌన్సిల్ రెండో సమావేశాని కి అధ్యక్షత వహించనున్నారు
Quoteప్రధాన మంత్రి పశ్చిమ బంగాల్ లో 2,550 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగినటువంటిఅనేక మురికినీటి సంబంధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం తో పాటుగా ఆ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితంచేయనున్నారు
Quoteహావ్ డా నుండి న్యూ జల్ పాయిగుడి ని కలుపుతూ సాగే వందే భారత్ ఎక్స్ ప్రెస్కు ప్రారంభ సూచకం గా ఆకుపచ్చటి జెండా ను చూపెట్టనున్న ప్రధాన మంత్రి
Quoteప్రధాన మంత్రి కోల్ కాతా మెట్రో యొక్కపర్పల్ లైన్ లో భాగం అయినటువంటి జోకా- తారాతలా మార్గాన్ని ప్రారంభించనున్నారు
Quoteప్రధాన మంత్రి అనేక రైల్ వేప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం తో పాటుగా ఆ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితంచేస్తారు; న్యూ జల్ పాయిగుడి రైల్ వే స్టేశన్ పునరభివృద్ధి పనుల కుశంకుస్థాపన
Quoteడాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ - నేశనల్ ఇన్స్ టీట్యూట్ఆఫ్ వాటర్ ఎండ్ సేనీటేశన్ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ న పశ్చిమ బంగాల్ ను సందర్శించనున్నారు. సుమారు 11 గంటల 15 నిమిషాల వేళ లో ప్రధాన మంత్రి హావ్ డా రైల్ వే స్టేశన్ కు చేరుకొని, హావ్ డా నుండి న్యూ జల్ పాయిగుడి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రారంభ సూచకంగా ఆకుపచ్చటి జెండా ను చూపెడతారు. కోల్ కాతా మెట్రో యొక్క పర్పల్ లైన్ లో భాగం గా ఉన్నటువంటి జోకా-తారాతలా మార్గాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. అంతేకాకుండా, వివిధ రైల్ వే ప్రాజెక్టుల కు ఆయన శంకుస్థాపన చేయడం తో పాటు గా ఆ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం కూడా చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వేళ లో ప్రధాన మంత్రి ఐఎన్ఎస్ నేతాజీ సుభాష్ కు చేరుకొని నేతాజీ సుభాష్ విగ్రహాని కి పుష్పాంజలి ని సమర్పిస్తారు. దీనితో పాటు గా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ - నేశనల్ ఇన్స్ టీట్యూట్ ఆఫ్ వాటర్ ఎండ్ సేనీటేశన్ (డిఎస్ పిఎమ్-ఎన్ఐడబ్ల్యుఎఎస్) ను ప్రారంభిస్తారు. స్వచ్ఛ గంగ జాతీయ ఉద్యమం లో భాగం గా పశ్చిమ బంగాల్ కై అనేక మురికినీటి సంబంధి మౌలిక సదుపాయాల పథకాల కు ఆయన శంకుస్థాపన చేయడమే కాకుండా ఆ పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఆయన మధ్యాహ్నం దాదాపు గా 12 గంటల 25 నిమిషాల వేళ లో నేశనల్ గంగ కౌన్సిల్ యొక్క రెండో సమావేశాని కి అధ్యక్షత వహిస్తారు.

ఐఎన్ఎస్ నేతాజీ సుభాష్ లో ప్రధాన మంత్రి

దేశం లో సహకారాత్మక సమాఖ్య వాదాని కి ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి మరొక చర్య లో భాగం గా, ప్రధాన మంత్రి కోల్ కాతా లో 2022 డిసెంబర్ 30 తేదీ నాడు నేశనల్ గంగ కౌన్సిల్ (ఎన్ జిసి) తాలూకు రెండో సమావేశాని కి అధ్యక్షత వహించనున్నారు. జల శక్తి శాఖ కేంద్ర మంత్రి తో పాటు కౌన్సిల్ లో సభ్యులైన ఇతర కేంద్ర మంత్రులు, అలాగే ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఝార్ ఖండ్, ఇంకా పశ్చమ బంగాల్ ల ముఖ్యమంత్రులు ఈ సమావేశం లో పాలుపంచుకోనున్నారు. గంగ నది పునరుద్ధరణ మరియు ఆ నది యొక్క ఉప నదుల లో కాలుష్యం నివారణ ప్రధానమైన పర్యవేక్షణ ల పూర్తి బాధ్యత ను నేశనల్ గంగ కౌన్సిల్ కు అప్పగించడమైంది.

నేశనల్ మిశన్ ఫర్ క్లీన్ గంగ (ఎన్ఎమ్ సిజి) లో భాగం గా 990 కోట్ల రూపాయల కు పై చిలుకు వ్యయం తో అభివృద్ధి పరచిన 7 మురికినీటి సంబంధి మౌలిక సదుపాయాల పథకాల (20 మురికినీటి శుద్ధి ప్లాంటు లు, ఇంకా 612 కి.మీ. నెట్ వర్క్ దీనిలో భాగం గా ఉన్నాయి) ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల తో నబాద్వీప్, కఛార్ పాడా, హలిశర్, బజ్-బజ్, బైరక్ పోర్, చందన్ నగర్, బాంస్ బేరియా, ఉతరాపాడా కాట్ రుంగ్, బైద్యాబాతి, భద్రేశ్వర్, నైహాటీ, గారులియా, తీతాగఢ్ మరియు పానీహాటీ ల పురపాలక సంఘాల కు ప్రయోజనం సిద్ధించనుంది. ఈ ప్రాజెక్టు లు పశ్చిమ బంగాల్ లో మొత్తం 200 ఎమ్ఎల్ డి మురికినీటి శుద్ధి సామర్థ్యాని కి దన్నుగా నిలువనున్నాయి.

నేశనల్ మిశన్ ఫార్ క్లీన్ గంగ లో భాగం గా 1585 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో అభివృద్ధి చేయబోయే 5 మురికినీటి సంబంధి మౌలిక సదుపాయాల పథకాల (వీటిలో 8 మురుగునీటి పారుదల ప్లాంటులు మరియు 80 కిమీ నెట్ వర్క్ కలిసి ఉంటాయి) కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు లు పశ్చిమ బంగాల్ లో 190 ఎమ్ఎల్ డి సామర్థ్యం తో కూడిన నూతన సీవర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ సామర్థ్యాన్ని జత చేయగలవు. ఈ ప్రాజెక్టుల తో ఉత్తర బైరక్ పోర్, హుగలీ-చిన్ సురా, కోల్ కాతా కెఎమ్ సి ఏరియా - గార్డన్ రీచ్, ఇంకా ఆది గంగ (టాలీ నాలా) లకు మరియు మహేస్ తాలా పట్టణానికి ప్రయోజనం చేకూరనుంది.

సుమారు 100 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో జోకా, డాయమండ్ హార్బర్ రోడ్, కోల్ కాతా ప్రాంతం లో అభివృద్ధి పరచినటువంటి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ -నేశనల్ ఇన్స్ టీట్యూట్ ఆఫ్ వాటర్ ఎండ్ సేనీటేశన్ (డిఎస్ పిఎమ్-ఎన్ఐడబ్ల్యుఎఎస్) ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ సంస్థ భారతదేశం లో జలం, పారిశుధ్యం, ఇంకా స్వస్థత (డబ్ల్యుఎఎస్ హెచ్) అంశాల పై పర్యవేక్షణ ను చేపట్టే అత్యున్నత సంస్థ గా సేవల ను అందించనుంది. అంతేకాకుండా, ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ప్రభుత్వాల కు సమాచారం మరియు జ్ఞానం తాలూకు కేంద్ర స్థలం గా కూడా ఉంటుంది.

హావ్ డా రైల్ వే స్టేశన్ లో ప్రధాన మంత్రి

హావ్ డా ను న్యూ జల్ పాయిగుడి తో కలిపే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రధాన మంత్రి హావ్ డా రైల్ వే స్టేశన్ లో ప్రారంభ సూచక ఆకుపచ్చటి జెండా ను చూపెట్టనున్నారు. ఈ అత్యధునాతనమైనటువంటి సెమీ హై స్పీడ్ రైలుబండి లో ప్రయాణికుల కు అత్యాధునిక సదుపాయాల ను సమకూర్చడం జరిగింది. ఈ రైలుబండి రాక, పోక లు జరిపేటప్పడు మార్గమధ్యం లో మాల్ దా టౌన్, బార్ సోయి మరియు కిశన్ గంజ్ స్టేశన్ లలో ఆగుతుంది.

ప్రధాన మంత్రి జోకా-ఎస్ ప్లేనెడ్ మెట్రో ప్రాజెక్టు (పర్పల్ లైన్) లో భాగం గా ఉన్న జోకా-తారాతలా మార్గాన్ని ప్రారంభించనున్నారు. 6.5 కిలో మీటర్ ల మేరకు ఏర్పాటు చేసిన ఈ మార్గం లో మొత్తం ఆరు స్టేశన్ లను 2475 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో నిర్మించడం జరిగింది. ఆ ఆరు స్టేశన్ ల పేరు లు.. జోకా, ఠాకుర్ పుకుర్, సఖర్ బాజార్, బేహలా చౌరస్తా, బేహలా బాజార్ మరియు తారాతలా గా ఉన్నాయి. కోల్ కాతా నగరం లో దక్షిణ దిక్కున ఉన్నటువంటి సర్ సునా, డాక్ ఘర్, ముచీపాడా లతో పాటుగా దక్షిణ 24 పరగణా ల ప్రయాణికుల కు ఈ ప్రాజెక్టు ప్రారంభం అయిన తరువాత చాలా మేలు కలుగనుంది.

ప్రధాన మంత్రి తన కార్యక్రమాల లో భాగం గా నాలుగు రైల్ వే ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. వీటిలో బోన్ చీ-శక్తిగఢ్ మూడో మార్గాన్ని 405 కోట్ల రూపాయల ఖర్చు తో అభివృద్ధి పరచడమైంది; డాన్ కునీ-చందన్ పుర్ నాలుగో లైన్ ప్రాజెక్టు ను 565 కోట్ల రూపాయల ఖర్చు తో అభివృద్ధి పరచడమైంది; నిమితియా- న్యూ ఫరక్కా డబల్ లైన్ ను 254 కోట్ల రూపాయల ఖర్చు తో అభివృద్ధి పరచడమైంది; అలాగే అంబారీ ఫరక్కా-న్యూ మాయానగరీ- గుమానీహాట్ డబ్లింగ్ ప్రాజెక్టు ను 1080 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో అభివృద్ధి పరచడం జరిగింది. 335 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో అభివృద్ధి చేయనున్న న్యూ జల్ పాయిగుడీ రైల్ వే స్టేశన్ పనుల కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

  • Jitender Kumar Haryana BJP State President August 18, 2024

    How is Malda Town my birth place
  • Karan Singh VNS January 01, 2023

    हीरे जैसे महान व्यक्तित्व को जन्म देने वाली माँ हीराबेन के आकस्मिक निधन का समाचार पाकर दु:ख हुआ! माँ हीराबेन को परमपिता परमेश्वर अपने श्रीचरणों में स्थान दे.. 🙏🙏🙏
  • Rakesh Soni January 01, 2023

    कोलकाता में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की 7800 करोड की परियोजनाओं का शिलान्यास किया मोदी है तो मुमकिन है बिना भेदभाव की
  • Jayakumar G January 01, 2023

    Jai Bharat🇮🇳🙏💐 Shreshtha Bharat🇮🇳🙏💐
  • Kuldeep Yadav December 31, 2022

    આદરણીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારા નમસ્કાર મારુ નામ કુલદીપ અરવિંદભાઈ યાદવ છે. મારી ઉંમર ૨૪ વર્ષ ની છે. એક યુવા તરીકે તમને થોડી નાની બાબત વિશે જણાવવા માંગુ છું. ઓબીસી કેટેગરી માંથી આવતા કડીયા કુંભાર જ્ઞાતિના આગેવાન અરવિંદભાઈ બી. યાદવ વિશે. અમારી જ્ઞાતિ પ્યોર બીજેપી છે. છતાં અમારી જ્ઞાતિ ના કાર્યકર્તાને પાર્ટીમાં સ્થાન નથી મળતું. એવા એક કાર્યકર્તા વિશે જણાવું. ગુજરાત રાજ્ય ના અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા શહેર ના દેવળાના ગેઈટે રહેતા અરવિંદભાઈ યાદવ(એ.બી.યાદવ). જન સંઘ વખત ના કાર્યકર્તા છેલ્લાં ૪૦ વર્ષ થી સંગઠનની જવાબદારી સંભાળતા હતા. ગઈ ૩ ટર્મ થી શહેર ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી કરેલી. ૪૦ વર્ષ માં ૧ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કરેલો અને જે કરતા હોય એનો વિરોધ પણ કરેલો. આવા પાયાના કાર્યકર્તાને અહીંના ભ્રષ્ટાચારી નેતાઓ એ ઘરે બેસાડી દીધા છે. કોઈ પણ પાર્ટીના કાર્યકમ હોય કે મિટિંગ એમાં જાણ પણ કરવામાં નથી આવતી. એવા ભ્રષ્ટાચારી નેતા ને શું ખબર હોય કે નરેન્દ્રભાઇ મોદી દિલ્હી સુધી આમ નમ નથી પોચિયા એની પાછળ આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તાઓ નો હાથ છે. આવા પાયાના કાર્યકર્તા જો પાર્ટી માંથી નીકળતા જાશે તો ભવિષ્યમાં કોંગ્રેસ જેવો હાલ ભાજપ નો થાશે જ. કારણ કે જો નીચે થી સાચા પાયા ના કાર્યકર્તા નીકળતા જાશે તો ભવિષ્યમાં ભાજપને મત મળવા બોવ મુશ્કેલ છે. આવા ભ્રષ્ટાચારી નેતાને લીધે પાર્ટીને ભવિષ્યમાં બોવ મોટું નુકશાન વેઠવું પડશે. એટલે પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારી નમ્ર અપીલ છે કે આવા પાયા ના અને બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ મૂકો બાકી ભવિષ્યમાં ભાજપ પાર્ટી નો નાશ થઈ જાશે. એક યુવા તરીકે તમને મારી નમ્ર અપીલ છે. આવા કાર્યકર્તાને દિલ્હી સુધી પોચડો. આવા કાર્યકર્તા કોઈ દિવસ ભ્રષ્ટાચાર નઈ કરે અને લોકો ના કામો કરશે. સાથે અતિયારે અમરેલી જિલ્લામાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહીયો છે. રોડ રસ્તા ના કામો સાવ નબળા થઈ રહિયા છે. પ્રજાના પરસેવાના પૈસા પાણીમાં જાય છે. એટલા માટે આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ લાવો. અમરેલી જિલ્લામાં નમો એપ માં સોવ થી વધારે પોઇન્ટ અરવિંદભાઈ બી. યાદવ(એ. બી.યાદવ) ના છે. ૭૩ હજાર પોઇન્ટ સાથે અમરેલી જિલ્લામાં પ્રથમ છે. એટલા એક્ટિવ હોવા છતાં પાર્ટીના નેતાઓ એ અતિયારે ઝીરો કરી દીધા છે. આવા કાર્યકર્તા ને દિલ્હી સુધી લાવો અને પાર્ટીમાં થતો ભ્રષ્ટાચારને અટકાવો. જો ખાલી ભ્રષ્ટાચાર માટે ૩૦ વર્ષ નું બિન ભ્રષ્ટાચારી રાજકારણ મૂકી દેતા હોય તો જો મોકો મળે તો દેશ માટે શું નો કરી શકે એ વિચારી ને મારી નમ્ર અપીલ છે કે રાજ્ય સભા માં આવા નેતા ને મોકો આપવા વિનંતી છે એક યુવા તરીકે. બાકી થોડા જ વર્ષો માં ભાજપ પાર્ટી નું વર્ચસ્વ ભાજપ ના જ ભ્રષ્ટ નેતા ને લીધે ઓછું થતું જાશે. - અરવિંદ બી. યાદવ (એ.બી યાદવ) પૂર્વ શહેર ભાજપ મહામંત્રી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આપનો યુવા મિત્ર લી. કુલદીપ અરવિંદભાઈ યાદવ
  • Jayakumar G December 30, 2022

    “The Government launched the PM Gati Shakti Plan to fill the gaps in the coordination of agencies”, Shri Modi remarked, “Be it different state governments, construction agencies or industry experts, everyone is coming together on the Gati Shakti Platform.” 
  • Shri Vivek Bhadrakia December 30, 2022

    वर्ल्ड को एक हीरा देने बाली मां हीराबेन बा के देवलोक गमन पर भक्तिपूर्ण श्रद्धांजलि अर्पित करता हूं । तपस्वी माताजी को कोटि कोटि नमन करता हूं । प्रभु जगन्नाथ उसकी आत्मा को शांत करें इतना प्रार्थना हे । धन्य धन्य हीराबेन की हीरा बेटा मोदी जी ,आपको प्रभु शक्ति दें सहन की लिए। ॐ शांति
  • Alpana Sinha December 30, 2022

    🕉️ शांति 🙏🏼🙏🏼
  • kheemanand pandey December 30, 2022

    अडिग कर्तव्य पथ नमन् मातृदेवो भव: प्रधान सेवक का पुरुषार्थी आचरण व कर्तव्य मार्ग की दृढ़ता देशवासियों को गौरवान्वित करतीं है🙏✔
  • Kalyani Roy December 30, 2022

    🙏🙏🙏
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Raj Kapoor’s Iconic Lantern Donated To PM Museum In Tribute To Cinematic Icon

Media Coverage

Raj Kapoor’s Iconic Lantern Donated To PM Museum In Tribute To Cinematic Icon
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi greets everyone on occasion of National Science Day
February 28, 2025

The Prime Minister Shri Narendra Modi greeted everyone today on the occasion of National Science Day. He wrote in a post on X:

“Greetings on National Science Day to those passionate about science, particularly our young innovators. Let’s keep popularising science and innovation and leveraging science to build a Viksit Bharat.

During this month’s #MannKiBaat, had talked about ‘One Day as a Scientist’…where the youth take part in some or the other scientific activity.”