ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 19 ఫిబ్రవరి, 2024న ఉత్తరప్రదేశ్‌ను సందర్శిస్తారు.
ఉదయం 10:30 గంటలకు, సంభాల్ జిల్లాలో శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ కల్కీ ధామ్ టెంపుల్ నమూనాను కూడా ఆవిష్కరిస్తారు. సభలో ప్రసంగిస్తారు. శ్రీ కల్కి ధామ్‌ను శ్రీ కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్ట్ నిర్మిస్తోంది, దీని ఛైర్మన్ ఆచార్య ప్రమోద్ కృష్ణం. ఈ కార్యక్రమానికి పలువురు సాధువులు, మత పెద్దలు, ఇతర ప్రముఖులు హాజరవుతారు.
మధ్యాహ్నం 1:45 గంటలకు, ఉత్తరప్రదేశ్ అంతటా రూ. 10 లక్షల కోట్ల పైగా విలువైన 14000 ప్రాజెక్ట్‌లను ప్రధాని ప్రారంభిస్తారు, యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 (యూపీజిఐఎస్ 2023) ఫిబ్రవరి 2023లో నాల్గవ భూమి పూజ కార్యక్రమంలో ఒప్పందాలు కుదిరిన ప్రోజెక్టులివి . ఈ ప్రాజెక్ట్‌లు తయారీ, పునరుత్పాదక శక్తి,ఐటీ, ఐటీఈసి, ఫుడ్ ప్రాసెసింగ్, హౌసింగ్ & రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, ఎంటర్‌టైన్‌మెంట్, విద్య వంటి రంగాలకు సంబంధించినవి. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అగ్రశ్రేణి గ్లోబల్, భారతీయ కంపెనీల ప్రతినిధులు, రాయబారులు, హైకమిషనర్లు మరియు ఇతర విశిష్ట అతిథులతో సహా సుమారు 5000 మంది భాగస్వాములు పాల్గొంటారు.