పిఎమ్ ఆయుష్మాన్భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ యావత్తుత భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ రంగమౌలిక సదుపాయాలను పటిష్టపరచడానికి సంబంధించిన దేశం లోని అన్నిటికంటే పెద్ద పథకాలలో ఒకటి కానుంది
పట్టణప్రాంతాల లోను, గ్రామీణ ప్రాంతాల లోను సార్వజనికఆరోగ్య మౌలిక సదుపాయాల లో ప్రస్తుతం ఉన్నటువంటి మహత్వపూర్ణమైన అంతరాల ను పూరించడంపిఎమ్ఎఎస్ బివై లక్ష్యం
ఐదులక్షల కు పైబడ్డ జనాభా గల అన్ని జిల్లాల లో క్రిటికల్ కేర్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి
అన్ని జిల్లాల లో ఏకీకృత‌ సార్వజనిక ఆరోగ్య ప్రయోగశాలల ను ఏర్పాటు చేయడం జరుగుతుంది
నేశనల్ఇన్స్ టిట్యూశన్ ఆఫ్ వన్ హెల్థ్, కొత్త గా 4 నేశనల్ ఇన్స్ టిట్యూట్స్ ఫార్ వైరాలజీని ఏర్పాటు చేయడం జరుగుతుంది
ఐటిఅండదండల తో రోగ పర్యవేక్షణ వ్యవస్థనుఅభివృద్ధిపరచడం జరుగుతుంది
ప్రధానమంత్రి ఉత్తర్ ప్రదేశ్ లో తొమ్మిది వైద్య కళాశాలల ను కూడా ప్రారంభించనున్నారు
వారాణసీకోసం 5,200 కోట్ల రూపాయల కు పైగా విలువైన అభివృద్ధి పథకాల ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 25న ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. సిద్ధార్థ్ నగర్‌ లో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రధాన మంత్రి ఉత్తర్ ప్రదేశ్‌ లో తొమ్మిది వైద్య కళాశాలల ను ప్రారంభిస్తారు. ఆ తరువాత, మధ్యాహ్నం సుమారు ఒంటి గంటా పదిహేను నిమిషాల వేళకు వారాణసీ లో ‘పిఎమ్ ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆయన వారాణసీ కోసం 5,200 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పథకాల ను కూడా ప్రారంభించనున్నారు.

పిఎమ్ ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్ర్ మిశన్ (లేదా ‘ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన’.. పిఎమ్ ఎఎస్ బివై) అనేది యావత్తు భారతదేశం లో ఆరోగ్యసంరక్షణ రంగ మౌలిక సదుపాయాలను పటిష్టపరచడానికి సంబంధించినటువంటి దేశం లోని అన్నింటికంటే పెద్ద పథకాల లో ఒకటి ఒకటి కానుంది. ఈ పథకం నేశనల్ హెల్థ్ మిశన్ కు అదనం గా ఉంటుంది.

పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యం గా క్రిటికల్ కేర్ సౌకర్యాల కల్పనతో పాటు ప్రాథమిక సంరక్షణ సంబంధి సార్వజనిక ఆరోగ్య మౌలిక సదుపాయాల లో ఇప్పుడు ఉన్న లోటుపాటులను దూరం చేయడం పిఎమ్ ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్ర్ మిశన్ ఉద్యేశ్యం గా ఉంది. ఈ పథకం ప్రత్యేకించి ఈ పథకం పది అధిక శ్రద్ధ అవసరపడే రాష్ట్రాల లో గ్రామీణ ప్రాంతాల లో 17,788 హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్ లకు సమర్థన ను అందిస్తుంది. దీనికి తోడు, అన్ని రాష్ట్రాల లో ను పట్టణ ప్రాంతాల లో 11,024 హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్ లను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

అయిదు లక్షల కంటే పైబడ్డ జనాభా ను కలిగివున్న దేశం లోని అన్ని జిల్లాల లో ఎక్స్ క్లూసివ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్ మాధ్యమం ద్వారా క్రిటికల్ కేర్ సర్వీసు లు అందుబాటు లోకి వస్తాయి. , మిగిలిన జిల్లాల ను రెఫరల్ సర్వీసు ల మాధ్యమం ద్వారా కవర్ చేయడం జరుగుతుంది.

దేశం అంతటా ప్రయోగశాల ల నెట్ వర్క్ మాధ్యమం ద్వారా ప్రజల కు సార్వజనిక స్వాస్థ్య సంరక్షణ ప్రణాళిక లో భాగం గా రోగ నిర్ధారణ సేవల తాలూకు ఒక పూర్తి స్థాయి సౌకర్యం అందుబాటు లోకి వస్తుంది. అన్ని జిల్లాల లో ఏకీకృత‌ సార్వజనిక స్వాస్థ్య ప్రయోగశాలల ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

పిఎమ్ ఎఎస్ బివై లో భాగం గా, నేశనల్ ఇన్స్ టిట్యూశన్ ఆఫ్ వన్ హెల్థ్, 4 కొత్త నేశనల్ ఇన్స్ టిట్యూశన్స్ ఆఫ్ వైరాలజీ, డబ్ల్యుహెచ్ ఒ ఆగ్నేయ ఆసియా ప్రాంతం కోసం ఒక ప్రాంతీయ పరిశోధన వేదిక, తొమ్మిది బాయోసేఫ్ టీ లెవెల్ త్రీ ప్రయోగశాల లతో పాటు కొత్త గా 5 రీజనల్ నేశనల్ సెంటర్ ఫార్ డిజీజ్ కంట్రోల్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.

మహానగర ప్రాంతాల లో బ్లాకు, జిల్లా, ప్రాంతీయ, జాతీయ స్థాయిల లో నిఘా ప్రయోగశాలల తో కూడిన ఒక నెట్ వర్క్ ను అభివృద్ధి పరచడం ద్వారా ఐటి ఆధారితమైన రోగ పర్యవేక్షణ ప్రణాళిక ను రూపొందించాలనేది పిఎమ్ఎఎస్ బివై లక్ష్యం గా ఉంది. అన్ని సార్వజనిక స్వాస్థ్య ప్రయోగశాలల ను కలపడం కోసం ఏకీకృత‌ స్వాస్థ్య సమాచార పోర్టల్ సేవల ను అన్ని రాష్ట్రాల కు, కేంద్ర పాలిత ప్రాంతాల కు విస్తరించడం జరుగుతుంది.

సార్వజనిక స్వాస్థ్య అత్యవసర స్థితుల ను, రోగాల ప్రాబల్య స్థితులను ప్రభావశీల రీతి లో కనుగొనడానికి, దర్యాప్తు జరపడానికి, నిరోధించడానికి ఎదుర్కోవడాడానికి వీలు గా 17 కొత్త సార్వజనిక స్వాస్థ్య విభాగాల ను నిర్వహించడం, ప్రవేశ బిందువు (ఎంట్రీ పాయింట్)ల వద్ద ఇప్పుడు ఉన్న 33 సార్వజనిక స్వాస్థ్య విభాగాల ను బలోపేతం చేయడం పిఎమ్ ఎఎస్ బివై ఉద్యేశ్యాల లో భాగం గా ఉన్నాయి. ఇది ఎటువంటి సార్వజనిక స్వాస్థ్య అత్యవసర స్థితి ని సంబాళించడం కోసం అవసరమైన ముందు వరుస లో నిలచేందుకు శిక్షణ పొందినటువంటి ఆరోగ్య శ్రమికులను తయారు చేసే దిశ లో కూడా కృషి చేస్తుంది. ప్రారంభించబోయే తొమ్మిది వైద్య కళాశాల లు సిద్ధార్థ్ నగర్, ఎటా, హర్ దోయి, ప్రతాప్‌ గఢ్, ఫతేహ్ పుర్, దేవరియా, గాజీపుర్, మీర్జాపుర్, జౌన్‌ పుర్ జిల్లాల లో ఉన్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకం లో భాగం గా "జిల్లా / రెఫరల్ ఆసుపత్రుల తో జతపరచిన కొత్త వైద్య కళాశాల ల స్థాపన" కోసం 8 మెడికల్ కాలేజీల ను మంజూరు చేయడమైంది. మరి జౌన్ పుర్‌ లో ఒక వైద్య కళాశాల ను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరుల మాధ్యమం ద్వారా స్థాపించింది. దీని నిర్వహణ ఈసరికే ఆరంభం అయింది.

వెనుకబడినటువంటి జిల్లాలకు, సరైన సేవ లు అందుబాటు లో లేనటువంటి జిల్లాల కు, ఆకాంక్షభరిత జిల్లాల కు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం లో ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్య రంగ శ్రమికుల అందుబాటు ను పెంచడం, మెడికల్ కాలేజీ ల ఏర్పాటు లో ప్రస్తుత భౌగోళిక అసమతుల్యత ను సరి చేయడంతో పాటు జిల్లా ఆసుపత్రుల లోని ఇప్పటి మౌలిక సదుపాయాల ను ప్రభావవంతమైన రీతి న వినియోగించడం కూడా ఈ పథకం ఉద్యేశ్యాల లో భాగం గా ఉంది ఈ పథకం తాలూకు మూడు దశల లో భాగం గా దేశం అంతటా 157 కొత్త వైద్య కళాశాలల ను మంజూరు చేయడమైంది. వీటిలో 63 వైద్య కళాశాలల ను ఇప్పటికే నిర్వహించడం జరుగుతున్నది.

ఈ కార్యక్రమం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ మరియు ముఖ్యమంత్రి, ఇంకా ఆరోగ్య శాఖ కేంద్ర మంత్రి కూడా పాల్గొంటారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'

Media Coverage

'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16ఫెబ్రవరి 2025
February 16, 2025

Appreciation for PM Modi’s Steps for Transformative Governance and Administrative Simplification