ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో జూన్ 3వ తేదీ నాడు ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. సుమారు ఉదయం 11 గంటల వేళ కు ప్రధాన మంత్రి లఖ్ నవూ లోని ఇందిరా గాంధీ ప్రతిష్టాన్ కు చేరుకొని, అక్కడ ‘యుపి ఇన్ వెస్టర్స్ సమిట్’ లో భాగం గా జరిగే భూమి పూజ కార్యక్రమం లో పాలుపంచుకొంటారు. మధ్యాహ్నం 1:45 నిమిషాల కు ప్రధాన మంత్రి కాన్ పుర్ లోని పరౌంఖ్ గ్రామాని కి వెళ్తారు. అక్కడ మాన్య రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ తో భేటీ అవుతారు. ఇరువురు పత్రి మాత మందిరాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత ఇంచుమించు మధ్యాహ్నం 2 గంటల వేళ కు వారు ఉభయులు డాక్టర్ బి.ఆర్. ఆంబేడ్ కర్ భవన్ కు చేరుకొంటారు. మధ్యాహ్నం 2:15 నిమిషాల కు మిలన్ కేంద్ర కార్యక్రమం ఉంటుంది. ఈ కేంద్రం మాన్య రాష్ట్రపతి పూర్వికుల ఇల్లు. దీని ని ప్రజల ఉపయోగార్థం విరాళం గా ఇవ్వడమైంది. ఒక సాముదాయిక కేంద్రం (మిలన్ కేంద్ర) గా దీనిని తీర్చిదిద్దడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2గంటల 30నిమిషాలకు వారు పరౌంఖ్ గ్రామం లో జరిగే ఒక జన సభ కు హాజరు అవుతారు.
భూమి పూజ కార్యక్రమం లో భాగం గా, 80,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన 1406 ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు లు.. వ్యవసాయం మరియు వ్యవసాయ సంబంధి రంగాలు, ఐటి మరియు ఎలక్ట్రానిక్స్, ఎమ్ఎస్ఎమ్ఇ, తయారీ, నవీకరణ యోగ్య శక్తి, ఫార్మా, పర్యటన, రక్షణ & ఏరోస్పేస్, చేనేత, ఇంకా వస్త్రాలు మొదలైన వేరు వేరు రంగాల కు సంబంధించినవి. ఈ కార్యక్రమాని కి దేశ పారిశ్రామిక రంగం లోని అగ్రగాములు హాజరు అవుతారు.
యుపి ఇన్ వెస్టర్స్ సమిట్ 2018 ని 2018వ సంవత్సరం లో ఫిబ్రవరి 21వ, 22వ తేదీ లలో నిర్వహించారు. కాగా, ఒకటో భూమి పూజ కార్యక్రమాన్ని 2018 జూలై 29 న, మరి అదే విధం గా రెండో భూమి పూజ కార్యక్రమాన్ని 2019వ సంవత్సరం లో జులై 29వ తేదీన జరపడమైంది. ఒకటో భూమి పూజ కార్యక్రమం లో భాగంగా 61,500 కోట్ల రూపాయల కు పైగా విలువైన 81 ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం జరిగింది. కాగా, రెండో భూమి పూజ కార్యక్రమం లో 67,000 కోట్ల రూపాయల కు పైగా పెట్టుబడుల తో కూడినటువంటి 290 ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడమైంది.