ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబర్ 16న ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. సుమారు గా మధ్యాహ్నం ఒంటి గంటన్నర వేళ కు సుల్తాన్ పుర్ జిల్లా లోని కర్ వల్ ఖీరీ లో పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్- వే ను ఆయన ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమం ముగిసిన ప్రారంభం అనంతరం, ప్రధాన మంత్రి సుల్తాన్ పుర్ జిల్లా లో ఎక్స్ ప్రెస్- వే లో భాగం గా నిర్మాణం జరిగినటువంటి 3.2 కిలో మీటర్ ల పొడవైన ఎయర్ స్ట్రిప్ లో భారతీయ వాయు సేన నిర్వహించే ఎయర్ షో ను కూడా వీక్షించనున్నారు. అత్యవసర స్థితి లో భారతీయ వాయు సేన యొక్క యుద్ధ విమానాలు నింగి కి ఎగరడం కోసం/నేల మీదకు దిగడం కోసం ఎయర్ స్ట్రిప్ ను ఏర్పాటు చేయడమైంది.
పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్- వే పొడవు 341 కిలో మీటర్ లుగా ఉంది. ఇది లఖ్ నవూ-సుల్తాన్ పుర్ రోడ్డు (ఎన్ హెచ్-731) లో గల చౌడాసరాయ్ గ్రామం నుంచి మొదలవుతుంది. ఇది యుపి-బిహార్ సరిహద్దు నుంచి 18 కి.మీ. ల తూర్పు దిక్కు న నంబరు 31 జాతీయ రహదారి ని ఆనుకొని ఉన్నటువంటి హైదరియా గ్రామం లో సమాప్తం అవుతుంది. ఈ ఎక్స్ ప్రెస్- వే లో 6-దోవ లు ఉన్నాయి; దీనిని రాబోయే కాలం లో 8-దోవల వరకు పొడిగించేందుకు వీలు ఉంది. దాదాపు గా 22,500 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో నిర్మించిన ఈ పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్- వే వల్ల ఉత్తర్ ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతం, ప్రత్యేకించి లఖ్ నవూ, బారాబంకీ, అమేఠీ, అయోధ్య, సుల్తాన్ పుర్, ఆమ్బేడ్ కర్ నగర్, ఆజంగఢ్, మవూ, ఇంకా గాజీపుర్ జిల్లా ల ఆర్థికాభివృద్ధి కి ప్రోత్సాహం లభించనుంది.