తెలంగాణలోని ఆదిలాబాద్ లో రూ.56,000 కోట్ల రూపాయలు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, అంకితం, శంకుస్థాపన చేయనున్న ప్రధాని
ఆదిలాబాద్ లో చేపడుతున్న అనేక ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ రంగానికి బ్రహ్మాండమైన ప్రోత్సాహం
సంగారెడ్డిలో రూ.6,800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్న ప్రధాని
సంగారెడ్డిలో చేపట్టిన ప్రాజెక్టుల్లో రోడ్డు, రైలు, పెట్రోలియం, సహజవాయువు వంటి పలు కీలక రంగాలు ఉన్నాయి.
హైదరాబాద్ లో పౌర విమానయాన పరిశోధన సంస్థ (సి ఎ ఆర్ ఒ )ను ప్రారంభించనున్న ప్రధాని
తమిళనాడు లోని కల్పక్కంలో భారతదేశ స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కోర్ లోడింగ్ ప్రారంభాన్ని వీక్షించనున్న ప్రధాన మంత్రి
భారత అణువిద్యుత్ కార్యక్రమంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయి.
ఒడిశాలోని చండిఖోల్ లో రూ.19,600 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, , శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్ననున్న ప్రధాన మంత్రి
కోల్ కతాలో రూ.15,400 కోట్ల విలువైన బహుళ కనెక్టివిటీ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
బెటియాలో సుమారు రూ.8,700 కోట్ల విలువైన వివిధ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన, అంకితం, ప్రారంభోత్సవం చేయనున్న ప్రధాని
ముజఫర్ పూర్ - మోతీహరి ఎల్ పిజి పైప్ లైన్ కు ప్రారంభోత్సవం; మోతీహరి వద్ద ఇండియన్ ఆయిల్ ఎల్ పిజి బాట్లింగ్ ప్లాంట్ స్టోరేజ్ టెర్మినల్ ను జాతికి అంకితం చేయనున్న ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి 4-6 తేదీల్లో తెలంగాణ, తమిళ నాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ , బిహార్ రాష్ట్రాలను సందర్శిస్తారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి 4-6 తేదీల్లో తెలంగాణ, తమిళ నాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ , బిహార్ రాష్ట్రాలను సందర్శిస్తారు.

మార్చి 4న ఉదయం 10.30 గంటలకు తెలంగాణలోని ఆదిలాబాద్ లో రూ.56,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు తమిళనాడు కల్పక్కంలోని భవిని ని సందర్శిస్తారు.

మార్చి 5న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లో పౌరవిమానయాన పరిశోధన సంస్థ (కారో) కేంద్రాన్ని ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఉదయం 11 గంటలకు సంగారెడ్డిలో రూ.6,800 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఒడిశా జాజ్ పూర్ లోని చండిఖోలేలో రూ.19,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేస్తారు.

మార్చి 6న ఉదయం 10:15 గంటలకు ప్రధాన మంత్రి కోల్ కత్తాలో రూ.15,400 కోట్ల విలువైన పలు కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు, శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు బీహార్ లోని బేతియాలో సుమారు రూ.8,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు, అంకితం చేస్తారు, శంకుస్థాపన చేస్తారు.

ఆదిలాబాద్ లో ప్రధాని

తెలంగాణలోని ఆదిలాబాద్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని రూ.56,000 కోట్లకు పైగా విలువైన విద్యుత్, రైలు, రోడ్డు రంగాలకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేసి శంకుస్థాపన చేస్తారు.. ప్రాజెక్టుల్లో ప్రధానంగా విద్యుత్ రంగం ప్రాధాన్యం కలిగినవి ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా విద్యుత్ రంగానికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి, జాతికి అంకితం చేయడంతో పాటు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణలోని పెద్దపల్లిలో ఎన్ టి పి సి కి చెందిన 800 మెగావాట్ల (యూనిట్-2) తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేస్తారు. అల్ట్రా-సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఆధారంగా, ఈ ప్రాజెక్టు తెలంగాణకు 85% విద్యుత్తును సరఫరా చేస్తుంది. భారతదేశంలోని అన్నిఎన్ టి పి సి విద్యుత్ కేంద్రాలలో సుమారు 42% అత్యధిక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గతం లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేశారు.

జార్ఖండ్ లోని ఛత్రాలో ఉన్న నార్త్ కరణ్ పురా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో 660 మెగావాట్ల (యూనిట్ -2)ను కూడా ప్రధాని ఈ సందర్భంగా అంకితం చేస్తారు. సంప్రదాయ వాటర్ కూల్డ్ కండెన్సర్లతో పోలిస్తే నీటి వినియోగాన్ని 1/3వ వంతుకు తగ్గించే ఎయిర్ కూల్డ్ కండెన్సర్ (ఏసీసీ)తో రూపొందించిన దేశంలోనే తొలి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు పనులను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.

చత్తీస్ ఘడ్ బిలాస్ పూర్ లోని సిపట్ లో ఫ్లై యాష్ ఆధారిత లైట్ వెయిట్ అగ్రిగేట్ ప్లాంట్ ను, ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఎస్టీపీ వాటర్ టు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను కూడా ప్రధాన మంత్రి ఆదిలాబాద్ సభా వేదిక నుంచి అంకితం చేస్తారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని సోన్ భద్రలో సింగ్రౌలి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజ్-3 (2×800 మెగావాట్ల)కు, చత్తీస్ గఢ్ రాయ్ గఢ్ లోని లారాలో ఉన్న 4జీ ఇథనాల్ ప్లాంట్ కు ఫ్లూ గ్యాస్ సీఓ2 టు 4జి ఇథనాల్ ప్లాంట్ ;?ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని సింహాద్రి వద్ద సీ వాటర్ టు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్; ఛత్తీస్ గఢ్ కోర్బా వద్ద ఫ్లై యాష్ ఆధారిత ఎఫ్ ఎ ఎల్ జి అగ్రిగేట్ ప్లాంట్ లకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

ఏడు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. నేషనల్ గ్రిడ్ ను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషించనున్నాయి.

ప్రధాన మంత్రి రాజస్థాన్ లోని జైసల్మేర్ లో జాతీయ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్ హెచ్ పీసీ) 380 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 792 మిలియన్ యూనిట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి అవుతుంది.

ప్రధాన మంత్రి ఉత్తర ప్రదేశ్ లోని జలౌన్ లో బుందేల్ ఖండ్ సౌర్ ఉర్జా లిమిటెడ్ (బీఎస్ యూఎల్ ) 1200 మెగావాట్ల జలౌన్ అల్ట్రా మెగా రెన్యువబుల్ ఎనర్జీ పవర్ పార్క్ కు శంకుస్థాపన చేస్తారు. ఈ పార్కు ద్వారా ఏటా 2400 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని జలౌన్, కాన్పూర్ దేహత్ లలో సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ (ఎస్ జెవిఎన్) కు చెందిన మూడు సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల మొత్తం సామర్థ్యం 200 మెగావాట్లు. ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా లోగడ శ్రీ మోదీ చేశారు. ప్రధాన మంత్రి ఉత్తరా ఖండ్ లోని bఉత్తర కాశీ లో నైత్వార్ మోరి హైడ్రో పవర్ స్టేషన్ తో పాటు అనుబంధ ట్రాన్స్ మిషన్ లైన్ ను ప్రారంభిస్తారు. భిలాస్ పూర్, హిమాచల్ ప్రదేశ్, దుబ్రి, అస్సాం లలో రెండు ఎస్ జె వి ఎన్ సోలార్ ప్రాజెక్టులకు, అలాగే హిమాచల్ ప్రదేశ్ లో 382 మెగావాట్ల సున్నీ డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కు శంకుస్థాపన చేస్తారు.

యుపిలోని లలిత్ పూర్ జిల్లాలో 600 మెగావాట్ల టుస్కో కు చెందిన 600 మెగావాట్ల లలిత్ పూర్ సోలార్ పవర్ ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇందులో ఏడాదికి 1200 మిలియన్ యూనిట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పునరుత్పాదక ఇంధనం నుంచి 2500 మెగావాట్ల విద్యుత్ ను తరలించడానికి ఉద్దేశించిన రెన్యుస్ కొప్పల్-నరేంద్ర ట్రాన్స్ మిషన్ పథకాన్ని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఈ అంతర్రాష్ట్ర ప్రసార పథకం కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఉంది. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, ఇండిగ్రిడ్ కు చెందిన ఇతర విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.

ప్రధాన మంత్రి ఈ పర్యటనలో విద్యుత్ రంగంతో పాటు రోడ్డు, రైలు రంగానికి చెందిన ప్రాజెక్టులను కూడా చేపట్టనున్నారు. నూతనంగా విద్యుదీకరించిన అంబారి - ఆదిలాబాద్ - పింపల్ ఖుతి రైలు మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఎన్ హెచ్ -353బి, ఎన్ హెచ్ -163 ద్వారా తెలంగాణను మహారాష్ట్రతో, తెలంగాణను ఛత్తీస్ గఢ్ తో కలిపే రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

సంగారెడ్డిలో ప్రధాని

రూ.6,800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రోడ్డు, రైలు, పెట్రోలియం, సహజవాయువు వంటి పలు కీలక రంగాలను ఈ ప్రాజెక్టులు కవర్ చేస్తాయి.

ప్రధాన మంత్రి మూడు జాతీయ రహదారుల పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానమంత్రి ప్రారంభించనున్న జాతీయ రహదారి ప్రాజెక్టులలో ఎన్ హెచ్ -161 లోని 40 కిలోమీటర్ల పొడవైన కంది - రాంసాన్ పల్లి సెక్షన్ వరకు నాలుగు లేన్ల రహదారి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇండోర్ - హైదరాబాద్ ఎకనామిక్ కారిడార్ లో భాగమైన ఈ ప్రాజెక్టు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ల మధ్య ప్రయాణీకుల , సరుకు రవాణాను సులభతరం చేస్తుంది. ఈ సెక్షన్ వల్ల హైదరాబాద్-నాందేడ్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా మూడు గంటలు తగ్గుతుంది. అలాగే 47 కిలోమీటర్ల పొడవైన మిర్యాలగూడ -,కోదాడ సెక్షన్ వరకు ఎన్ హెచ్ -167ను రెండు లేన్లుగా అప్ గ్రేడ్ చేసే ప్రాజెక్టును కూడా ప్రధాని ప్రారంభిస్తారు. మెరుగైన కనెక్టివిటీ ఈ ప్రాంతంలో పర్యాటకంతో పాటు ఆర్థిక కార్యకలాపాలవృద్ధికి, , పరిశ్రమల విస్తరణకు దోహదపడుతుంది.

ఎన్ హెచ్ -65లోని 29 కిలోమీటర్ల పొడవైన పుణె-హైదరాబాద్ సెక్షన్ ను ఆరు లేన్లుగా మార్చేందుకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. పటాన్ చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక ప్రాంతం వంటి తెలంగాణలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలకు కూడా ఈ ప్రాజెక్టు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది.

ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి సనత్ నగర్ - మౌలాలీ రైలు మార్గాన్ని, ఆరు కొత్త స్టేషన్ భవనాల తో పాటు డబ్లింగ్ , విద్యుదీకరణను ప్రారంభిస్తారు. ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్) ఫేజ్ -2 ప్రాజెక్టులో భాగంగా మొత్తం 22 రూట్ కిలోమీటర్లను ఆటోమేటిక్ సిగ్నలింగ్ తో ప్రారంభించారు. ఇందులో భాగంగా ఫిరోజ్ గూడ, సుచిత్ర సెంటర్, భూదేవినగర్, అమ్మగూడ, నేరేడ్ మెట్, మౌలాలీ హౌసింగ్ బోర్డు స్టేషన్లలో ఆరు కొత్త స్టేషన్ భవనాలు వచ్చాయి. డబ్లింగ్, విద్యుదీకరణ పనులు ఈ విభాగంలో తొలిసారిగా ప్యాసింజర్ రైళ్ల ప్రవేశానికి మార్గం సుగమం చేశాయి. ఇది ఇతర అధిక సంతృప్త విభాగాలపై భారాన్ని తగ్గించడం ద్వారా ఈ ప్రాంతంలో రైళ్ల సమయపాలన , మొత్తం వేగాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఘట్ కేసర్ - లింగంపల్లి నుంచి మౌలాలీ - సనత్ నగర్ ప్రారంభ ఎంఎంటీఎస్ రైలు సర్వీసును ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగర ప్రాంతాలలో సబర్బన్ రైలు సేవను మొదటిసారిగా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఇది నగరం తూర్పు భాగంలోని చర్లపల్లి, మౌలాలీ వంటి కొత్త ప్రాంతాలను జంటనగర ప్రాంతం పశ్చిమ భాగంతో కలుపుతుంది. జంటనగరాల ప్రాంతంలోని తూర్పు భాగాన్ని పశ్చిమ భాగాన్ని కలిపే సురక్షితమైన, వేగవంతమైన, ఆర్థిక రవాణా విధానం ప్రయాణీకులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

అంతేకాక ఇండియన్ ఆయిల్ పారాదీప్-హైదరాబాద్ ప్రొడక్ట్ పైప్ లైన్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. 4.5 ఎంఎంటీపీఏ సామర్థ్యం కలిగిన 1212 కిలోమీటర్ల ఉత్పత్తి పైపులైన్ ఒడిశా (329 కి.మీ), ఆంధ్రప్రదేశ్ (723 కి.మీ), తెలంగాణ (160 కి.మీ) రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. పారాదీప్ రిఫైనరీ నుంచి విశాఖపట్నం, అచ్యుతాపురం, విజయవాడ (ఆంధ్రప్రదేశ్ లోని), హైదరాబాద్ (తెలంగాణలో) సమీపంలోని మల్కాపూర్ లోని డెలివరీ స్టేషన్లకు పెట్రోలియం ఉత్పత్తులను సురక్షితంగా, చౌకగా రవాణా చేయడానికి పైప్ లైన్ దోహదపడుతుంది.

హైదరాబాద్ లో ప్రధాని

హైదరాబాద్ లో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ( సి ఎ ఆర్ ఒ ) కేంద్రాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. పౌర విమానయాన రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కార్యకలాపాలను అప్ గ్రేడ్ చేయడానికి, పెంచడానికి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో దీనిని ఏర్పాటు చేసింది.

ఇది స్వదేశీ, సృజనాత్మక పరిష్కారాలను అందించడానికి అంతర్గత, భాగస్వామ్య పరిశోధనల ద్వారా విమానయాన సమాజానికి ప్రపంచ పరిశోధన వేదికను అందించాలని భావిస్తోంది. రూ.350 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక భవనం 5-స్టార్-జీఆర్ఐహెచ్ఏ రేటింగ్, ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) నిబంధనలకు అనుగుణంగా ఉంది.

భవిష్యత్ పరిశోధన , అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి కారో సమగ్ర ప్రయోగశాల సామర్థ్యాల సమూహాన్ని ఉపయోగిస్తుంది. ఆపరేషనల్ అనాలిసిస్, పెర్ఫార్మెన్స్ మెజర్మెంట్ కోసం డేటా అనలిటిక్స్ సామర్థ్యాలను కూడా ఇది ఉపయోగించుకుంటుంది. గగనతలం, విమానాశ్రయ సంబంధిత భద్రత, సామర్థ్యం , సామర్థ్య మెరుగుదల కార్యక్రమాలు, ప్రధాన గగనతల సవాళ్లను పరిష్కరించడం, ప్రధాన విమానాశ్రయ మౌలిక సదుపాయాల సవాళ్లను చూడటం, భవిష్యత్తు గగనతలం , విమానాశ్రయ అవసరాల కోసం గుర్తించిన రంగాలలో సాంకేతికతలు, ఉత్పత్తులను అభివృద్ధి చేయడం మొదలైనవి కారో ప్రాధమిక పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలలో ఉన్నాయి. :

కల్పక్కంలో ప్రధాని

భారత దేశ అణువిద్యుత్ కార్యక్రమంలో ఒక మైలురాయిగా నిలిచిపోయేలా ప్రధాన మంత్రి, తమిళనాడులోని కల్పక్కంలో 500 మెగావాట్ల సామర్థ్యం గల భారత దేశ స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పి ఎఫ్ బి ఆర్ ) లోడింగ్ ను ప్రారంభించనున్నారు. ఈ పి ఎఫ్ బి ఆర్ ను భవిని (భారతీయ నభికియా విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ) అభివృద్ధి చేసింది.రియాక్టర్ కోర్ లో కంట్రోల్ సబ్ అసెంబ్లింగ్ లు, బ్లాంకెట్ సబ్ అసెంబ్లింగ్ లు, ఫ్యూయల్ సబ్ అసెంబ్లింగ్ లు ఉంటాయి. కోర్ లోడింగ్ యాక్టివిటీలో రియాక్టర్ కంట్రోల్ సబ్ అసెంబ్లింగ్ ల లోడింగ్ ఉంటుంది, తరువాత బ్లాంకెట్ సబ్ అసెంబ్లింగ్ లు, ఫ్యూయల్ సబ్ అసెంబ్లింగ్ లు పవర్ ని ఉత్పత్తి చేస్తాయి.

క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్ తో మూడు దశల అణు విద్యుత్ కార్యక్రమాన్ని భారత్ చేపట్టింది. న్యూక్లియర్ ప్రోగ్రామ్ రెండవ దశను సూచించే పి ఎఫ్ బి ఆర్ లో మొదటి దశ నుండి ఖర్చు చేసిన ఇంధనాన్ని తిరిగి ప్రాసెస్ చేస్తారు. .ఎఫ్ బి ఆర్ లో ఇంధనంగా ఉపయోగిస్తారు. ఈ సోడియం కూల్డ్ పి ఎఫ్ బి ఆర్ ప్రత్యేక లక్షణం ఏమిటంటే, ఇది వినియోగించే దానికంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలదు, తద్వారా భవిష్యత్తులో వేగవంతమైన రియాక్టర్లకు ఇంధన సరఫరాలో స్వావలంబన సాధించడానికి సహాయపడుతుంది. రియాక్టర్ నుంచి ఉత్పత్తయ్యే అణు వ్యర్థాలను తగ్గించడం, అధునాతన భద్రతా ఫీచర్లతో, ఎఫ్ బి ఆర్ లు సురక్షితమైన, సమర్థవంతమైన , పరిశుభ్రమైన ఇంధన వనరును అందిస్తాయి. నికర సున్నా లక్ష్యానికి దోహదం చేస్తాయి. అణువిద్యుత్ కార్యక్రమం మూడో దశలో థోరియం వినియోగం దిశగా భారత్ కు ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఇది అందుబాటులోకి వస్తే రష్యా తర్వాత వాణిజ్యపరంగా ఫాస్ట్ రియాక్టర్ ను కలిగి ఉన్న రెండో దేశంగా భారత్ నిలవనుంది.

చండీఖోల్ లో ప్రధాని

రూ.19,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి, జాతికి అంకితం చేసి, శంకుస్థాపన చేయనున్నారు. ఆయిల్ అండ్ గ్యాస్, రైల్వేస్, రోడ్, ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, అటామిక్ ఎనర్జీ వంటి రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి.

పారాదీప్ రిఫైనరీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మోనో ఇథిలీన్ గ్లైకాల్ ప్రాజెక్టును ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు, ఇది భారత దేశం దిగుమతి పై ఆధారపడటాన్ని తగ్గించడంలో మరింత సహాయపడుతుంది. ఒడిశాలోని పారాదీప్ నుంచి పశ్చిమబెంగాల్ లోని హల్దియా వరకు 344 కిలోమీటర్ల పొడవైన ప్రొడక్ట్ పైప్ లైన్ ను ఆయన ప్రారంభిస్తారు. భారత దేశ తూర్పు కోస్తాలో దిగుమతి మౌలిక సదుపాయాన్ని పెంపొందించడానికి ప్రధాన మంత్రి పారాదీప్ లో 0.6 ఎంఎంటీపీఏ ఎల్ పీజీ ఇంపోర్ట్ ఫెసిలిటీని కూడా ప్రారంభిస్తారు.

ఈ ప్రాంతంలో రహదారుల మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి జాతీయ రహదారి-49 లోని నాలుగు లేన్ల సింఘార- బింజాబహల్ సెక్షన్ ను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేస్తారు. అలాగే ఎన్ హెచ్ -49 లోని నాలుగు లేన్ల బింజాబహల్- టిలిబానీ సెక్షన్, ఎన్ హెచ్ 18 లోని నాలుగు లేన్ల బాలాసోర్-ఝార్పోఖరియా సెక్షన్, ఎన్ హెచ్ -16 లోని టాంగి-భువనేశ్వర్ సెక్షన్ ను అంకితం చేస్తారు. చండిఖోల్ వద్ద చండిఖో ల్- పారాదీప్ సెక్షన్ ఎనిమిది లేన్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు.

రైల్వే కనెక్టివిటీని ఆధునీకరించడం, విస్తరించడంపై రైల్వే నెట్వర్క్ విస్తరణ కూడా ఆధార పడి ఉంటుంది. 162 కి.మీ.ల బన్సాపానీ - దైతారీ - టోమ్కా - జఖాపురా రైలు మార్గాన్ని ప్రధాన మంత్రి జాతికి అంకితం చేస్తారు. ఇది ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ ఫెసిలిటీ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, కియోంఝర్ జిల్లా నుండి ఇనుము , మాంగనీస్ ఖనిజాన్ని సమీప ఓడరేవులు, ఉక్కు కర్మాగారాలకు సమర్థవంతంగా రవాణా చేయడానికి వీలు కల్పిస్తుంది, ఇది ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదం చేస్తుంది.

దేశీయ, అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కళింగ నగర్ లో కాంకోర్ కంటైనర్ డిపోను ప్రారంభించనున్నారు. నార్లాలో ఎలక్ట్రిక్ లోకో పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్, కాంతాబంజిలో వ్యాగన్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్, బాఘుపాల్ లో నిర్వహణ సౌకర్యాల అప్ గ్రేడేషన్, విస్తరణకు శంకుస్థాపన చేయనున్నారు. కొత్త రైలు సర్వీసులను ప్రారంభించడం సహా ఇతర రైల్వే ప్రాజెక్టులను కూడా ఈ పర్యటనలో చేపట్టనున్నారు.

ఐఆర్ ఇఎల్ (ఐ) లిమిటెడ్ కు చెందిన ఒడిశా సాండ్స్ కాంప్లెక్స్ లో ఐదు ఎంఎల్ డీ సామర్థ్యం గల సీ వాటర్ డీశాలినేషన్ ప్లాంట్ ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసిన స్వదేశీ డీశాలినేషన్ టెక్నాలజీల క్షేత్ర అనువర్తనాల్లో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు.

కోల్ కతాలో ప్రధాని

ప్రధాన మంత్రి కోల్ కతా మెట్రోలోని హౌరా మైదాన్ - ఎస్ ప్లనేడ్ మెట్రో విభాగాన్ని, కవి సుభాష్ - హేమంత ముఖోపాధ్యాయ మెట్రో విభాగాన్ని, తారాతలా - మజేర్ హట్ మెట్రో విభాగాన్ని (జోకా - ఎస్ప్లానేడ్ మార్గంలో భాగం) ప్రారంభిస్తారు. రూబీ హాల్ క్లినిక్ నుండి రామ్వాడి వరకు పూణే మెట్రో; కొచ్చి మెట్రో రైల్ ఫేజ్ 1 ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ (ఫేజ్ ఐబి) ఎస్ఎన్ జంక్షన్ మెట్రో స్టేషన్ నుండి త్రిపునితుర మెట్రో స్టేషన్ వరకు; తాజ్ ఈస్ట్ గేట్ నుంచి మంకమేశ్వర్ వరకు ఆగ్రా మెట్రో; ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్టీఎస్ కారిడార్లోని దుహై-మోదీనగర్ (నార్త్) విభాగం మెట్రో మార్గాలను ప్రారంభిస్తారు. ఈ సెక్షన్లలో రైలు సర్వీసులను ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు. పింప్రి చించ్వాడ్ మెట్రో-నిగ్డి మధ్య పూణే మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 1 విస్తరణకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

ఈ విభాగాలు రహదారి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి , అంతరాయం లేని, సులభమైన, సౌకర్యవంతమైన కనెక్టివిటీని అందించడంలో సహాయపడతాయి. కోల్కతా మెట్రో హౌరా మైదాన్ - ఎస్ప్లనేడ్ మెట్రో విభాగం భారతదేశంలో ఒక శక్తివంతమైన నది కింద ఉన్న మొదటి రవాణా సొరంగాన్ని కలిగి ఉంది. హౌరా మెట్రో స్టేషను భారతదేశంలో అత్యంత లోతైన మెట్రో స్టేషను. అలాగే, మజెర్హాట్ మెట్రో స్టేషన్ (తారాతాలా - మజెర్హాట్ మెట్రో విభాగంలో ప్రారంభించబడుతోంది) రైల్వే లైన్లు, ప్లాట్ఫారమ్ లు, కాలువపై ఉన్న ఒక ప్రత్యేకమైన ఎలివేటెడ్ మెట్రో స్టేషన్. ఆగ్రా మెట్రో విభాగాన్ని ప్రారంభించడం వల్ల చారిత్రక పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. ఆర్ఆర్టీఎస్ విభాగం ఎన్సీఆర్లో ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుంది.

బెటియా లో ప్రధాని

బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లా బెటియాలో సుమారు రూ.8700 కోట్ల విలువైన రైలు, రోడ్డు, పెట్రోలియం, సహజవాయువుకు సంబంధించిన వివిధ మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన, అంకితం, ప్రారంభోత్సవం చేయనున్నారు.

109 కిలోమీటర్ల పొడవైన ఇండియన్ ఆయిల్ ముజఫర్ పూర్ - మోతీహరి ఎల్ పిజి పైప్ లైన్ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఇది బీహార్ రాష్ట్రం , పొరుగు దేశం నేపాల్ లో స్వచ్ఛమైన వంట ఇంధనానికి ప్రాప్యతను అందిస్తుంది. ప్రధాన మంత్రి మోతీహారిలో ఇండియన్ ఆయిల్ ఎల్ పిజి బాట్లింగ్ ప్లాంటు, స్టోరేజ్ టెర్మినల్ ను కూడా అంకితం చేస్తారు.

నేపాల్ కు పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతికి కొత్త పైప్ లైన్ టెర్మినల్ వ్యూహాత్మక సరఫరా కేంద్రంగా పనిచేస్తుంది. ఉత్తర బిహార్ లోని తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, గోపాల్ గంజ్, సివాన్, ముజఫర్ పూర్, షియోహార్, సీతామర్హి, మధుబని జిల్లాలకు ఇది సేవలు అందిస్తుంది. మోతీహరి ప్లాంట్ కు అనుబంధంగా ఉన్న ఫీడింగ్ మార్కెట్లలో సప్లై చైన్ ను సులభతరం చేయడానికి మోతిహరి కొత్త బాట్లింగ్ ప్లాంట్ సహాయపడుతుంది.

ఎన్ హెచ్ - 28ఎ లోని పిప్రకోఠి - మోతిహరి - రక్సౌల్ సెక్షన్ ను రెండు లేన్లుగా మార్చడం సహా రోడ్డు ప్రాజెక్టులను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఎన్ హెచ్ -104 లోని షియోహర్-సీతామర్హి-సెక్షన్ రెండు లేన్లు. గంగా నదిపై పాట్నా వద్ద దిఘా-సోనేపూర్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జికి సమాంతరంగా గంగానదిపై ఆరు లేన్ల కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, ఎన్ హెచ్ -19 బైపాస్ లోని బకర్ పూర్ హట్ - మాణిక్ పూర్ సెక్షన్ ను నాలుగు లేన్లుగా మార్చడ మొదలైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

ప్రధాన మంత్రి వివిధ రైల్వే ప్రాజెక్టులకు కూడా జాతికి అంకితం, ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. బాపుధామ్ మోతీహరి - పిప్రహాన్ మధ్య 62 కిలోమీటర్ల డబ్లింగ్ రైలు మార్గాన్ని జాతికి అంకితం చేస్తారు. నార్కటియాగంజ్- గౌనహా గేజ్ కన్వర్షన్ ను ప్రారంభిస్తారు. 96 కిలోమీటర్ల పొడవైన గోరఖ్ పూర్ కంటోన్మెంట్ - వాల్మీకి నగర్ రైలు మార్గం డబ్లింగ్, విద్యుదీకరణ; బేతియా రైల్వే స్టేషన్ పునారాభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. నార్కటియాగంజ్ - గౌనహా, రక్సౌల్ - జోగ్బానీ మధ్య రెండు కొత్త రైలు సర్వీసులను ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Waqf Law Has No Place In The Constitution, Says PM Modi

Media Coverage

Waqf Law Has No Place In The Constitution, Says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to participate in ‘Odisha Parba 2024’ on 24 November
November 24, 2024

Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.

Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.